Sunday, December 29, 2013
Wednesday, December 25, 2013
లాలి పాట
రామా లాలీ మేఘశ్యామా లాలీ
తామరసనయన దశరథతనయా లాలీ ||రా||
అబ్జవదన ఆటలాడి అలసినావురా నీ
బొజ్జలో పాలరుగగానే నిదురబోవరా ||రా||
అద్దాల తొట్టెలో నేమో అనుమానించేవూ
ముద్దులపాపలున్నారని మురిసి చూచేవూ ||రా||
ఎంతో యెత్తు మరిగినావు యేమి సేతురా
ఇంతుల చేతుల కాకకు మేనెంతో కందునురా ||రా||
జోలపాడి జోకొట్టితే ఆలకించేవు
చాలించి మరియూరకుంటే సైగలు చేసేవు ||రా||
వెన్న పాలు ఉగ్గు నెయ్యి బాలుడ నీవు
తిన్నగా సేవించివయ్య తియ్యగ నుండు ||రా||
తారాశశాంకము
తారాశశాంక కధకు సంబంధించిన చాటుపద్యం
నక్షత్రపు పేరిటి చెలి
నక్షత్ర సుఖంబుగోరి నక్షత్రములోన్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రముబట్టి యీడ్చె నక్షత్రేశున్.
ఇది తారాశశాంక కధకు సంబంధించినది .నక్షత్రపు పేరిటిచెలి అనగా తార, నక్షత్ర సుఖంబుగోరి అనగా "ఆశ్లేష" ఆలింగనసుఖము కోరి నక్షత్రములోన్ అనగా "చిత్త" మనసులో ,నక్షత్రమునకురమ్మని "మూల" మూలకురమ్మని , నక్షత్రముబట్టి అనగా "హస్త" చేయిపట్టి ,నక్షత్రేసున్ యీడ్చెన్ అనగా చంద్రుని లాగింది.
Tuesday, December 24, 2013
Saturday, December 21, 2013
ఈమధ్యే ఒక అందమైన ప్రపంచాన్ని మా ఇంటి వరండాలో చూశాను.శ్రమైక జీవన సౌందర్యాన్ని,కుటుంబ విలువల్ని చూశాను ఎలాగో చెప్పా లా?
చిన్ని చిన్ని ఆకులను,పుల్లలను చిట్టి ముక్కుతో తెచ్చి మా వరండాలొని గుమ్మడికాయను తొలిచి అందులో గూడు కట్టుకున్న పిచ్చుకలజంటను,ఉదయమేలేచే వాటి క్రమశిక్షణను, కష్టపడి ఆహారం తెచ్చి పిల్లలకుపెట్టే ఆ చిన్ని ప్రాణులని చూశాను.కానీ ఏమి అయిందో ఏమో కొన్ని రోజులనుండి ఆ గూడు మూగబోయింది....మళ్ళీ ఈరోజు మరొక పిచ్చుకల జంట పాత గూటిని తీసివేసి కొత్త గూటిని కట్టుకుంటున్నాయి.హమ్మయ్య .. మనసు కుదుటపడింది.
Thursday, December 19, 2013
Wednesday, December 18, 2013
అష్ట కష్టాలు
1.దాస్యం
2.దారిద్ర్యం
3.భార్య లేకుండుట
4.స్వయంకృషి
5.యాచనము
6.యాచకులకు లేదనుట
7.అప్పు పడుట
8.ప్రయాణం చేయుట
Sunday, December 15, 2013
అష్టాదశ పురాణాల పేర్లు
అష్టాదశ పురాణముల పేర్లు సులువుగా గుర్తుపెట్టుకోవడానికి
మద్వయం భద్వయం చైవ బ్రత్రయంచ వచతుష్టయం
అ నా ప లింగ కూ స్కాని పురాణాని పృధక్పృధక్.
మద్వయం=మత్స్యపురాణం,మార్కండేయపురాణం
భద్వయం = భాగవతపురాణం,భవిష్యపురాణం
బ్రత్రయం=బ్రహ్మాండపురాణం,బ్రాహ్మపురాణం,బ్రహ్మవైవర్తపురాణం,
వచతుష్టయం= వామనపురాణం,వాయవ్యపురాణం,వైష్ణవపురాణం,వరాహపురాణం
అ= అగ్నిపురాణం
నా=నారదపురాణం
ప=పద్మపురాణం
లిం= లింగపురాణం
గ= గరుడపురాణం
కూ= కూర్మపురాణం
స్కా= స్కాందపురాణం

Friday, December 13, 2013
కర్తా కారయితాచైవ ప్రేరకశ్చానుమోదక:
సుకృతే దుష్కృతేచైవ చత్వారిస్సమభాగిన:
ఏదైనా ఒక మంచి పనిగాని,చెడుపనిగాని చేసినపుడు దానిఫలితం నలుగురికి సమానంగా లభిస్తుంది.పని చేసినవాడు,ఆపనికి కారకుడైనవాడు,ఆపనిని ప్రేరేపించినవాడు,ఆపనికి అంగీకారం తెలిపినవాడు సమానఫలితాన్ని పొండుతారు.చెడు విషయాలలో ఆపనులు మనం చేయకపోయినా,చూస్తూ వూరుకున్నా దానివల్ల లభించే శిక్షలు మనం కూడా అనుభవించవలసి వస్తుంది.కాబట్టి చెడ్డపనులు చేయకపోవటమేకాదు వాటికి కారకులు,ప్రేరకులు,అనుమోదకులు కాకూడదు.

