flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Monday, April 28, 2014

తెలుసుకొనగవలయు తెలుగుబిడ్డ

యతిసంగంబున,బాలుడాదరముచే,జ్యాభర్తదుర్మంత్రిచే
శ్రుతిహానిన్ ద్విజు డన్వయంబుఖలుచే,క్రూరాప్తిచేశీల,ము
ద్ధతిచేమిత్రత,చూపులేమికృషి,మద్యప్రాప్తిచేసిగ్గు,దు
ర్మతిచేసంపదలున్ నశించు,చెడునర్ధంబుల్ ప్రమాదంబునన్.

1.సంగమము వల్ల యతీశ్వరులు చెడిపోతారట.
2.గారాబం చేస్తే కొడుకు పాడైపోతాడట. 
3.పనికిమాలినవారి సలహాల వల్ల పరిపాలకులు పాడైపోతారట. 
4.వేదహాని వల్ల బ్రాహ్మణులు పాడైపోతారట. 
5.కొరగాని కొడుకు వల్ల కులం కూలిపోతుందట.
6.ఖలుని సేవిస్తే శీలం పోతుందట.
7.విర్రవీగితే స్నేహం చెడిపోతుందట.
8.పైపరామరిక లేకపోతే వ్యవసాయం పాడైపోతుందట.
9.మద్యపానం వల్ల సిగ్గుపోతుందట.
10.అవినీతి వల్ల ఐశ్వర్యం పోతుందట.
11.అడ్డమైనవాళ్ళకీ పంచిపెట్టినందువల్లా,అజాగ్రత్తవల్లా ధనము పోతుందట. 
   
                                                                                  ḧḭṁḀjḀ

Sunday, April 27, 2014

తరగని ప్రేమ

గుండె.........నిండుకుందా..??
నిండుతుందా..!!

అనగనగా ఒక రాజు.. వేటకని అడవికి వెళ్ళి దారి తప్పాడు.
ఆకలవుతోంది.ఒక దిశ అని లేకుండా కాళ్ళు ఎటు తీసికెల్తే అటు వెళ్తున్నాడు.
పొద్దుగుంకి చీకటి ఆవరిస్తోంది. రాజు వెడుతున్నాడు  కొంత దూరంలో              
గుడ్డి దీపపు వెలుగు కనిపించింది.రాజుకు ప్రాణం లేచొచ్చింది.
వుత్సాహంగా అక్కడికి వెళ్ళాడు. చూస్తే..అది గుడిసె.
అందులో ఓ పండు ముసలమ్మ. "అవ్వా ఆకలేస్తోందీ"..అన్నాడు రాజు.
ఆ క్షణంలో అన్నం పెట్టిన వారికి అర్ధ రాజ్యం రాసిచ్చెయ్యగలడు.        

ముసలవ్వకు వచ్చింది ఎవ్వరో తెలియదు.ఎవరో అతిధి.
విరోధికి కూడా అరిటాకు వేసే సంస్కారం మనది.కానీ
ఆమె నిరుపేద.ఇంట్లో ఒక్క గింజైనా లేదు.బియ్యం నిండుకున్నాయి.ఏంచేయాలీ..?

పిచ్చుకల కోసం వేలాడదీసిన వరికంకులను చేత్తో
నలిచింది.బియ్యపు గింజలు రాలిపడ్డాయి.వాటిని ఎసట్లో వేసింది.
ఊతకర్ర సాయంతో పెరట్లోకి వెళ్ళి చింత చిగురు..
అదే చేత్తో నాలుగు పచ్చిమిరపకాయలు తెచ్చింది.
వాటిని రోట్లో నూరింది.క్షణాల్లో పచ్చిపులుసు సిద్దం.
కాళ్ళూ చేతులూ కడుక్కుని కూర్చున్న రాజు ముందు విస్తరాకు వేసింది.
వేడి వేడిగా భోజనం వడ్డించింది.రాజు తన జీవితంలో ఎప్పుడూ అంత రుచికరమైన విందును ఆరగించలేదు.
రాజు తన కృతజ్ఞతలు  చాటుకున్నాడు.

ఈ ముసలమ్మే కాదు తరచి చూస్తే మన పెద్దవాళ్ళందరూ మనకు
గొప్ప పాఠం చెబుతారు.దేనికీ లేవు..లేదు..కాదు..
అని ప్రతికూలంగా మాట్లాడే అలవాటు మనవాళ్ళకు లేదు.

బియ్యం అయిపోతే..బియ్యం నిండుకున్నాయంటారు..
నల్లపూసలు పెరిగిపోయాయంటారు..కానీ తెగిపోయాయనరు..
దీపం ఆరిపోయిందీ అనకుండా..కొండెక్కింది అంటారు..
డబ్బులు లేకపోతే..ఇంకా చేతికందలేదు..వచ్చాక ఇస్తామంటారు.

మనం వాళ్ళనుంచి నేర్చుకోవాల్సిన "పాజిటివ్ ఆటిట్యూడ్".. ఇంతకంటే వేరే ఏముంటుంది..?
మనమూ అలాగే వుందాం.మన దగ్గర ఏదైనా నిండుకోవచ్చు.కానీ
ప్రేమ ఎప్పుడూ ఎంత కావాలంటే అంత మన దగ్గర వుంచుకోవాలి.ఎందుకంటే అది తీసిన కొద్దీ రెట్టింపు అవుతంది .  

                                                                                                                                         
                                                                                                 ḧḭṁḀjḀ 

Thursday, April 17, 2014

ఎవరివయా..నువ్వెవరివయా

చల్ల గాలినే పిల్లనగ్రోవిగ
మెల్ల మెల్లగా ఊదే స్వామీ..
ఎవరయ్యా నువ్వెవరివయా..

 అంతేలేని ఆకాశానికి 
ఆవల ఉన్నావు
ఎంతో ఎంతో దగ్గరగా
నా అంతరంగాన ఉన్నావు..

 గల గల పారే సెల ఏరులలో
వినిపించునయా నీ మురళి
అశాంతి నిండిన జగాన నేడు 
ప్రశాంతి నొసగును ఆ రవళి.


                                                                                             Ħ!m@ﻝ@웃