అనగనగా ఒకరోజు కుందేలు,తాబేలు ఎగ్జిబిషన్ చూడటానికి బయలుదేరాయి.అవి వెళ్ళే దారిలో పెద్ద మైదానం,పొడవైన వాగు అడ్డంగా ఉన్నాయి. కుందేలు నీటిలో ఈదలేక, తాబేలు మైదానంలో నడవలేక రెందురోజులు ప్రయత్నించి విఫలమయ్యాయి. మూడవరోజు ఎలాగైనా వెళ్ళితీరాల్సిందేనని అనుకొని మైదానంలో వెళ్ళేటప్పుడు కుందేలు తాబేలును,నీటిలో వెళ్ళేటప్పుడు తాబేలు కుందేలును తమ వీపుపై ఎక్కించుకున్నాయి.ఇలా కలిసి పనిచేసి అనుకున్న గమ్యానికి చేరుకున్నాయి.ఈవిధంగా టీంవర్క్ గా కలసిపనిచేసి ఎదురయ్యే ప్రతి సమస్యను సులభంగా అధిగమించవచ్చు.
No comments:
Post a Comment