flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Monday, November 23, 2015

HIMA SONGS

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక అంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

సిరివెన్నెల తెలబోయెను జెవరాలి చూపులో
సిరివెన్నెల తెలబోయెను జెవరాలి చూపులో
నవమల్లిక చినబోయెను నవమల్లిక చినబోయెను
చిరు నవ్వు సొగసులో
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

వన రాణియె అలివేణికి సిగ పూలు తురిమెను
వన రాణియె అలివేణికి సిగ పూలు తురిమెను
రేరాణియె నారాణికి రేరాణియె నారాణికి
పారాణి పూసెను
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారక
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారక
నా గుండెలో వెలిగించెను నా గుండెలో వెలిగించెను
సింగార దీపిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక అంధించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

Thursday, October 29, 2015

అట్లతద్ది

పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.
ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు.

రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి 'చంద్రోదయ ఉమావ్రతం' అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది.

ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. “అయ్యో అట్లతద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా! నా స్నేహితురాళ్ళకందరికీ మంచి యౌవనవంతులైన భర్తలు లభించారు. నేనేమి అపచారం చేశాను?” అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై" నీ అన్న అజ్ఞానం, నీ పై అతనికుండే ప్రేమవల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యౌవనవంతుడవుతాడు" అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్తమీద వేసేసరికి అతడు యౌవనవంతుడయ్యాడు .
 కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు.
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్తో అట్లతద్ది జరుపుకుంటారు. అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు, పాదాలకు, గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం. పండుగ వస్తే, అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు.దాని కోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారుచేయటం ఒక పెద్ద కార్యక్రమం. అట్లతద్దినాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు.

 అట్లతద్దినాడు తెల్లవారుఝామున లేస్తారు.అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. 'అట్లతద్దోయ్, ఆరట్లోయ్ ముద్దపప్పు మూడట్లోయ్' అంటూ అరుస్తూ ఇరుగు పొగురు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో బాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్లి ఆనందం పొందుతారు.

Friday, October 9, 2015

జ్ఞానోదయం

ఒక అడవిలో ఒక తల్లి ఎలుక ఉంది. దానికో పిల్ల ఎలుక. ప్రపంచంలో అందరి కంటే శక్తిమంతుడైన వాడిని వెతికి తెచ్చి పెళ్లి చేయాలని తల్లి ఎలుకకొక బుల్లి కోరిక. అలాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడా అని పుట్టలు, గుట్టలు ఎక్కి వెతికింది. ఆకాశంలోకి చూసింది. తన తేజస్సుతో లోకమంతా కాంతులు నింపుతున్న సూర్యుడు కనిపించాడు. "నాయనా సూర్యుడా! సృష్టిలో అందరికంటే శక్తిశాలివి నువ్వు. మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను" అంది. "అసలు సృష్టిలో నేను అందరికంటే శక్తిశాలిని అనే నీ అభిప్రాయమే తప్పు. దట్టమైన మేఘం కమ్మితే, శక్తి మాట దేవుడెరుగు, నేను కనపడకుండా పోతాను" అన్నాడు సూర్యుడు.

టక్కున మేఘం దగ్గరికి పరుగెత్తింది తల్లి ఎలుక. "నాదేమి శక్తి, వానాకాలం శక్తి. గట్టిగా గాలి కొడితే నిలవలేక ఎగిరిపోయేవాడిని" అంది మేఘం. నిజమే కదా అనుకుంటూ గాలి దగ్గరికి పరిగెత్తింది ఎలుక. గాలి నీరసంగా, దిగులుగా నవ్వుతూ, "నాదొక శక్తా? అదిగో, ఆ కనిపించే చిన్ని కొండను పడేయాలని ఎన్నాళ్ళనుంచో కిందా మీదా పడుతున్నాను. నా శక్తి అంతా ఉపయోగించినా, ఒక్క అంగుళం కూడా కదల్చలేక పోయాను" అంది.

ఎలుక కొండను పట్టుకుంది. "నాదొక పెద్ద శక్తి కాదు, తెల్లవారుతుందంటే భయం. ఊళ్ళో ఆంబోతు వచ్చి, తన కొమ్ములు నా రాళ్ళకు రుద్ది రుద్ది చంపుతుంది. దాని కొమ్ములు పదునవుతున్నాయి కానీ నా రాళ్ళు మాత్రం నుగ్గి నుగ్గి అయిపోతున్నాయి. నువ్వు ఆ ఆంబోతుని పట్టుకుంటే బాగుంటుంది" అన్నది కొండ.
తీరా ఆ ఆంబోతుని కదిలిస్తే "నాది మాత్రం ఏమి శక్తీ? నాలుగు తాళ్ళు తెచ్చి కట్టేస్తే, నేనలా పడి ఉండాల్సిందే, నా కంటే ఆ తాడుకే ఎక్కువ బలం" అంది.
"నాదేమి బలం, చిన్న ఎలక పిల్ల కూడా నన్ను పట పటా కోరికేయగలదు కదా" అంది తాడు.

తల్లి ఎలుకకు జ్ఞానోదయం అయింది, అందమైన ఎలుక వరుడిని చూసి, తన కూతురునిచ్చి పెళ్లి చేసింది.

