ఒక అడవిలో ఒక తల్లి ఎలుక ఉంది. దానికో పిల్ల ఎలుక. ప్రపంచంలో అందరి కంటే శక్తిమంతుడైన వాడిని వెతికి తెచ్చి పెళ్లి చేయాలని తల్లి ఎలుకకొక బుల్లి కోరిక. అలాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడా అని పుట్టలు, గుట్టలు ఎక్కి వెతికింది. ఆకాశంలోకి చూసింది. తన తేజస్సుతో లోకమంతా కాంతులు నింపుతున్న సూర్యుడు కనిపించాడు. "నాయనా సూర్యుడా! సృష్టిలో అందరికంటే శక్తిశాలివి నువ్వు. మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను" అంది. "అసలు సృష్టిలో నేను అందరికంటే శక్తిశాలిని అనే నీ అభిప్రాయమే తప్పు. దట్టమైన మేఘం కమ్మితే, శక్తి మాట దేవుడెరుగు, నేను కనపడకుండా పోతాను" అన్నాడు సూర్యుడు.
టక్కున మేఘం దగ్గరికి పరుగెత్తింది తల్లి ఎలుక. "నాదేమి శక్తి, వానాకాలం శక్తి. గట్టిగా గాలి కొడితే నిలవలేక ఎగిరిపోయేవాడిని" అంది మేఘం. నిజమే కదా అనుకుంటూ గాలి దగ్గరికి పరిగెత్తింది ఎలుక. గాలి నీరసంగా, దిగులుగా నవ్వుతూ, "నాదొక శక్తా? అదిగో, ఆ కనిపించే చిన్ని కొండను పడేయాలని ఎన్నాళ్ళనుంచో కిందా మీదా పడుతున్నాను. నా శక్తి అంతా ఉపయోగించినా, ఒక్క అంగుళం కూడా కదల్చలేక పోయాను" అంది.
ఎలుక కొండను పట్టుకుంది. "నాదొక పెద్ద శక్తి కాదు, తెల్లవారుతుందంటే భయం. ఊళ్ళో ఆంబోతు వచ్చి, తన కొమ్ములు నా రాళ్ళకు రుద్ది రుద్ది చంపుతుంది. దాని కొమ్ములు పదునవుతున్నాయి కానీ నా రాళ్ళు మాత్రం నుగ్గి నుగ్గి అయిపోతున్నాయి. నువ్వు ఆ ఆంబోతుని పట్టుకుంటే బాగుంటుంది" అన్నది కొండ.
తీరా ఆ ఆంబోతుని కదిలిస్తే "నాది మాత్రం ఏమి శక్తీ? నాలుగు తాళ్ళు తెచ్చి కట్టేస్తే, నేనలా పడి ఉండాల్సిందే, నా కంటే ఆ తాడుకే ఎక్కువ బలం" అంది.
"నాదేమి బలం, చిన్న ఎలక పిల్ల కూడా నన్ను పట పటా కోరికేయగలదు కదా" అంది తాడు.
తల్లి ఎలుకకు జ్ఞానోదయం అయింది, అందమైన ఎలుక వరుడిని చూసి, తన కూతురునిచ్చి పెళ్లి చేసింది.
ఈ లోకంలో ఎవరి బలం, శక్తియుక్తులు వాళ్ళవి. 'నాకు బలం లేదు' అనుకోవటమే బలహీనత. 'నా అంత బలం మరెవరికీ లేదు' అనుకోవటం మరీ గొప్ప బలహీనత .

No comments:
Post a Comment