flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Friday, February 28, 2014

దొరకని మందు.

కాసేపు సరదాగా.... నవ్వుకోండి ..
                                                                                                         




                                                                                                            














Ħ!m@ﻝ@웃












Tuesday, February 25, 2014

అమ్మప్రేమ

అమ్మా ! ఎంత గొప్పది నీ ప్రేమ.
నిను సృష్టించిన  బ్రహ్మకైనా వుందా ఇంతటి కారుణ్యం.


ஃᅔℋIℳÅℐÅᅕஃ

Monday, February 24, 2014

పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు...

పూవులేరి తేవేచెలి.. అని ఎంత సుందరంగా రచించారు మన దేవులపల్లి వారు.

ఫిబ్రవరి 24, 1980 తారీకున సుమధుర భావ వీచికలను తెలుగు నేల నలుచెరగులా ప్రసరింపచేసిన ఆంద్ర షెల్లీ దివిగేగిన రోజు .
అసలు కృష్ణశాస్త్రి గారు నిజంగా స్వర్గవాసి అయ్యారా అని చాలా రోజులు సందేహం తో గడిపిన జ్ఞాపకం కూడా ఉంది. ఐతే, పాంచభౌతిక జీవులకు శారీరకంగా అది తప్పదు కదా ఎప్పటికైనా అని  సంబాళించు కున్న తరుణం కూడా ఉంది.
దిగిరాను దివినుండి భువికి అని భీష్మించు కోకండి కృష్ణశాస్త్రి గారూ, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండండి అని ఆక్రోశించిన క్షణాలూ ఉన్నాయి.
'ఏలొకో యెప్పుడో యెటులనో గాని
మాయ మయ్యెద నేను మారిపోయెదను' అని అసలు ఎందుకన్నారు మీరు అని ఆయనపై నిష్టూరాలాడిన సందర్భమూ ఉంది. అయినా మీకేం లెండి, 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు' అంటూ పాడేసిన స్వేచ్ఛాగానప్రియులు మీరు, మా మాట వింటారా మీరు అని విసుక్కున్నది కూడా ఉంది.
కృష్ణ పక్షము, ప్రవాసము,ఊర్వశి తో మొదలు పెట్టి ఆయన వచన రచనలూ,రేడియో రూపకాలూ,వ్యాసావ ళీ, సినిమా పాటల సంకలనాలూ (మేఘమాల మొ.) అన్నీ చదివితే కాని ఆ రోజుల్లో ప్రాణం కుదుట పడలేదు. మల్లీశ్వరి లో "కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని, వానజల్లుగ కురిసిపోవా కన్నీరు ఆనవాలుగా బావ మ్రోల"; 'గడియ యేని ఇక విడిచిపోకుమా, ఎగసిన హృదయము పగుల నీకుమా" అనే లైనులు ఎన్నిసార్లు తలచుకుని రసానందాన్ని పొందానో లెక్కే లేదు.
" నల్లమబ్బుల నింగి నా సౌధ రాజమ్ము
నల్లమబ్బే ప్రియుడు, నన్ను కొరకుమా !"
ఆడుచును బాడుచును హాయిగా నవ్వుచును
పాడు మేఘాలతో పరుగెత్తె మెరపు! -- అంటూ చిన్ని చిన్ని పదాలతో మనోహరంగా చెప్పే తీరు యెంత ఆకట్టుకున్నదో !
'నీలాభ్ర సరసిలో నిండు జాబిల్లి
రాయంచ వలె విహారము సలిపె' అన్నా,

'నా విరుల తోట లో పెంచికొన్నాడ నొక్క
పవడపు గులాబి మొక్క నా ప్రణయ జీవ
నమ్ము వర్షమ్ము గా ననయమ్ము కురిసి ...
ఎట్టులది దాపురించెనొ ఏమొ యంత
నాకుసందుల త్రోవల నల్ల దిగియె
నొక్క క్రూరార్క కిరణమ్ము; ఉర్వి వాలి
నా గులాబి సోలి తూలి నన్ను వీడె.
అపుడు నావైపు చూచి, నా యలరు లేని
శూన్యమౌ మ్రోడు మ్రాకును జూచి, యొక్క
కోకిలమ్ము కో యని యేడ్చే గొంతు నెత్తి!
మా కొరకు దారి బోయెడు మందపవను
డొకడు జాలిగ నొక్క నిట్టూర్పు విసరె! ' అన్నా కృష్ణ శాస్త్రి గారికే చెల్లింది.
ప్రతి భావానికీ సరిగ్గా తగిన పదం ఉంటుంది, దాన్ని వెతకాలి, పట్టుకోవాలి, అప్పుడే అది కవిత్వం అవుతుంది అని ఆయన అనేవారు. ఆ మాట ఆయన పట్ల అక్షర సత్యం.
ఆ కవికుల చక్రవర్తికి నా నమస్సులు.

