flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Tuesday, January 5, 2016

నమో సూర్యదేవ

సూర్యునకుగల ఇతర నామాలు.
సూర్యునకు ఆదిత్యుడు, సవితహిరుడు, సూర్యడు , మిహిరుడు, అర్కుడు , ప్రభాకరుడు ,  మార్తాండుడు, భాస్కరుడు, చిత్రభానుడు , దివాకరుడు, రవి అనే 12 సామాన్య నామాలు...
విష్ణు, ధాత్,భగ,పూష, మిత్ర,ఇంద్ర,వరుణ,అర్యమ,వివస్వత్, అంశుమత్, త్వష్ట, పర్జన్య అనేవి విశేష నామాలు.. ఒక్కొనెలలొ.. ఒక్కొ పేరుతో ఈ విశేష నామాల రీత్యా సూర్యుని ప్రస్తావిస్తారు.. ద్వాదశాదిత్యులు అనగా వీరే .




సూర్య ప్రార్థన.
1. జయః సూర్యాయ దేవాయ తమోహంత్రె వివస్వతె
జయప్రాదయ సూర్యాయ భాస్కారాయ నమోస్తుతే

2. గ్రహొత్తమాయ దేవాయ జయః కల్యాణ కారిణే
జయః పద్మ వికాసాయ బుధరూపాయ తేనమః

3. జయదీప్తి నిధానాయ జయః శాంతి విధాయెనే
తమోఘ్నాయ జయాయైవ అజితాయ నమోనమః

4. జయార్క జయదీప్తిశ సహస్ర కిరణొజ్వల
జయనిర్మిత లోకస్త్వమ జితాయ నమో నమః

5. గాయిత్రీ దేహరూపాయ, సావిత్రీ దైవతాయచ
ధరాధరాయ సూర్యాయ మార్తండాయ నమోనమః
(దోష పరిహారార్ధం ఈ పంచశ్లొక స్తొత్రం ఆరు పర్యాయాలు నిత్యం పఠిస్తే ఆయురారోగ్య భోగభాగ్యాది  శుభములు ప్రాప్తించును)  

No comments:

Post a Comment