flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Thursday, January 30, 2014

సూర్యోదయం

ప్రతి సూర్యోదయం ఎంతో అందాన్ని తన సొంతం చెసుకుంటుంది.
కొన్ని సూర్యోదయాలను మీకు చూపాలని నా ప్రయత్నం.....












Tuesday, January 28, 2014

గంగా మాత

ప్రకృతిని పూజించే సంస్కృతి మనది. అందులోను జీవనాధారమైన నీటికి నిలయమైన నదులను దేవతలుగా పూజిస్తాం. జనజీవితమంతా నదులతోనే ముడిపడి ఉంది. నదులు ప్రవహించే ప్రాంతాలే నగరాలైనాయి. నాగరికత పెంపొందించటానికి నదులే కారణం. 'హిందు' అనే పదం సింధు నుంచే వచ్చింది. చినుకులా రాలి, ఏరులై పారి, నదులుగా మారి, వరదలై పొంగి, కడలిచేరే దశలలో ఎన్ని మలుపులు! ఎన్ని సొగసులు! ఎన్ని కడగండ్లు! ఎన్ని పరిమాణాలు! కఠిన శిలల్లో ప్రయాణం, అవరోధాలను అధిగమించటం, కాలుష్యాలను భరించటం, పయనించినంత దూరం నేలతల్లిని సస్యశ్యామలంగా మార్చటం, పుణ్యక్షేత్రాలలో భగవంతునికి తనవంతు కైంకర్యం సమర్పించటం, క్షేత్రాన్ని తన తీర్థంతో పావనం చేయటం, ఉపనదులను కలుపుకోవటం, ప్రకృతి భీభత్సాలను భరించటం, నాగరికత తెచ్చే మార్పులన్నీ సహించటం చూస్తే నది మనకు ఒక మహోన్నత మార్గదర్శిగా కనిపిస్తుంది. నదీతీరాలన్నీ పుణ్యక్షేత్రాలకు నిలయాలే. నది మన సంస్కృతిలో ఎంత ప్రధానపాత్ర వహిస్తుందంటే మనం సంకల్పం చెప్పుకుంటూ, మన ఉనికి తెలుపుతూ (గంగా గోదావర్యోర్మధ్యప్రదేశ్) ఏఏ నదుల మధ్య ఉన్నామో చెప్పుకుంటాం.

వామనావతారంలో ఆకాశానికెత్తిన విష్ణుపాదాన్ని బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళతో కడిగాడట. ఆ పవిత్ర జలమే విష్ణు పాదోద్భవ అయిన గంగానదిగా అవతరించింది.

పరమశివుడు తన జటాజూటంనుండి గంగను వదిలేటప్పుడు, ఆయన దాన్ని ఏడుపాయలుగా వదిలాడు. మూడు పాయలు (హ్లాదిని, పావని, నళిని) తూర్పు దిక్కుగా ప్రవహించాయి. మరో మూడు పాయలు (సుచక్షువు, సీతా, సింధు) పశ్చిమ దిక్కుగా వెళ్ళాయి. ఏడవపాయ భగీరధుడిని అనుసరించి వచ్చింది. భగీరధుడు ఒక దివ్యరధంలో ముందు ప్రయాణం చేస్తుండగా, గంగ ఆ రధం వెనకే ఉరవళ్ళు, పరవళ్ళతో ప్రవహిస్తూ వెళ్ళింది, ఈ ప్రయత్నానికి సమకట్టిన భగీరధుని పేరుమీదుగానే ఆ నదికి భాగీరథి అని పేరు వచ్చింది.