ఈ లోకంలో ఎవరి బలం, శక్తియుక్తులు వాళ్ళవి. 'నాకు బలం లేదు' అనుకోవటమే బలహీనత. 'నా అంత బలం మరెవరికీ లేదు' అనుకోవటం మరీ గొప్ప బలహీనత .

Monday, September 28, 2015

❤️❤️ రాధికా మాధవీయం ❤️❤️

ఈ విశ్వంలో ప్రేమ అంటే తెలిసిన స్త్రీమూర్తి"రాధ".
స్వచ్చమైన ప్రేమకు నిర్వచనం "రాధ"
ప్రేమ అన్న పదాన్ని నిర్వచించమని ఎవరైనా అడిగితే జవాబుగా..."రాధ"గుర్తు వస్తుంది.ప్రేమకు ఇంతకు మించిన నిర్వచనం ప్రపంచంలో ఇంక లేనేలేదు.ప్రేమంటేనే రాధ.రాధంటేనే ప్రేమ.అప్పటికి ఇప్పటికీ ఈ విశ్వంలో ప్రేమ అంటే తెలిసిన ఒకేఒక్క స్త్రీమూర్తి "రాధ" .
స్వార్ధాన్ని దాటిన ఆ ప్రేమ ఆమె సొంతం.స్వార్దాన్ని దాటినదే నిజమైన ప్రేమ అవుతుంది. తన ఆనందాన్ని ఆశించే ప్రేమ ఆమెది కాదు.ప్రియసఖుని ఆనందాన్ని మాత్రమే ఆశించిన ప్రేమ ఆమె సొంతం. తన ఆత్మనే అర్పించగలిగిన ప్రేమ ఆమె సొంతం.రాధయొక్క ప్రేమ స్థాయిని మానవమాత్రులెవరూ అర్ధం చేసుకోలేరు.సంపూర్ణ స్వార్ధరహిత  స్థితిని అందుకున్నవారే ఆ ప్రేమను కొద్దిగా అర్ధం చేసుకోగలరు.తనను తాను సంపూర్ణంగా అర్పించి తానే పూర్తిగా అదృశ్యం  కాగలిగిన వారికే ఆప్రేమ అందుతుంది.దేవతలకి కూడా అందని ఈ స్థితి ఆమె సొంతం అంటే ఇక మామూలు మానవుల మాట చెప్పేదేముంది? ఎందుకంటే దేవతలు కూడా ఆత్మార్పణ చేసి శూన్యలు కావటానికి భయపడతారు.రాధ ఆ భయాన్ని కూడా అధిగమించింది.
అందుకే ఆప్రేమ ఆమెని రసరాణిని చేసింది.మహత్తర ప్రేమ స్వరూపిణిగా చేసింది.ఆమె తన ప్రేమతో దేవాధిదేవుడైన కృష్ణుని బందీని చేసింది.కృష్ణుడు నిరంతరం రాధికా నామాన్ని జపిస్తూ ఉంటాడని రాధనే నిరంతరం ధ్యానిస్తూవుంటాడని కొన్ని పురాణాలు చెపుతున్నయి.
రాధిక వయసులో మాధవునికంటే పెద్దదనికొన్ని పురాణాలు చెపుతున్నాయి. కాని ఈ తేడాలన్ని వారి ప్రేమకు అడ్డు రాలేదు. శ్రీకృష్ణుని మనోహర రూపానికి దాసోహం అనని ప్రాణి ఎక్కడైనా వుంటుందా! అలాగే బృందావన గోపికలు కూడా ఆయన వశమయ్యారు.ఆ మురళీ గానాన్ని విని వారు మైమరచిపోయారు.
           ఈ బంధాన్ని సమాజం హర్షించదేమో అన్న శంక ఆమె మదిలో లేశమాత్రం కూడా తలెత్తలేదు.తన ప్రియతముని ముందు సమస్త ప్రపంచమూ ఆమెకు తృణప్రాయంగా కనిపించింది. రాధ మనస్సులో కృష్ణుడు తప్ప ఇతర చింత లేనేలేదు. ఈ ప్రేమధ్యానంలో పడి సమస్త లోకబంధాలకూ ఆమె అతిసులువుగా అతి సహజంగా అతీతురాలైంది. ప్రేమమహిమ వల్ల విషయవాంఛలు ఆమెలో అదృశ్యమయ్యాయి.తన శరీరాన్నే తాను మరచింది. తన మనస్సునే అధిగమించింది. తన ఆత్మనే కృష్ణునికి నైవేద్యం పెట్టింది.కృష్ణప్రేమలో మునిగిపోయింది. తను వేరు కృష్ణుడు వేరు అన్న భావనకు అతీతురాలైంది. తానే కృష్ణునిగా మారింది. అంతగా తన వ్యక్తిత్వాన్ని ఆమె కృష్ణునిలో లయం చెయ్యగలిగింది.ఆమె ప్రేమకు యోగేశ్వరుడైన కృష్ణుడు కూడా చలించాడు. మహర్షుల కఠోరతపస్సుకు ఏ మాత్రమూ చలించని దేవదేవుడు విచలితుడైనాడు.రాధ ప్రేమలో కృష్ణుడు పిచ్చివాడయ్యాడు.ఆమెకు పరిపూర్ణ బందీ అయిపోయాడు.జీవితాంతం కఠోరమైన నియమనిష్టలు పాటిస్తూ సాధన చేసే యోగులకు కూడా దక్కని సంపద ఆమె సొంతం అయింది.