బిల్హణీయ పద్య చమత్కృతి
రవిజుడు భా గుణింప విధురంబుగ భట్టి నశించె,భారవి
ప్రవరుడడంగె దీర్ఘమున బ్రాణము బాసె గుడియ్య భిక్షు, డీ
యవనికి దప్పె భీముడు,దదంత గతి న్మఱి కొమ్మువెట్ట ని
క్కువముగ నే భుకుండుడను,గొమ్మున దీర్ఘము వెట్టకుండ డీ
భువినత డెన్న నిర్దయుడు,భూపతి వీపు దలంప భూవరా!
లక్ష్మీమందిరమనే పురాన్ని మదనాభిరామభూపతి పాలిస్తుండేవాడు.ఆ రాజుకు "యామినీపూర్ణతిలక" అనే కుమార్తె వుండేది.రాజు తన కుమార్తెకు విద్య నేర్పించడానికి"బిల్హణుడు"అనే కవిసత్తముని పిలిపిస్తాడు.ఆ కవి సౌందర్యం చూసి రాజుకు మనసులో ఒక సందేహం కలిగింది.ఇంత అందమైన వానిని చూస్తే నా కుమార్తె ఈతని ప్రేమలో పడిపోతుంది ఎలా అని మంత్రిని సలహా అడిగాడు.పండితునికి కుష్టు వ్యాధి వున్నవారిని చూడకూడదనే నియమం వుంది.రాకుమారికి గ్రుడ్డివారిని చూడననే నియమంవుంది.దీనిని సాకుగా చేసుకొని కవి గ్రుడ్డివాడని రాకుమర్తెకు,రాకుమారి కుష్ట వ్యాధిగ్రస్తురాలని కవికి చెప్పి ఒకరినొకరు చూడకుండా మధ్యలో ఒక కాండపటం(పరదావంటిది)పెట్టించి విద్య మొదలు పెట్టించాడు.ఒకనాటి సాయంత్రం చంద్రోదయం కాగానే ఆకాశాన్ని చూస్తూ అందమైన పద్యాలు చెప్పడం మొదలుపెట్టాడు కవి అది విన్న రాకుమార్తె గ్రుడ్డివాడు చంద్రుని మీద ఇంత అందంగా పద్యాలు ఎలా చెపుతున్నాడు అని కాండపటం తొలగించి పండితుని చూచింది.ఒకరినొకరు చూచుకొని ఇది తండ్రి ఆడిన నాటకమని గమనించారు.ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు.ఈ సంగతి తెలిసిన రాజు" బిల్హణుని"శిరశ్చేదనం చేయమని ఆదేశించాడు.అప్పుడు కవి ఒక పద్యం వ్రాసి తలారులకుఇచ్చి రాజుగారికి చూపమని పంపుతాడు.అది చదివిన రాజు శిక్షను రద్దుచేసి కవికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు.ఇంతకీ అందులో ఏముందంటే ఓ రాజా!యమధర్మరాజు "భ"గుణింతం వ్రాయటం మొదలుపెట్టాడు."భ"వ్రాయగానే భట్టి మరణించాడు "భా" వ్రాయగానే భారవి చనిపోయాడు "భి"వ్రాయగానే భిక్షుకుడు మరణించాడు."భీ" వ్రాయగానే భీమసేనుడు మరణించాడు తరువాత "భు"వ్రాస్తే నేనుభుకుండుడను(బిల్హణుని నామాంతరం)మరణిస్తాను.తరువాత"భూ"వ్రాస్తే భూపతివి నీనే మరణిస్తావు అని వ్రాసి పంపాడు.
No comments:
Post a Comment