భాగీరధి, జాహ్నవి, అలకనంద ఉపనదులు కలసి హరిద్వార్ వద్ద గంగగా ప్రయాణం సాగించాయి. నదులన్నీ ఆ గంగాదేవికి ప్రతిరూపాలుగానే భావిస్తారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమాన్ని 'త్రివేణి సంగమం' అంటారు. ఆ పవిత్ర భూమి ప్రయాగ. యమున సూర్య తనయ. జన్మస్థానం యమునోత్రి.
నీలమేఘశ్యాముని యమునా తీర రాసలీలలకు ప్రత్యక్షసాక్షి. తాను నల్లగా వుండి ఆ నల్లనయ్యనకు ప్రీతిపాత్రురాలైంది.
ఇక సరస్వతి బ్రహ్మపత్ని. వాగ్దేవి, జ్ఞాన ప్రదాయిని. త్రివేణి సంగమ ప్రాంతంలో సరస్వతి అంతర్వాహిని, పన్నెండేళ్ళకొకసారి గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలొస్తాయి. ఉదాహరణకు గురుడు మేషరాశిలో ప్రవేశిస్తే గంగాక్, కర్కాటకరాశిలో ప్రవేశిస్తే యమునకు, మిథునరాశిలో ప్రవేశిస్తే సరస్వతికి సింహరాశిలోకి ప్రవేశిస్తే గోదావరికి, తులారాశిలోకి వస్తే కావేరికి, కన్యారాశిలోకి వస్తే కృష్ణా నదికి ఇత్యాదిగా పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో ఆయా నదులలో సమస్త దేవతలు ఉంటారనీ, పుష్కర స్నానం పాపాలను కడిగివేస్తుందని అంటారు.


Saturday, January 25, 2014

గాజులు

      అతివ చేతికి అందాన్ని ఇచ్చేవి గాజులు.అసలు గాజులు  ఇష్టపడని  స్త్రీ ఎవరైనా ఉంటారా  చెప్పండి!
చేతికి గాజులులా,కళ్ళకు కాటుకలా,నుదుటికి తిలకంలా,రాధకు మాధవుడు.. అన్నారు నారాయణరెడ్డి.
ఇంటిలో గాజుల చప్పుడుతో ఆడవారు తిరుగుతూవుంటే..... వాహ్ ఆ అందమే వేరు.మళ్ళీ ఇందులో ఎన్నెన్ని రకాల గాజులని...పెళ్ళికూతురు గాజులు వేరు.ఫంక్షన్ గాజులు,సీమంతపు గాజులు,కాలేజ్ పిల్లలు వేసుకునే గాజులు ఇంకా ఎన్నో రకాల రంగు రంగుల గాజులు చూస్తూనే మైమరచిపోతాం.
                                                                రంగు రంగుల గాజులు 

 అందాల గాజులు 

   గాజులతో అతివల ముఖంలో కాంతి చూడండి 

అందమైన గోరింట చేతులకు గాజుల అందం చూడండి



 కాలేజ్ పిల్లల గాజులు  



రాళ్ళ గాజులు 


బంగారు గాజులు  


 సీమంతపు గాజులు  

రకరకాల గాజులు  








               






Thursday, January 23, 2014

అద్దం


పూర్వం చైనాలో మొట్టమొదటిసారిగా అద్దాన్ని తయారు చేసిన లోహకారుడు దానిలో తన ప్రతిబింబాన్ని చూసి,"ఓ దేవుడా!నా తండ్రి స్వర్గం నుండి దిగివచ్చాడు"అన్నాడు.అతడు తనలోతను మాట్లాడుకోవటం చూసిన అతని భార్య అటుగా వచ్చి అద్దంలోకి తొంగి చూసి కోపంతో 'ఇంకో అమ్మాయితో కబుర్లు చెపుతున్నవా'? అని కేకలు వేసింది.
దానికతడు అమ్మాయితో కాదు,నా తండ్రితో మాట్లాడుతున్నను అన్నాడు.ఆమె ఇంకా రెచ్చిపొయి చాటుగా ఇంకో అమ్మాయితో ముచ్చట్లు చెపుతూ అబద్ధాలు కూడానా!ఏదో కధ నడిచేవుంటుంది అంది గట్టిగా.
అటు వెడుతున్న పక్కవీధి వ్యాపారి వారి గొడవకు కారణమైన అద్దంలోకి తొంగిచూసి నిశ్చేష్టుడయ్యాడు.మండిపడుతూ ఈ ప్రాంతానికి నేనొక్కడినే వ్యాపారిని కదా!మరి ఇతనెక్కడినుండి వచ్చాడు?అంటూ ఆగ్రహంతో అద్దాన్ని నేలకేసి కొట్టాడు.అది ముక్కలు ముక్కలయ్యింది.అతనేకనుక వివేకవంతుడైతే ఇలా జరిగేది కాదు కదా!
ఐతే ఫార్ములా వుందికదా మళ్ళీ తయారు చేశారనుకోండి......  

