flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Wednesday, March 26, 2014

చిత్రగ్రీవం


          నా పెంపుడు పావురం పేరు చిత్రగ్రీవం."చిత్ర"అంటే ఉల్లాసభరితమైన రంగులతో నిండిన,"గ్రీవం"అంటే కంఠం.నా పావురం మెడ చిత్ర విచిత్ర భరితం అన్నమాట.అందుకే నా పావురాన్ని హరివిల్లు మెడగాడు అని ముద్దుగా పిలుస్తంటాను. అందంలో దానికి సాటి రాగల పావురం మా వూళ్ళోనే లేదని స్పస్టమయింది.  
  చిత్రగ్రీవం తల్లిదండ్రులు  గురించి చెప్పుకుందాం. దాని తండ్రి పక్షి ఓ గిరికీల మొనగాడు.తల్లి పక్షి ఓ వార్తల పావురం.ఆ రోజుల్లో అది అతి సుందరమైన కులీన వంశానికి చెందిన పావురం.ఆ రెండు పావురాలు జతకట్టాయి.గుడ్లు పెట్టాయి. వాటికి పుట్టిన చిత్రగ్రీవం  అందువల్లనే తరవాతి రోజుల్లో యుద్ధరంగాల్లోను,శాంతిదూతగాను పనిచెయ్యగల పావురంగా రూపొందింది.తల్లిపక్షి నుండి తెలివితేటలు సంపాయించుకుంది.తండ్రిపక్షి  నుండి  వేగం,చురుకుదనం,సాహసం సంతరించుకుంది.అలా సమకూర్చుకున్న శక్తియుక్తుల పుణ్యమా అని అది యెన్నోసార్లు శత్రువుల దాడి నుంచి అఖరిక్షణంలో దాడి చేస్తున్న డేగల తలలమీద నుండే గిరికీలు కొట్టి  తప్పించుకునేది.
 ఇంకా గుడ్డులో వున్నప్పుడే చిత్రగ్రీవం ఓ ప్రమాదం లోంచి ఎలా తప్పించుకుందో ముందు చెపుతాను.ఆరోజు నేను ఎప్పటికి  మరచిపోలేను. తల్లిపావురం పెట్టిన రెండు గుడ్లలో ఒకదానిని పొరపాటున జారవిడిచి పగులగొట్టిన రోజది.ఆ తెలివిమాలినపనికి నేను ఈనాటికీ సిగ్గుపడుతూ వుంటాను. బాధపడుతూవుంటాను. నేను పగులగొట్టిన ఆరెండోగుడ్డులో ప్రపంచంలోకెల్లా అతి విశిస్టమైన పావురం వుండేదేమో.ఎవరికి తెలుసు!ఆ దుర్ఘటన ఇలా జరిగింది.
మా మేడమీద పావురాల గూళ్ళు వుండేవి.  తల్లిపావురం గుడ్లు పొదుగుతున్న గూటిని నేను ఓ రోజు శుభ్రం చేద్దామని వెళ్ళాను.ఆ సమయంలో తండ్రిపక్షి వచ్చి గుడ్లని నేనేదో చేస్తున్నానని నా మొహం రక్కింది.ఆ హడావుడిలో గుడ్డు జారవిడిచాను.అలా ఆగుడ్డు పగిలిపోయింది.

 