భగవంతుడే ఆమెకు దాసానుదాసుడయ్యాడు.కృష్ణుడు రాధకు ఎంతగా దాసుడయ్యాడంటే,ఆమె అనుజ్ఞ లేనిదే ఆయన ఎవరికీ దర్శనం ఇవ్వడు, ఎవరితోనూ మాట్లాడడు.అంతగా ఆయన రాధకు బందీ అయిపోయాడు. తన నిష్కల్మషమైన పరిపూర్ణమైన ప్రేమతో రాధ భగవంతుని తనవాడిగా చేసుకుంది.రాధ ప్రేమ అంత గొప్పది. అది మానవుల ఊహకు అందనిది. దేవతలకే దుర్లభమైన స్తితి రాధ సొంతం అయ్యింది.రాధాకృష్ణులు యమునా తీరంలో విహరించని చోటు లేదు. ఒకరి సాన్నిధ్యంలో ఒకరు కరిగిపోతూ ఊసులాడుకోని పొదరిల్లు లేదు.ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ప్రపంచాన్ని మరువని రోజులేదు. బృందావనం వారి ప్రేమకు మూగసాక్షిగా మిగిలింది. ప్రకృతి వారి ప్రేమకు పరవశించింది. వారి పాదాల స్పర్శకు పచ్చిక పులకరించేది. యమునానది పరవళ్ళు తోక్కేది.అక్కడ నిత్యమూ వసంత ఋతువే. నిత్యమూ కోకిలల గానాలు అక్కడ ప్రతిధ్వనించేవి. అక్కడ చెట్లు ఎప్పుడూ చిగురిస్తూనే ఉండేవి. మధుర సువాసనలు ఆ ప్రాంతాన్ని ఆవరించి ఉండేవి.నెమళ్ళు ఆనందనాట్యం చేస్తూనే ఉండేవి. భూమిమీద స్వర్గం దిగి వచ్చినట్లు ఉండేది. అదొక ఆనంద ధామం. అదొక అంతులేని నిత్యోత్సవం.కానీ,ఎంత గొప్ప ఆనందమైనా ఒకనాటికి సమాప్తంకాక తప్పదుకదా.అలాగే ఒకనాడు బృందావనలీల అయిపొయింది.కృష్ణుడు లోకంలో చెయ్యవలసిన పనులు చాలా మిగిలి ఉన్నాయి.వాటిని పూర్తి చెయ్యడం కోసం ఆయన అక్రూరునితో కలిసి బయలుదేరాడు.ఆ పోవడం పోవడం మళ్ళీ గోకులానికి రానేలేదు. మహారాజు అయ్యాడు.రాజ్యాలు నడిపాడు.యుద్ధాలు చేశాడు. చేయించాడు. జీవితమంతా ఎన్నెన్నో పనులలో తలమునకలుగా ఉన్నాడు. ఎనిమిదిమంది రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. రాజభవనాలలో నివసించాడు. విలాసజీవితం గడిపాడు.
కానీ,ఎంత గొప్ప ఆనందమైనా ఒకనాటికి సమాప్తంకాక తప్పదుకదా.అలాగే ఒకనాడు బృందావనలీల అయిపొయింది.కృష్ణుడు లోకంలో చెయ్యవలసిన పనులు చాలా మిగిలి ఉన్నాయి.వాటిని పూర్తి చెయ్యడం కోసం ఆయన అక్రూరునితో కలిసి బయలుదేరాడు.ఆ పోవడం పోవడం మళ్ళీ గోకులానికి రానేలేదు. మహారాజు అయ్యాడు.రాజ్యాలు నడిపాడు.యుద్ధాలు చేశాడు. చేయించాడు. జీవితమంతా ఎన్నెన్నో పనులలో తలమునకలుగా ఉన్నాడు. ఎనిమిదిమంది రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. రాజభవనాలలో నివసించాడు. విలాసజీవితం గడిపాడు.రాధ,కృష్ణుని అసలు మరువలేదు.ఆమె జీవితమంతా కృష్ణుని కోసం ఎదురుచూచింది. కృష్ణప్రేమలో నిరంతరం రగిలిపోయింది.మౌనవేదనలో తన జీవితాన్నే విరహాగ్నిలో గడిపింది .నిరంతర ధ్యాననిమగ్నతలో,ప్రేమవిహ్వలతలో తపించింది.
ఆ తపనే మహా తపస్సైంది.ఆ నిరంతర తపోఫలంగా లోకమంతా ఆమెకు కృష్ణస్వరూపంగా దర్శనమిచ్చింది. నెమలిపింఛం  రంగు ఆమెకు తన సఖుని  గుర్తుకు తెచ్చింది.నెమలిని దగ్గరకు తీసుకుని దాని మెడను ముద్దాడింది.నీలమేఘం ఆమెకు కృష్ణుని దర్శనాన్ని ఇచ్చింది. తనను తాను మరచి ఆ మేఘం వెంట ఆమె పరిగెత్తింది.నీలాకాశం ఆమెకు శ్యామసుందరుని ఎదురుగా నిలిపింది.చేతులు చాచి ఆకాశాన్ని ఆమె కౌగిలించుకుంది.ప్రకృతిలో ప్రియతముని చూస్తూ మౌనంగా కన్నీరు కార్చింది.లోకులకు రాధ పిచ్చిదానిగా తోచింది. ఆమె చేష్టలు పిచ్చిచేష్టలుగా వారికి తోచాయి. కాని ఆమెకు ఏదీ పట్టదు. దేహభ్రాంతే లేని ఆమెకు లోకభ్రాంతి మాత్రం ఎక్కడిది?లోకులను చూచి ఆమె నవ్వింది.లోకులే ఆమెకు పిచ్చివారిలా తోచారు.ఇంద్రియమోహాలలో పడి ప్రేమమూర్తి అయిన భగవంతునికి దూరం అవుతున్న వారిని చూచి ఆమె పిచ్చిదానిలా నవ్వింది.