     
       

Tuesday, January 21, 2014

పుత్తడిబొమ్మ పూర్ణమ్మ

తెలుగువారి ఆడపడుచు పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ను తెలుగు వారికి గర్వకారణమైన గొప్ప సంఘసంస్కర్త,కవి గురజాడ అప్పారావు గారు ఎంతో అందంగా మలచారు.ఈ గొప్ప కావ్యం మన సాంఘిక జీవనంలో గొప్ప మార్పుకు కారణమైంది.పూర్ణమ్మ గాధ వింటే ఎవరికైనా   కంటతడి కాక మానవు.బంగారుతల్లిని ఒకసారి తలచుకుందామా....  


   




Sunday, January 19, 2014

ఒకరికొకరు


                                                                                                    ఒకరికొకరు


చిన్ని ఆశ



ఒక నావికుడు తుఫానులో తన పడవను కోల్పోయి ఏదో దైవవశాత్తు ప్రాణాలతో ఒక దీవిలోకి వెళ్ల గలుగుతాడు ... కట్టు బట్టలతో బయట పడినా... ప్రాణాలు దక్కాయని సంతోష పడతాడు... ఇక ఆరోజు నుండి ఆ దీవి నుండి బయట పడటానికి శత విధాలా ప్రయత్నిస్తాడు.. కానీ అతని ప్రయత్నాలేవీ ఫలించవు... చివరికి విసిగి విసిగి వేసారీ.. అక్కడే నివసించేందుకు మానసికంగా సిద్ధపడతాడు... అతను రోజు... ఏదో ఒక వస్తువు సేకరించటం చేస్తూ...... చివరికి స్వంతంగా ఒక గుడిసెను ఏర్పరచుకుని... కావలసిన వస్తువులన్నిటినీ సమ కూర్చుకో సాగాడు... జీవితం హాయిగా గడచి పోతుందనుకున్న సమయంలో ... ఒకసారి ఆహారానికి బయటకు వెళ్ళిన సమయం లో  నిప్పు వలన అతని గుడిసె మరియు అతను సమకూర్చుకొన్న అన్ని వస్తువులు తగుల పడి పోతాయి... మళ్ళీ అతను నిలువ నీడ లేక ఒంటరిగా మిగిలి పోయే పరిస్థితి ... ఈ సారి అతను హృదయ విదారకంగా రోదిస్తూ... హే భగవంతుడా... నన్ను ఎందుకు ఇలా పరీక్ష పెడతావు... నాతో  ఇంకా ఎందుకు ఆడుకుంటావు...... నా ద్వారా  ఇంకా ఏమి చేయాలనుకుంటూ న్నావు ..... నీ ప్రయత్నం నాకు అర్ధం కావటం లేదు... దయ చేసి నాకు తెలియచేయి... అని హృదయ పూర్వకంగా రోదిస్తూ అడుగుతాడు.... అపుడు ఆ ధ్యానంలో ఉండగానే.. ఒక ఓడ వచ్చి అతని దగ్గర ఆగి... ఓ బాబు... నీవు ఇక్కడ చిక్కు పడినట్లు ఉన్నావు ... మేము వెళ్ళబోతూ పైన ఏర్పడిన పొగను చూసి... ఎవరో ఆపదలో ఉన్నారని గ్రహించి ఇక్కడకు వచ్చాము... వచ్చి ఈ ఓడ ఎక్కు మిమ్మలిని మీ గమ్యం చేరుస్తాం... అని అడుగుతాడు... అపుడు అర్ధమవుతుంది... ఆ నావికుడికి  దేవుడు ఏమిచేశాడో... మనకు ఒక్కొక్కసారి సమస్యలు వచ్చినపుడు ... దేవుడిని ఆ సమస్య తీర్చమని అడుగుతూ ఉంటాం .. అది సరికాదు... దేవుడు మనతో ఏమి చేయించాలని అనుకుంటు న్నాడో మనకు తెలియదు... అందుకే అపుడు మనం చేసే ప్రార్ధన... పై విధంగా ఉండాలి... అపుడు ఖచ్చితంగా దేవుడు బదులిస్తాడు... మనం నడి సముద్రంలో చిక్కుకు పోయామని కట్టు బట్టలతో మిగిలామని బాధ పడనవసరం లేదు... ఇవన్నీ లేకపోయినా ఎలా జీవించవచ్చో... మనకు నేర్పాలని అనుకుంటూ న్నడేమో దేవుడు... అందుకే సమస్య వచ్చినపుడు... ఆ సమస్యను తీర్చమనే దానికన్నా... ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని అడగటం మంచిది...