Tuesday, December 10, 2013
మహనీయుల మహితోక్తులు
1.చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళలోనే వుంటాయి.ఐనా వాటి వాసన అలాగేవుంటుంది. అదేవిధంగా మనిషి శరీరాన్ని ఎంత కడుక్కున్నా యేమిలాభం?మనస్సులోని మాలిన్యాలను కడుగలేకపోయాక? - కబీరుదాసు
2.ఈప్రపంచంలో సముద్రంకంటే సారాయి ఎక్కువమంది మనుషులను ముంచేసింది. -పబ్లియస్ సైరస్
3.విషంకలిసిన భోజనాన్ని,కదలిపోయే దంతాలని,చెడు సలహాలనిచ్చేవారిని పూర్తిగావదిలివేయడమే శ్రేయస్కరం -హితోపదేశం
4.ఒక పుస్తకం నుండి మనం కాపీ కొడితే అది తప్పు.అయితే అనేక పుస్తకాలనుండి ఏకబిగీన కాపీ కొడితే మాత్రం అది పరిశోధన. -వి.మిజినెర్
5.ఎవరితో మంచి స్నేహం కోరతామో వారితో డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు పెట్టుకోవద్దు.
-శుక్రనీతిసారం
Friday, December 6, 2013
గంగావతరణం
ఆకాశంబుననుండి శంభుని శిరంబందుండి శీతాద్రి సు
శ్లోకంభైన హిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య
స్తోకాంభోధి పయోధినుండి పవనాంధోలోకంకముంజేరె గం
గా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్టసంపాతముల్
కపిల మహాముని కోపాగ్నికి భస్మమైన తన పితరులకు పుణ్యలోక ప్రాప్తికై భగీరధుడు గంగనుగూర్చి తపస్సుచేయగా గంగ ఆకాశమునుండి శివునితలమీదకు,అక్కడనుండి హిమాలయపర్వతము మీదకు,అక్కడనుండి భువికి,భూలోకమునుండి సముద్రములోనికి,అటనుండి పాతాళలోకానికి చేరి సగరుల భస్మరాసులపై ప్రవహించి వారికి పుణ్యలోక ప్రాప్తి కలిగించింది.
నుడిగొని రామపాదములు సోకి ధూళివహించి ఱా యెయ
యేర్పడనొక కాంతనయ్యట పన్నుగ నీతని పాదరేనువి
య్వడవడి నోడ సోకనిది యేమగునోయని సంశయాత
కడిగె గుహుండు రామ పదకంజయగంబు భయంబు పెంపునన్
కాంతివంతమైన రామ పాదము తగిలి ఓ రాయి కాంతగా మారింది. అటువంటి పాద రేణువుసోకి ఓడ ఏమవుతుందోనని, రామున్ని నది దాటించేటపుడు సంశయిస్తూనే గుహుడు సానుకూలంగా స్పందిస్తూ ఆహ్వానించాడు. నీలమేఘచ్ఛాయ బోలుదేహము వాడు ధవళాబ్ద పత్ర నేత్రములవాడు, త్రిలోకనాథుడు, జగదేకవీరుడు, దశరథ తనయుడు అయిన శ్రీరాముడు తన ఓడను ఎక్కడమే జన్మధన్యత గాంచడంగా తలచడం ఓవైపు అయితే, తన జీవన భృతిహి దోహదపడుతున్న ఓడ ఏమైపోతుందోనన్న భీతితో సందిగ్ధతతో సతమతమయ్యే గుహుని స్థితిని మనకు చమకృతి శ్లేషలు కలగలిపి వివరించడం మొల్లకే చెల్లుబాటయింది.
(అంతర్జాల సేకరణ)
Thursday, December 5, 2013
భరతమాత విశిష్టత
సీ // సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల
నంకసీమల నిల్పినట్టి సాధ్వి
కమలనాభుని వేణుగాన సుధాంబుధి
వోలలాడిన పరిపూతదేహ
కాళిదాసాది సత్కవికుమారులగాంచి
కీర్తినందిన పెద్దగేస్తురాలు
బుద్ధాది మునిజనంబుల తపంబున
మోదబాష్పముల్ విడిచిన భక్తురాలు
గీ // సింధు గంగా నదీ జలక్షీరమెపుడు
గురిని బిడ్దల పోషించుకొనుచునున్న
పచ్చిబాలింతరాలు మాభరతమాత
మాతలకు మాత సకలసంపత్సమేత
గుఱ్ఱంజాషువాగారు
Tuesday, December 3, 2013
Sunday, December 1, 2013
దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు.... ?
సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ, హోమాదుల్లోనూ, శుభకార్యాల్లోనూ, కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయపైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడయితే కొబ్బరికాయను స్వామిముందు కొడతామో మన అహంకారాన్ని విడనాడుతున్నామనీ, లోపలున్నతెల్లని కొబ్బిరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలని ఉంచమని అర్ధం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మానవశరీరం. బొండం పైనున్న చర్మం, మన చర్మం, పీచు మనలోని మాంసం, పెంకు ఎముక, కొబ్బరి ధాతువు, అందులోని కొబ్బరినీరు మన ప్రాణధారం..... కాయపైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులు....

Subscribe to:
Posts (Atom)