   సరే మళ్ళీ కథలోకి వద్దాం.గుడ్డు పైపెంకును ముక్కుతో పొడిచి పిల్లపక్షిని ఈ ప్రపంచంలోకి ఎప్పుడు తీసుకురావాలో తల్లిపక్షికి కచ్చితంగా తెలుసు.ప్రాణం పోసుకొని పిల్ల పక్షిగా రూపొంది ప్రపంచంలొకి అడుగు పెట్టటానికిసంసిద్ధమయే శుభముహుర్తం వచ్చిందని తల్లిపక్షికి అంత కచ్చితంగా ఎలా తెలుస్తుందీ అన్నది మన ఊహకందని విషయం.  ఇదంతా నాకు అధ్బుతంగా అనిపిస్తుంది.నా చిత్రగ్రీవం బయటకు వచ్చే  శుభసమయం రానేవచ్చింది. తల్లిపక్షిలో ఏదో దివ్యసంకల్పం.తల నిక్కించి గురిచూసింది. రెండే రెండు ముక్కుపోట్లతో గుడ్డును పగులగొట్టింది.పిల్లపక్షి బయట పడింది. ఒళ్ళంతా ముక్కు..చిన్నపాటి శరీరం. తల్లిపక్షి దానిని తన రొమ్ములోని నీలి ఈకలమాటున పొదువుకొంది.  పక్షిప్రపంచంలో రెండు దృశ్యాలు అతి మనోహరమైనవి.గుడ్డు పగులగొట్టి పిల్లపక్షిని ఈ ప్రపంచపు వెలుగులోకి తీసుకురావడం,అలా వచ్చిన పిల్లపక్షి నోటికి ఆహారం అందిస్తూ తల్లిపక్షి పెంపకం కొనసాగిచతం రెండోది.చిత్రగ్రీవం పెంపకం ఎంతో అనురాగంతో సాగింది. మనం చిన్నపిల్లలను ఎత్తుకొని లాలిస్తే ఆ పిల్లలకు యెంతటి హాయి,సౌఖ్యము  లభిస్తాయో చిత్రగ్రీవానికి తన తండ్రిపక్షి తల్లిపక్షి నుండి అలాంటి వెచ్చదనం లభించింది.
  పుట్టిన రెండోనాటినుంచే చిత్రగ్రీవం తన తల్లో తండ్రో గూటికి వచ్చిన ప్రతిసారీ  తన ముక్కు తెరచి గులాబీరంగు ఒంటిని బంతిల వుబ్బించటం నాకు బాగాగుర్తంది.మా చిత్రగ్రీవానికి ఆకలెక్కువ.తల్లిపక్షి తనదగ్గరేవుండి బాగోగులు చూస్తుండగా తండ్రిపక్షి ఆహారసేకరణలో నిమగ్నమై వుండేలా చేసేది చిత్రగ్రీవం.  తల్లిదండ్రుల శ్రమ,పాలనలో ఏపుగా పెరిగింది చిత్రగ్రీవం.గులాబీరంగు మారి పసుపు కలిసిన తెలుపురంగు  రంగురంగుల ఈకలతో అందంగాను,ముక్కు బాగా గట్టిపడి చక్కగా తయారైంది.ఐదో వారానికల్లా చిత్రగ్రీవం గూటినుంచి బయటకు గెంతి పావురాల గూళ్ళ దగ్గర వుంచిన మట్టి మూకుళ్ళలో నీళ్ళు తాగే స్థాయికి చేరింది. సొంతంగా ఆహారం సంపాదిచుకునే ప్రయత్నం చేస్తూ స్థూలంగా తన ఆహారంకోసం తల్లిదండ్రుల మీదే ఆధారపడి వుంది.


మరో రెండు వారాలు గడిచేసరికల్లా చిత్రగ్రీవం ఎగరడం నేర్చుకుంది.పుట్టింది పక్షి పుట్టుకే ఐనా ఎగరడం అన్నది అంత సులభంగా జరగలేదు.చిత్రగ్రీవాన్ని రోజూ తీసుకెళ్ళి పిట్టగోడమీద వదిలితే అది గంటల తరబడి కూర్చొని వుండేది తప్ప ఎగరటం అనే పని పెట్టుకోలేదు.కింద కొన్ని శనగ గింజలు పోసి తినమనిపిలిచాను.  అది గోడమీద పచార్లు చెయ్యడం మొదలుపెట్టంది.అలా నిరాశాభరితమైన నాటకం ఓ పావుగంట కొనసాగింది.చివరకు అది సంకోచాన్ని అధిగమించి కిందకు దూకనే దూకింది.ఎగరడం అన్న మహత్తరఘట్టాన్ని చేరుకుంది చిత్రగ్రీవం.   తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పేపని చేపట్టింది. సాయంత్రం వేళ తండ్రిపక్షి గాలిలో గిరికీలు కొడుతూ చిత్రగ్రీవం పక్కన వచ్చి వాలింది.ఏమోయి !బడుధాయ్ మూడునెలలు వచ్చాయ్  ఇంకా ఎగిరే ప్రయత్నాలేం లేవా? భయమా?అసలు నువ్ పావురానివా,వానపామువా?అన్నట్టు చూసింది. చిత్రగ్రీవం వులుకు,పలుకు లేకుండా గంభీరంగా ఉండిపోయింది. తండ్రిపక్షికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే  చిత్రగీవం పక్కన చేరి  కువకువ అని గద్దించసాగింది.చిత్రగ్రీవం పక్కకు జరుగుతోంది.తండ్రిపక్షి పట్టు విడువకుండా కూతలు పెడుతూ పక్కకు జరగసాగింది. చిత్రగ్రీవం ఇంకా ఇంకా జరిగింది. తండ్రిపక్షి జరగటం ఇంకాకొనసాగించింది. చిత్రగ్రీవం పిట్టగోడ చివరకుజరిగి కిందపడే స్తితికి చేరింది. అలా జారబోయి స్వీయ రక్షణ కోసం అసంకల్పితంగా రెక్కలు విప్పార్చి గాలిలో తేలింది. నా సంతోషానికి అవధులు లేవు. అది చూసిన తల్లిపక్షికుడా బిడ్డకు సాయంగా గాలిలోకి ఎగిరింది. అలా పదినిముషాలు గాలిలో గిరికీలు కొడుతూ ఎగురసాగాయి. చిత్రగ్రీవం మాత్రం నానా పాట్లు పడుతూ రెక్కలు ముడిచి క్షేమంగా  వాలి ఉత్తేజంగా రొప్పసాగింది.  ఎలాగైతేనేం  చిత్రగ్రీవం విజయం సాధించింది. నాకిప్పడు చాలా సంతోషంగా ఉంది. చిత్రగ్రీవాన్ని చూస్తుంటే.