Wednesday, February 19, 2014

ఎనిమిది(8)ప్రత్యేకత


          అష్ట మహిషులు 

1.రుక్మిణి     2.సత్యభామ
3.జాంబవతి   4.మిత్రవింద
5.భద్ర      6.సుదంత
7.కాళింది    8.లక్షణ.

        అష్ట దిగ్గజములు

1.ఐరావతము    2.పుండరీకము
3.వామనము    4.కుముదము
5.అంజనము    6.పుష్పదంతము  
7.సార్వభౌమము  8.సుప్రతీకము.    

       అష్ట సిద్ధులు 

 1.అణిమ       2.మహిమ
3.గరిమ        4.లఘువు  
5.ప్రాప్తి         6.ప్రాకామ్యము  
7.ఈశత్వము     8.వశత్వము

      అష్టవిధ వివాహములు 

1.బ్రహ్మము    2.దైవతము
3.ఆర్షము     4.ప్రజ
5.పత్యం      6.రాక్షసం
7.గాంధర్వం    8.పైశాచికము

     అష్టాంగపూజ    

 1.ముగ్గు    2.సుగంధము
3.అక్షతలు    4.పుష్పములు
5.ధూపము    6.దీపము
7.ఉపాహారము  8.తాంబూలము.

Friday, February 14, 2014

నా దేవత



పుట్టబోయే పాప దేవుని అడిగింది.
"ఓ దేవుడా! మీరు రేపు నన్ను భూమి మీదకు పంపిస్తున్నారుకదా!కానీ నేను అక్కడ ఎలా జీవించాలి?నేను చాలా చిన్నదాన్ని, నిస్సహాయురాలిని".
దేవుడు చెపుతాడు,"అక్కడ ఒక దేవత ఎదురు చూస్తొంది నీకోసం ,నీ భద్రత,నీమంచి చూసుకోవడం కోసం.
పాప అడిగింది."నాకు రక్షణ ఎవరు"?
దేవుడు  చెపుతాడు ,నీ దేవత....
తన ప్రాణాలకు తెగించి నీకు జన్మనిస్తోంది.
పాప అడిగింది,"దేవుడా  దయచేసి  నాకు చెప్పవా? నా దేవత పేరు ఏమిటో"!
దేవుడు చెపుతాడు,అమ్మ అని పిలిస్తే చాలు
ఆవిడే మీ అమ్మ.

Sunday, February 9, 2014

'పూవులేరి తేవే చెలి '

'పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు '      
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భావమెంత సుకుమారం..


Saturday, February 8, 2014

అమ్మప్రేమ

చదువు రాని అమ్మయినా
       బిడ్డకు బుద్ధి చెప్పగలదు,..
డబ్బులేని అమ్మయినా
            పిల్లల కడుపునింపగలదు,..
కాళ్ళు లేని అమ్మయినా
            వెలుగు దారి చూపగలదు,..
ఆపదలో చేయూతగా
            చేయి అందుకోగలదు,..


             










 అవరోధాలు లెక్క చేయనిది
అమ్మప్రేమ ఒక్కటే కదా!!!
                                                                                               
         

కాలుష్యం

మీ పాపానికి  ఠారెత్తిన భూతాపం చల్లార్చిన మాపైనా!మీ ప్రతాపం


మిమ్మల్ని కబళించే కాలుష్యం కరిగిస్తూ
అలసిన మీకు చల్లని గాలుల సేద తీర్చుతూ
అమృత ఫలాల తో ఆకలి తీర్చే మా పైనా మీ అమానుషత్వం ....
జాలిలేని మానవుడా మా జోలికి రావొద్దు ...

Thursday, February 6, 2014

తులసి

మూలికలలో మహారాణి తులసి......

తులసి అనే సంస్కృత పదం. తులసి అంటే సాటిలేనిది అని అర్థం.