నిరంతరం ఆమెకు కన్నీళ్లు ధారలు కట్టేవి. సజలనేత్రాలతో ఆమె ఎప్పుడూ పొంగి పొర్లుతున్న పవిత్ర గంగానదిలా తోచేది. విరహవేదనతో ఆమెకు ఒళ్ళు మంటలు పుట్టేది.ఆ వేడికి ఆమెను తాకిన చెలికత్తెల దేహాలు కాగిపోయేవి. ఆమె చెట్టు కింద కూచుంటే ఆ చెట్టు ఆకులు మాడిపోయేవి. ఆమె కూచున్న నేల కాలి నల్లగా అయేది.అంతటి విరహతాపం ఆమెలో తీవ్రయోగాగ్నిని సృష్టించింది.నీళ్ళతో కలిపి ఆమెకు అద్దిన చందనం వెంటనే ఎండిపోయి పొడిపొడిగా రాలిపోయేది.నిరంతరమూ ప్రపంచాన్ని మరచి ఆమె కృష్ణధ్యానంలో తన్మయురాలయ్యేది. తన శరీరస్పృహ ఎప్పుడో కాని ఆమెకు ఉండేది కాదు.మహత్తరమైన సమాధిస్తితులు ఆమెకు సునాయాసంగా కలిగేవి.దివ్యమైన సువర్ణకాంతి ఆమె దేహంనుండి వెలువడి చుట్టుపక్కల ఆవరించేది.దివ్య సుగంధపరిమళాలు ఆమెను ఆవరించి ఉండేవి.ఆమె ముఖంలోని దేవతాకళను చూచినవారు సంభ్రమానికి గురయ్యేవారు. అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించేవారు.
ఈ విధమైన నిరంతరధ్యానంతో రాధ తానే కృష్ణునిగా మారింది. తన వ్యక్తిత్వం కరిగిపోయింది. తాను రాధను అన్న విషయం పూర్తిగా మరచింది.తానే కృష్ణుణ్ణి అన్న అనుభవాన్ని పొందింది.
ఇదిలా ఉండగా ఒకరోజున ద్వారకలో అష్టభార్యలకూ కృష్ణుని జాడ కనిపించలేదు. ఉన్నట్టుండి ఆయన మాయమై ఎక్కడికి పోయాడో తెలియడం లేదు.అంతటా వెదికారు. ఎక్కడా ఆయన కనిపించడు. వారికి తామే కృష్ణుని అంతరంగ సఖులమని గర్వం ఉండేది. తాము ఇంతగా ప్రేమించే కృష్ణుడు తమను వదిలి ఎక్కడికి పోయాడా అని వారికి అనుమానమూ భయమూ కోపమూ కలిగాయి. అప్పుడు వారి బాధను చూడలేక, మహోన్నతభక్తుడైన నారదమహర్షి కరుణతో వారికి దర్శనమిచ్చి బృందావనం వెళ్లి చూడమని సలహా చెప్పాడు.
ఆయన సూచన మేరకు అక్కడకు వెళ్ళిన వారికి ఒక మనోహరమైన దృశ్యం కనిపించింది.
పున్నమివెన్నెలలో,చల్లని యమునాతీరంలో, మనోహరమైన పూలపొదరిండ్ల మధ్యన పుష్పసుగంధభరిత మనోహరనికుంజమధ్యంలో తన సఖుల మధ్యన రాధాసమేతుడై మృదుమధుర మురళీనాదాన్ని వెదజల్లుతూ తేజోమూర్తిగా వెలుగుతున్న కృష్ణుడు దర్శనమిచ్చాడు. ఆ ప్రదేశమంతా ఆనందప్రవాహం ముంచెత్తుతూ ఉన్నది. అక్కడ చెట్లూ ఆకులూ పూలూ అన్నీ ఏదో కాంతితో మెరిసిపోతున్నాయి. గోపికలూ,రాధా,కృష్ణుడూ అప్పటివరకూ వారికి తెలిసిన దేహధారులైన మనుషులలాగా కనిపించడం లేదు. దేవతాస్వరూపాల వలె వెలుగుతూ ఉన్నారు. ఆ మహత్తర దివ్యదర్శనాన్ని చూచి నోట మాటరాక అప్రతిభులైన వారినిచూచి చిరునవ్వు చిందిస్తూ నల్లనయ్య ఇలా అన్నాడు.
'ప్రియతములారా. మీరందరూ నన్ను ప్రేమించారు.నిజమే!!కాని ప్రేమలోని ఆనందాన్ని కోరి నన్ను మీరందరూ ప్రేమించారు. నాకోసం నన్ను మీరు ప్రేమించలేదు. నా సాన్నిధ్యంలో ఆనందంకోసం మీరు నన్ను కోరుకున్నారు. మీకు నేను ముఖ్యమే. కాదనను.కాని అంతకంటే మీ ఆనందమే మీకు ముఖ్యం.