Wednesday, January 15, 2014

సంక్రాంతి శోభ

                      ప్రకృతితో మనిషి సహజీవనం చేసే అసలైన పండుగ సంక్రాంతి
 రంగవల్లులు,భోగిపండ్లు,బొమ్మలకొలువులు,పల్లెసీమలు,గంగిరెద్దులు,హరిదాసులు,కోడిపందాలు,పతంగులు,ఎడ్లపందాలు,ధాన్యపురాసులు,గోమాతలపూజలు,అంతకుమించి అమ్మ చెసే పిండివంటలు....ఇవన్నీ కలగలిపి చేసుకునే అపురూపమైన అతి పెద్దపండుగే సంక్రాంతి.. కస్టాలు భోగిమంటల్లో ఆహుతై ఈ సంక్రాంతి నుండి కొత్త ఆశల కిరణాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రసరించాలని కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు.
   సంక్రాంతి పండుగలో ముఖ్యంగా సూర్య భగవానుడుకి నివేదించే నివేదన 'పొంగలి '' ఈ పొంగలిని కొత్త కుండలో ఆవుపాలను పొంగించి ,మిగిలిన పాలతో పొంగలిని తయారుచేస్తారు .దానివలన ఆ ఇంటి సిరిసంపదలు పొంగి ప్రవహించాలని కోరుకుంటారు .ధాన్య లక్ష్మి ఇంటికిచేరిన ఈ సమయంలో కొత్తబియ్యము ,పాలు ,చెరకురసం ,ఆవు నెయ్యి కలిపి పొంగలి చేస్తారు .దీనిని సూర్య భగవానుడుకి నివేదన చేస్తారు .ఈ పండుగ రోజున సూర్యుడినిపూజించటం వలన ఇల్లంతా సిరి సంపదలతో వృద్ది చెందుతుందని భావిస్తారు .
  చిన్నప్పుడు చూసిన గంగిరెద్దుల ఆట ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. సన్నాయి, డప్పువాయిద్యం లయబద్దంగా వాయిస్తుంటే కాళ్ళకి గజ్జెలు కట్టిన బసవన్న నాట్యం చేసేది. `అయ్యవారికీ దణ్ణం పెట్టు, అమ్మగారికీ దణ్ణం పెట్టు,` అంటే ముందరి కాళ్ళు రెండూ పైకెత్తేది. ఎర్రని గుడ్డ చుట్టబెట్టిన మూపురం బసవన్న అడుగులు వేస్తుంటే చక్కగా ఊగేది. మూపురం వెనుకనుంచి తోకవరకూ కప్పిన రంగురంగుల మువ్వల బొంత, దానిమీద పరిచిన కండువాలు, పట్టుచీరలు; వీటన్నింటికీ మించి వొంపుతిరిగిన కొమ్ములకి చివరిలో తళతళా మెరిసే ఇత్తడి తొడుగులు. సూత్రదారుడు చెపితే పీటమీద నిలబడేది, అతను వెల్లకిలా నేలమీద పడుకొంటే గుండెలమీద కాళ్ళు ఆనించి నిలబడేది.

ఒకరకమైన యాసతో కర్ణపేయంగా గంగిరెద్దులవాడు ఓ నాలుగు ముక్కలు చెపుతుంటే పండుగ కళ వస్తుంది. ఎర్రటి తలపాగాలు ధరించి, తెల్ల పంచ, చొక్కా, దానిమీద నల్ల కోటూ వేసుకొని పాతబడ్డలు కావాలని, బసవన్నకి బియ్యం ఇవ్వమని, డబ్బులు కావాలని అడుగుతారు.

                                                            సంక్రాంతి ముగ్గు

                                                                భోగి మంటలు

 సంక్రాంతి గొబ్బిళ్ళు

పొంగళ్ళు

పల్లె ముంగిళ్ళలో ధాన్యలక్ష్మి

 హరిదాసు 

 గాలిపటాల సరదాలు 

గంగిరెద్దుల మేళాలు

 గోమాతల పూజ 



 బొమ్మల కొలువు 

భోగిపండ్లు పేరంటం 

నవ్వులు ప్రతి ఇంట పూయాలని నువ్వు, బెల్లాలు 

బూరెలు 

సంక్రాంతి అరిసెలు 

 పూతరేకులు 

 మైసూర్ పాకం 

ఈ సంక్రాంతి శోభ ప్రతి ఇంటా పూయాలని ఆకాంక్ష.......