"యన్మూలే సర్వతీర్థాని సన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్ " అని శాస్త్రాల్లో చెప్పబడింది.

తులసి మొక్క మధ్య భాగంలో అంటే కాండం నుంచి సమస్త దేవీదేవతలు అగ్రభాగమందు నాల్గువేదాలు, మూలస్థానమందు సర్వతీర్థాలు నివాసముంటాయి. అటువంటి తులసికి నమస్కరిస్తున్నానన్నదే పై శ్లోకం అర్థం.

మన జీవన విధానానికి ప్రకృతి ఆలంబన. ప్రకృతిలో ముడిపడి సాగే జీవనసరళిలోని పురాణగాథలలో అంతర్లీనంగా ఎన్నో వైజ్ఞానిక అంశాలు ఉన్నాయి. పురాణగాథలో ముడిపడిన జీవనశైలిలోని ఆచార వ్యవహారాలన్నీ మానవ జీవన వికాసానికి తోడ్పడతాయి.

తులసిలో మనకు తెలిసిన కృష్ణతులసి, లక్ష్మితులసితో పాటు రామతులసి, అడవితులసి, నేలతులసి, మరువకతులసి, రుద్రజడతులసి, కర్పూరతులసి ఇలా ఎన్నో రకాలున్నాయి.

కర్పూరతులసి తైలాన్ని ఓషధీయుత టాయ్‌లెట్స్ సాధనాల తయారీలో విరివిగా వాడతారు. ఈ నూనెను చెవినొప్పికి, క్రిమికీటకాలు, బ్యాక్టీరియాను నిరోధించడానికి ఎక్కువగా వాడతారు.

శ్వాస అవరోధ రుగ్మతలను నయం చేయడానికి రామతులసిని ముందుగా వాడతారు. మలేరియాను రామతులసి నయం చేస్తుంది.

అజీర్ణం, తలనొప్పి, హిస్టీరియా, నిద్రలేమి, కలరా వంటివి నయం చేయడానికి తులసిలో మందు ఉంది. రుగ్మతల్ని నయం చేసే గుణాలుగల తులసి మూలికల్లో మహారాణిగా శతబ్దాల తరబడి ప్రసిద్ధి గాంచినది.



                                                                                                            нιмαנα●•ツ

Wednesday, February 5, 2014

చెలిమి

కల్మషం తెలియని పసి మనసులు
చేరువైన స్వచ్చమైన చేయూతలు
ఏమి ఆశించక దగ్గరకు  తీసే ఆత్మీయత
ఉన్నది పంచుకునే పసి హృదయాలు
కలసి మెలసిన చెలిమికి చిరునామా
అందమైన ఈ అనుబంధపు అభిమానం... !!
   ఎన్నాళ్ళో ?



Tuesday, February 4, 2014

సహస్ర శివలింగాలు

ప్రవహించే నదిలోని సహస్ర శివలింగాలు

సిర్సి సందర్శించేవారు సహస్ర లింగ ప్రదేశాన్ని చూడవలసిందే. దీని అర్ధం వేయి లింగాలని చెపుతారు. ఈ ప్రదేశం సిర్సి పట్టణానికి 10 కి.మీ. దూరంలో శాలమాల నది ఒడ్డున ఉంది. దట్టమైన అడవులు గుండా ఈ నది ప్రవహిస్తుంది. ఈప్రదేశానికి వేడుకలు లేదా మహా శివరాత్రి పండుగలు తప్పితే, సాధారణంగా యాత్రికులు ఇచ్చటకు రారు. పండుగలలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ దేవాలయానికి శివ భక్తులు అధికంగా వస్తారు. పూజలు చేయటమే కాక పర్యాటకులు ఈ దేవాలయంలోని ప్రవహించే నదిలోని సహస్ర శివలింగాలను దర్శించేందుకు కూడా వస్తారు. ప్రతి లింగానికి ఎదురుగా ఒక నంది కూడా ఉండడం గమనార్హం.
ఓం నమశివాయ —
(గుంటూరు నారయణ గారు మూల రచన)

Monday, February 3, 2014

నీరు

ఒకరేమో నీటిలో ఆటలు


                                                ఒకరేమో నీటికోసం పాట్లు..



Saturday, February 1, 2014

ఈ బొమ్మకు కామెంట్సు పెట్టరూ......