రాధ అలాకాక నన్ను నన్నుగా ప్రేమించింది.తన ఆనందం కోసం నన్ను ప్రేమించలేదు.నా సంతోషాన్ని నిత్యమూ ఆశించింది.దానికోసం తన వ్యక్తిత్వాన్ని నాకు సమర్పించి తానొక శూన్యంగా మిగిలింది. తానే అదృశ్యమై తన ఆత్మను నాకు పూర్ణంగా అర్పించింది. తానే నేనుగా మారింది. అందుకే ఆమె ప్రేమ మీ అందరి ప్రేమకంటే అత్యున్నతమైనది. నేను ఆమె దాసుడను. ఇటువంటి ప్రేమను మీరూ కలిగి ఉన్నప్పుడు మాత్రమె నేను మీవాడిని అవుతాను. నేను రాధను వదలి రాలేను. ఆమె ప్రేమకు నేను బందీని. కనుక మీకు నేను కావాలంటే రాధను ప్రార్ధించండి. ఆమె ఒప్పుకుంటే నేను మీతో వస్తాను. లేకపోతే రాలేను.మీరందరూ నా భార్యలు మాత్రమే కాని రాధిక నాకు అత్యంత ప్రియతమురాలు.ఆమె నా ప్రేయసి.నా హృదయంలో ఆమె స్థానం చాలా ఉన్నతమైనది.'
అందరూ ఆయన మాటలు విన్నారు. రాధ పొందిన ప్రేమను అందుకోవాలంటే, రాధ చేరుకున్న స్థితిని పొందాలంటే ఈజన్మలో తమవల్ల కాదని వారికి అర్ధమైంది.అప్పుడు వారంతా ప్రేమమయి రాధకు ప్రణమిల్లి 'ఓ మనోజ్ఞా, అద్భుతమైన నీ ప్రేమతో భగవంతుడినే నీ ప్రేమికునిగా చేసుకున్నావు. ఎవరికోసం లోకం అంతా పరితపిస్తున్నదో ఆ దేవదేవుడు నిన్ను వదలి ఎటూ పోలేనంటున్నాడు. భార్యలమైన మాతో రానంటున్నాడు. రాజభవనాలను, అప్సరసల వంటి భార్యలను వదలి, ఈ నదీతీరంలో ఈ చెట్లమధ్యన నీతోనే ఉంటానని అంటున్నాడు. నీ ప్రేమ ఎంత గొప్పది? కనీసం దానిలో ఒక్క కణం మాకు దక్కితే చాలుకదా మా జన్మలు ధన్యములు అవడానికి? తల్లీ. నీ స్థాయిని మేము ఎన్నటికీ అందుకోలేము.దయుంచి కృష్ణుని మాతో పంపించు' అని ప్రార్ధించారు.
దానికి రాధాదేవి చిరునవ్వుతో 'సరే అలాగే కానివ్వండి.కృష్ణుని మీరు తీసుకువెళ్ళండి. అతను మీతో తప్పక వస్తాడు. కాని అతను ఇక్కడకూడా ఉంటాడు. అంతే కాదు ఎప్పటికీ ఇక్కడే ఉంటాడు. నాతోనే నాలోనే నిత్యమూ నివసిస్తాడు.యోగేశ్వరుడూ సర్వేశ్వరుడూ అయిన కృష్ణునికి అది అసాధ్యం కాదు. ఎందుకంటే నిజానికి కృష్ణుడు నన్ను వదలి ఉండలేడు. నేనూ అతన్ని వదలి ఉండలేను. అతనూ నేనూ వేర్వేరు కాదు. మేమిద్దరమూ ఒక్కరమే. కాని లోకలీల కోసం మీతో వస్తాడు. ఇది మీకు అర్ధంకాని దివ్యలీల. మహామహులైన యోగులకు కూడా ప్రేమయొక్క రుచి తెలియనిదే ఈ లీల అర్ధం కాదు.' అని కృష్ణుని వైపు చూచి మనోహరమైన చిరునవ్వు నవ్వింది. అప్పుడు కృష్ణుడు మారు మాట్లాడకుండా వారితో కలిసి ద్వారకకు పయనమయ్యాడు.
వారందరూ కలిసి కనుచూపు మేరకు వెళ్లి వెనుకకు తిరిగి చూడగా, అంతకు ముందు వారు చూచిన రీతిలోనే, మళ్ళీ గోపికలు రాధతో కృష్ణుడు వారికి యమునాతీరంలో యధావిధిగా రాసలీలలో దర్శనం ఇచ్చాడు.పక్కకు తిరిగిచూడగా కృష్ణుడు నవ్వుతూ మళ్ళీ వారితోనే ఉన్నాడు. అప్పుడు వారికి సత్యమేమిటో అర్ధమౌతుంది.
