సూర్యదేవుడు ధనుస్సు రాశిలో ప్రవేశించటంతో మొదలై భోగిపండుగ రోజువరకు,సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు ఉండేమాసం - "ధనుర్మాసం".
ధనుర్మాసం మొత్తం ఇంటిముందు ఆవుపేడను కలిపిన నీటినిచల్లి,బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి,ముగ్గుల మధ్యలో ఆవుపేడతోచేసి పసుపు,కుంకుమలు,వివిధపువ్వులను అలంకరించినగొబ్బిళ్ళను ఉంచాలి.ఈ విధంగా చెయటంవల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు,సౌభాగ్యం కలకాలం వర్దిల్లుతుంది అని నమ్మకం.
ఇక ప్రతి ముంగిటా సంక్రాంతి రంగవల్లులే.
వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. ఈ మాసమంతా వైష్ణవ ఆలయాలలో ప్రత్యక పూజలు చేస్తారు.గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ నెలరోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైనతిరుమలశ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెలరోజులు సుప్రభాతానికి బదులుగా "తిరుప్పావై"పఠిస్తారు.అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిస్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలి.ప్రతిదినం పూజించి,మొదటి పదిహేనురోజులు నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని,తరువాతి
పదిహేనురోజులు దద్ధోజనం నివేదనగాపెట్టలి.
ధనుర్మాసం మొత్తం ఇంటిముందు ఆవుపేడను కలిపిన నీటినిచల్లి,బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి,ముగ్గుల మధ్యలో ఆవుపేడతోచేసి పసుపు,కుంకుమలు,వివిధపువ్వులను అలంకరించినగొబ్బిళ్ళను ఉంచాలి.ఈ విధంగా చెయటంవల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు,సౌభాగ్యం కలకాలం వర్దిల్లుతుంది అని నమ్మకం.
ఇక ప్రతి ముంగిటా సంక్రాంతి రంగవల్లులే.
No comments:
Post a Comment