flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Saturday, May 3, 2014

ఎదురుచూపులు

బృందావనం ఎదురుచూస్తోంది ..
నీకోసమే--
యమునాతటి ఎదురుచూపులు..
                                          నీకోసమే-
వెదురు వేణువై ఎదురుచూస్తోంది..
                       నీకోసమే--
ఆబాలగోపాలం ఎదురుచూపులు
                                 నీకోసమే--
ఆలమందలు ఎదురుచూసేది
                      నీకొసమే--
గోపికల నయనాలు వెతికేది..
                               నీకోసమే--
మహర్షుల మహత్వ  తపోదీక్షలు
                     నీకోసమే--
అష్ట మహుషుల నిరంతరాలోకనాలు..
                                          నీకోసమే--
భక్తజనుల నిత్య ధ్యానాలు నీ దర్శనభాగ్యం కోసమే --
                         
ఎక్కడున్నావయ్యా   ..నల్లనయ్యా..
నీకోసమే ఈ ఎదురుచూపులు కృష్ణయ్యా..

రావయ్యా..రావయ్యా..రావయ్యా...
మమ్మందరినీ కరుణించవయా ..

                                                                            °ღ•ℋℐℳÁĴÁ●•٠·˙

Friday, May 2, 2014

అక్షయ తృతీయ

 అక్షయ తృతీయ
అక్షయం అంటే నాశం లేకపోవడం
దిన దినాభివృధి చెందడం కూడా
అక్షయ తదియ చాల పవిత్ర మయినది ..
ఈ రోజే శ్రీ కృష్ణ పరమాత్ముడు ద్రౌపది కి అక్షయ పాత్రా ఇచ్చిన రోజు.
మహా లక్ష్మి పుట్టిన రోజు కూడా ఈ నాడే ..
సత్య యుగం అంతరించి త్రేతాయుగం మొదలు ఈ రోజే....
దివి నుండి గంగ భూమికి వచ్చినది కూడా ఈ దినమే....
భగవను వేదవ్యాసుడు శ్రీ గణేష్ తో మహాభరతం రాయుట మొదలు పెట్టింది ఈ సుదినమే ,,,,
ఈ రోజు బంగారాన్ని కొంటే అక్షయమౌతుందని నమ్మకం. అందుకే అక్షయ తృతీయనాడు నగల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. అక్షయమైన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి వైశాఖ శుద్ధ తదియను ' అక్షయ ' తృతీయగా వ్యవహరిస్తారు.
అక్షయ తృతీయరోజే కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతాయి. నాలుగు యగాల్లో మొదటిది కృత యగం.
ధర్మం నాలుగు పాదాలమీద నడిచిన కాలమది. పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట! నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదట!
నిరు పేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే.
క్షీరసాగరమధనం తర్వాత లక్ష్మిదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే! కాబట్టే అక్షయ తృతీయ నాడు...రాహుకాలాలూ వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే!
అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా,ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది.
స్థోమత ఉంటే నగనట్రా కొనచ్చు. కానీ అప్పుచేసి కొంటే మాత్రం తిప్పలే! సకాలంలో తీర్చకపోతే ...రుణాలూ అక్షయమవుతాయి! ఈ విషయంలో పెద్దలు కొన్ని మినహాయింపులిచ్చారు. బంగారం కొనగలిగే శక్తి లేకపోతే ... వెండి కొన్నా మంచిదేనట. అదీ కొనలేమనుకుంటే ఉప్పు కొన్నా ఫర్వాలేదంట! లవణంలోనూ లక్ష్మిదేవి ఉంటుంది.
అక్షయ తృతీయ రోజు సత్కార్యాలు చేయడం ద్వారా మంచిని అక్షయం చేసుకోవచ్చు.
అసలే వేసవి కాలం. ఎండలు మండుతున్నాయి. నలుగురు యాచకులకు చెప్పులో, గొడుగులో, దానం చేయవచ్చు. చల్లని మజ్జిగతోనో, పానకంతోనో పది మంది గొంతు తడపొచ్చు.

- అక్షయ తృతీయ ---