బృందావన రాసలీల నిత్యమూ సాగుతూనే ఉంటుంది. అక్కడ మహత్తరమైన ప్రేమప్రవాహం నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. లోకవాసనలు అందుకోలేని స్వచ్చమైన ప్రేమమూర్తులుగా రాదాకృష్ణులు అక్కడ ఎప్పుడూ విరాజిల్లుతూనే ఉంటారు. రాసలీల ఆ దివ్యభూమిలో నిత్యమూ జరుగుతూనే ఉంటుంది.ఇది ఇప్పటికీ ఉంది.చూడగలిగిన వారికి కనిపిస్తుంది.ఆస్వాదించే శక్తి ఉంటే అందుబాటులోకి వస్తుంది.
నిజానికి కృష్ణుడు బృందావనాన్ని వదిలి ఎక్కడికీ పోలేదు. అతని ఛాయ మాత్రమే గోపికలను వదిలి వెళ్లి లోకలీలను నడిపింది. ప్రేమమూర్తి అయిన కృష్ణుడు వారిని వదిలి ఎక్కడికి పోగలడు? అతను వారి ప్రేమకు కట్టుబడ్డాడు. నిత్యమూ రాసలీలలో అతను అక్కడే ఉంటాడు. వారి ప్రేమ కాలానికి అతీతంగా అలా వెలుగుతూనే ఉంటుంది.
అట్టి ప్రేమను పొందగలిగిన జీవితాలే నిజమైన జీవితాలు. ఆ ప్రేమ లేశమాత్రం తాకిన హృదయాలే ధన్యములు. రాధానుగ్రహం అనే ప్రేమసముద్రంలో ఒక బిందువు తాగితే చాలు మనిషి దేవతగా మారుతాడు. అతని వంశం మొత్తం ధన్యం అవుతుంది. అతని పూర్వీకులు అందరూ ఉత్తమగతిని పొందుతారు. మహోన్నతమైన ప్రేమతత్వంలో తనను తానే మరచి దివ్యప్రేమలో ఓలలాడుతూ అతడు ఉండిపోతాడు.యోగులకూ తపస్వులకూ అందని మహత్తర దివ్యభూమిక అతనికి అందుతుంది. అతను పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. ఎదురుగా కనిపిస్తాడు. మాట్లాడతాడు.
ఆ మహత్తరమైన ప్రేమముందు లోకం తుచ్చంగా కనిపించదూ? ఈ ప్రేమ ముందు స్వార్ధపూరిత జీవితాలు అల్పాతి అల్పములుగా అనిపించవూ? అటువంటి ప్రేమను పొందని ఈ జన్మలెందుకు?క్రిమికీటకాలుగా బతికి చివరికి మట్టిలో కలిసే ఈ జీవితాలేందుకు?ప్రేమను ఆస్వాదించని మనిషి జన్మ ఎందుకు?
నిత్యానందసీమలో ప్రియతముని మోమును వీక్షిస్తూ కాలాన్ని మరచి కరిగిపోని ఈ భ్రాంతిమయ బానిస బ్రతుకులెందుకు?
తనను మరచి తన ప్రియతముని ధ్యానంలో కరిగి పోవడమే రాధాతత్త్వం. తన వ్యక్తిత్వాన్ని కరిగించి తాను తన ప్రియునిగా మారడమే రాధాతత్త్వం. తన ఆనందాన్ని కాక ప్రియుని ఆనందాన్ని ఆశించడమే రాదాతత్వం. సంపూర్ణ ఆత్మార్పణే ఈ సాధనారహస్యం.ఆ మహోన్నత అర్పణలోనే దైవాన్ని కదిలించగల కరిగించగల మహత్తరమైన శక్తి ఉన్నది.ఆ ప్రేమకే దైవం కట్టుబడుతుంది. దీనికి తక్కువైన ఇతరములైన ఏ సాధనలకూ దేవదేవుడు లొంగడు.
అందుకే రాధాతత్వం సర్వోత్తమం. రసరమ్యం. మహత్తర ప్రేమనిలయ రాధ. దేవదేవుడైన కృష్ణుడు ఆమె హృదయంలో నిత్యమూ వెలుగుతూ ఉంటాడు. అందుకే సమస్త దేవతలూ రాధానుగ్రహం కోసం తపిస్తూ ఆమెను ప్రార్ధిస్తూ ఉంటారు.ఆమె అనుగ్రహం లేనిదే ఎంతటి వారైనా ప్రేమమూర్తి అయిన కృష్ణదర్శనం పొందలేరు.ప్రేమను అందుకోలేని వారు జీవన సాఫల్యతను పొందలేరు.దానికి రాధానుగ్రహం తప్పనిసరి. ఎందుకంటే ఒక్క రాధ మాత్రమె తన సంపూర్ణ ఆత్మార్పణతో కృష్ణుని చేరుకోగలదు. దైవాన్ని చేరడానికి ఇది తప్ప వేరే దారి లేదు.
శ్రీరామకృష్ణులకు కూడా,మొదటగా రాధాదేవి దర్శనం అయిన తర్వాతనే కృష్ణదర్శనం కలిగింది.రాధాదేవి ఆయన ఎదుట ప్రత్యక్షమై ఆయన శరీరంలో లీనమైంది.తత్ఫలితంగా రాధాదేవి పొందిన ప్రేమసమాధిని ఆయన రుచి చూడగలిగారు.ఆ తర్వాతనే ఆయనకు కృష్ణ సాక్షాత్కారం కలిగింది.ఆ కృష్ణుడు కూడా ఆయనలోనే లీనమయ్యాడు.ఆవిధంగా రాధాకృష్ణులు ఆయనలోనే ఉన్నారు.అందుకే ఆయన ముఖం ఎప్పుడూ అంత ఆనందంతో వెలుగుతూ ఉండేది.
