కొమ్ములున్నగురువు
ఒక గొప్ప పండితునివద్ద పలువురుశిష్యులుండేవారు.వారిలో ఒక శిష్యునికి గురువుగారంటేఅమితమైన ప్రేమ ప్రతివారివద్ద గురువునుగూర్చి గొప్పగా చెపుతుండేవాడు. ఒకసారి వేరొక పండితునివద్ద తన గురువుగారిని గూర్చి పొగడగా ఆ పండితుడు మీ గురువుగారి గొప్పేమిటి?ఆయనకేమైనా కొమ్ములున్నాయా అన్నాడు. అవునండీ మా గురువుగారికి మూడు కొమ్ములున్నాయి."గు"లో ఒక కొమ్ము ,"రు"లో ఒక కొమ్ము,"వు"లో ఒక కొమ్ము వున్నాయని గడుసుగా సమాధానం చెప్పాడు.

No comments:
Post a Comment