            ఈ కధ రచయిత ధనగోపాల్ ముఖర్జీ. ఈకధ 10వ తరగతి తెలుగు వాచకంలో(కొత్తపుస్తకంలో}పాఠ్యాంశంగా చేర్చ బడింది.


                                                                                         °ღ•ℋℐℳÁĴÁ●•٠·˙


Friday, March 14, 2014

తెలుగమ్మాయి

తెలుగమ్మాయి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు..
మన కట్టూ బొట్టూ సాంప్రదాయం వీటికి తిరుగులేదనిపిస్తుంది. వీటి అందచందాలు చిత్రీకరణ విదేశీ అమ్మాయిల చిత్రీకరణ కంటే కొంచెం కష్టమే మరి! అయినా మన సాంప్రదాయ దుస్తులే ఎక్కువ అందంగా వుంటాయనిపిస్తుంది నాకు. మరి మీకో?


తెలుగు  భాష ఎంత మధురమో తెలుగమ్మాయి అంత అందం.పోల్చటంలో కూడా "పదహారణాల తెలుగమ్మాయి" అని మన పెద్దలు చెపుతూ వుంటారు.కట్టు,బొట్టు,వాలుజడ,పట్టు పావడాలు,జడలో పూలతో బాపు బొమ్మలాటి తెలుగమ్మాయి మన కళ్ళముందు నడయాడుతున్నట్లు వుంటంది.


కాలి అందెల సవ్వడులతో గాజుల గలగలలతో  చిరునవ్వులు చిందిస్తూ నట్టింట తిరుగాడుతున్న తెలుగమ్మాయి అపర లక్ష్మీదేవి వలె ఇంటికి అందాన్ని తెస్తుంది.
తెలుగు వెలుగు ,తెలుగమ్మాయి జిలుగు,
చెరిత్రకే మెరుగు,మన దేశానికే వెలుగు.



                                                                                                  ஃᅔнιмαjαᅕஃ

Tuesday, March 4, 2014

ఉమ్మడి కుటుంబం

ఎప్పుడైతే “కుటుంబ సభ్యులూ, బంధువులూ మన మనస్థత్వానికి సరిపడరు..” అన్న తలంపు వచ్చేస్తుందో ఆటోమేటిక్‌గా చాలామందికి అనుబంధాల మీద  నమ్మకం పోతుంది…
“వీళ్లంతా లేకపోతే నాకేంటంట.. నా బ్రతుకేదో నేను బ్రతకలేనా…. ” అన్న పంతమూ మొదలవుతుంది.

ఒకప్పుడు 10 మంది కుటుంబ సభ్యలు  రకరకాల అభిరుచులు .  భరించలేమనుకున్నాం.. సరే… ఇప్పుడు అమ్మా, నాన్నా, పిల్లలున్న నలుగురు కూడా కలిసి ఉండలేని స్థితికి వచ్చేశాం… చివరకు అస్సలు పిల్లలే వద్దు ఇద్దరం బ్రతికేస్తే చాలు అనుకుంటున్నాం…. ఆ ఇద్దరూ ఒకరికొకరు పడక విడిపోతున్న దౌర్భాగ్యమూ పడుతోంది… అంటే తప్పెవరిది? మనం  దూరం పెట్టేస్తున్న కుటుంబ సభ్యులదా? మనదా?



                                                                    ✿✿Himaja✿✿                          

Saturday, March 1, 2014

నువ్వు

కదిలే ప్రతి క్షణంలో నువ్వు  ఉన్నావు..        
వేసే ప్రతి అడుగులోనువ్వే ఉన్నావు  
మెదిలే ప్రతి ఆలోచనలో నువ్వు ఉన్నావు...
మిగిలే ప్రతి అనుభవంలో నువ్వే ఉన్నావు
వచ్చే ప్రతి ఋతువులో  నువ్వ  ఉన్నావు...
పూచే ప్రతి  పువ్వులో  నువ్వే ఉన్నావు    

        మొత్తంగా నాలో నువ్వే నువ్వే ఉన్నావు  .....
    




                                                                                             нιмαנα●•ツ