రాధానుగ్రహమే కృష్ణదర్శనానికి దారి.రాధాదేవి పొందిన స్థితిని పొందనిదే కృష్ణుడు కనికరించడు.కనిపించడు.రాధాదేవి కరుణించి అనుజ్ఞ ఇస్తేనే ఆయన మనకు కనిపిస్తాడు.రాధాదేవిని దాటుకునే మనం కృష్ణుని చేరుకోవలసి ఉంటుంది.అంటే,ప్రేమోన్మత్త పూరితమైన ఆత్మార్పణమే కృష్ణ దర్శనానికి దారి.ఆ స్థితే రాధ.రాధ,కృష్ణుని అసలే మరువలేదు.ఆమె జీవితమంతా కృష్ణుని కోసం ఎదురుచూచింది. కృష్ణప్రేమలో నిరంతరం రగిలిపోయింది.మౌనవేదనలో తన జీవితాన్నే విరహాగ్నిలో వ్రేల్చింది.నిరంతర ధ్యాననిమగ్నతలో,ప్రేమవిహ్వలతలో తపించింది.
ఆ తపనే మహా తపస్సైంది.ఆ నిరంతర తపోఫలంగా లోకమంతా ఆమెకు కృష్ణస్వరూపంగా దర్శనమిచ్చింది. నెమలిపించం రంగు ఆమెకు తన ప్రియతముని గుర్తుకు తెచ్చింది.నెమలిని దగ్గరకు తీసుకుని దాని మెడను ముద్దాడింది.నీలమేఘం ఆమెకు కృష్ణుని దర్శనాన్ని ఇచ్చింది. తనను తాను మరచి ఆ మేఘం వెంట ఆమె పరిగెత్తింది.నీలాకాశం ఆమెకు శ్యామసుందరుని ఎదురుగా నిలిపింది.చేతులు చాచి ఆకాశాన్ని ఆమె కౌగిలించుకుంది.ప్రకృతిలో ప్రియతముని చూస్తూ మౌనంగా కన్నీరు కార్చింది.లోకులకు రాధ పిచ్చిదానిగా తోచింది. ఆమె చేష్టలు పిచ్చిచేష్టలుగా వారికి తోచాయి. కాని ఆమెకు ఏదీ పట్టదు. దేహభ్రాంతే లేని ఆమెకు లోకభ్రాంతి మాత్రం ఎక్కడిది?లోకులను చూచి ఆమె నవ్వింది.లోకులే ఆమెకు పిచ్చివారిలా తోచారు.ఇంద్రియమోహాలలో పడి ప్రేమమూర్తి అయిన భగవంతునికి దూరం అవుతున్న వారిని చూచి ఆమె పిచ్చిదానిలా నవ్వింది.
నిరంతరం ఆమెకు కన్నీళ్లు ధారలు కట్టేవి. సజలనేత్రాలతో ఆమె ఎప్పుడూ పొంగి పొర్లుతున్న పవిత్ర గంగానదిలా తోచేది. విరహవేదనతో ఆమెకు ఒళ్ళు మంటలు పుట్టేది.ఆ వేడికి ఆమెను తాకిన చెలికత్తెల దేహాలు కాగిపోయేవి. ఆమె చెట్టు కింద కూచుంటే ఆ చెట్టు ఆకులు మాడిపోయేవి. ఆమె కూచున్న నేల కాలి నల్లగా అయేది.అంతటి విరహతాపం ఆమెలో తీవ్రయోగాగ్నిని సృష్టించింది.నీళ్ళతో కలిపి ఆమెకు అద్దిన చందనం వెంటనే ఎండిపోయి పొడిపొడిగా రాలిపోయేది.నిరంతరమూ ప్రపంచాన్ని మరచి ఆమె కృష్ణధ్యానంలో తన్మయురాలయ్యేది. తన శరీరస్పృహ ఎప్పుడో కాని ఆమెకు ఉండేది కాదు.మహత్తరమైన సమాధిస్తితులు ఆమెకు సునాయాసంగా కలిగేవి.దివ్యమైన సువర్ణకాంతి ఆమె దేహంనుండి వెలువడి చుట్టుపక్కల ఆవరించేది.దివ్య సుగంధపరిమళాలు ఆమెను ఆవరించి ఉండేవి.ఆమె ముఖంలోని దేవతాకళను చూచినవారు సంభ్రమానికి గురయ్యేవారు. అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించేవారు.
ఈ విధమైన నిరంతరధ్యానంతో రాధ తానే కృష్ణునిగా మారింది. తన వ్యక్తిత్వం కరిగిపోయింది. తాను రాధను అన్న విషయం పూర్తిగా మరచింది.తానే కృష్ణుణ్ణి అన్న అనుభవాన్ని పొందింది.
ఇదిలా ఉండగా ఒకరోజున ద్వారకలో అష్టభార్యలకూ కృష్ణుని జాడ కనిపించలేదు. ఉన్నట్టుండి ఆయన మాయమై ఎక్కడికి పోయాడో తెలియడం లేదు.అంతటా వెదికారు. ఎక్కడా ఆయన కనిపించడు. వారికి తామే కృష్ణుని అంతరంగ సఖులమని గర్వం ఉండేది. తాము ఇంతగా ప్రేమించే కృష్ణుడు తమను వదిలి ఎక్కడికి పోయాడా అని వారికి అనుమానమూ భయమూ కోపమూ కలిగాయి. అప్పుడు వారి బాధను చూడలేక, మహోన్నతభక్తుడైన నారదమహర్షి కరుణతో వారికి దర్శనమిచ్చి బృందావనం వెళ్లి చూడమని సలహా చెప్పాడు.
ఆయన సూచన మేరకు అక్కడకు వెళ్ళిన వారికి ఒక మనోహరమైన దృశ్యం కనిపించింది.
పున్నమివెన్నెలలో,చల్లని యమునాతీరంలో, మనోహరమైన పూలపొదరిండ్ల మధ్యన పుష్పసుగంధభరిత మనోహరనికుంజమధ్యంలో తన సఖుల మధ్యన రాధాసమేతుడై మృదుమధుర మురళీనాదాన్ని వెదజల్లుతూ తేజోమూర్తిగా వెలుగుతున్న కృష్ణుడు దర్శనమిచ్చాడు. ఆ ప్రదేశమంతా ఆనందప్రవాహం ముంచెత్తుతూ ఉన్నది. అక్కడ చెట్లూ ఆకులూ పూలూ అన్నీ ఏదో కాంతితో మెరిసిపోతున్నాయి. గోపికలూ,రాధా,కృష్ణుడూ అప్పటివరకూ వారికి తెలిసిన దేహధారులైన మనుషులలాగా కనిపించడం లేదు. దేవతాస్వరూపాల వలె వెలుగుతూ ఉన్నారు. ఆ మహత్తర దివ్యదర్శనాన్ని చూచి నోట మాటరాక అప్రతిభులైన వారినిచూచి చిరునవ్వు చిందిస్తూ నల్లనయ్య ఇలా అన్నాడు.
'ప్రియతములారా. మీరందరూ నన్ను ప్రేమించారు.నిజమే!!కాని ప్రేమలోని ఆనందాన్ని కోరి నన్ను మీరందరూ ప్రేమించారు. నాకోసం నన్ను మీరు ప్రేమించలేదు. నా సాన్నిధ్యంలో ఆనందంకోసం మీరు నన్ను కోరుకున్నారు. మీకు నేను ముఖ్యమే. కాదనను.కాని అంతకంటే మీ ఆనందమే మీకు ముఖ్యం.
రాధ అలాకాక నన్ను నన్నుగా ప్రేమించింది.తన ఆనందం కోసం నన్ను ప్రేమించలేదు.నా సంతోషాన్ని నిత్యమూ ఆశించింది.దానికోసం తన వ్యక్తిత్వాన్ని నాకు సమర్పించి తానొక శూన్యంగా మిగిలింది. తానే అదృశ్యమై తన ఆత్మను నాకు పూర్ణంగా అర్పించింది. తానే నేనుగా మారింది. అందుకే ఆమె ప్రేమ మీ అందరి ప్రేమకంటే అత్యున్నతమైనది. నేను ఆమె దాసుడను. ఇటువంటి ప్రేమను మీరూ కలిగి ఉన్నప్పుడు మాత్రమె నేను మీవాడిని అవుతాను. నేను రాధను వదలి రాలేను. ఆమె ప్రేమకు నేను బందీని. కనుక మీకు నేను కావాలంటే రాధను ప్రార్ధించండి. ఆమె ఒప్పుకుంటే నేను మీతో వస్తాను. లేకపోతే రాలేను.మీరందరూ నా భార్యలు మాత్రమే కాని రాధిక నాకు అత్యంత ప్రియతమురాలు.ఆమె నా ప్రేయసి.నా హృదయంలో ఆమె స్థానం చాలా ఉన్నతమైనది.'
అందరూ ఆయన మాటలు విన్నారు. రాధ పొందిన ప్రేమను అందుకోవాలంటే, రాధ చేరుకున్న స్థితిని పొందాలంటే ఈజన్మలో తమవల్ల కాదని వారికి అర్ధమైంది.అప్పుడు వారంతా ప్రేమమయి రాధకు ప్రణమిల్లి 'ఓ మనోజ్ఞా, అద్భుతమైన నీ ప్రేమతో భగవంతుడినే నీ ప్రేమికునిగా చేసుకున్నావు. ఎవరికోసం లోకం అంతా పరితపిస్తున్నదో ఆ దేవదేవుడు నిన్ను వదలి ఎటూ పోలేనంటున్నాడు. భార్యలమైన మాతో రానంటున్నాడు. రాజభవనాలను, అప్సరసల వంటి భార్యలను వదలి, ఈ నదీతీరంలో ఈ చెట్లమధ్యన నీతోనే ఉంటానని అంటున్నాడు. నీ ప్రేమ ఎంత గొప్పది? కనీసం దానిలో ఒక్క కణం మాకు దక్కితే చాలుకదా మా జన్మలు ధన్యములు అవడానికి? తల్లీ. నీ స్థాయిని మేము ఎన్నటికీ అందుకోలేము.దయుంచి కృష్ణుని మాతో పంపించు' అని ప్రార్ధించారు.
దానికి రాధాదేవి చిరునవ్వుతో 'సరే అలాగే కానివ్వండి.కృష్ణుని మీరు తీసుకువెళ్ళండి. అతను మీతో తప్పక వస్తాడు. కాని అతను ఇక్కడకూడా ఉంటాడు. అంతే కాదు ఎప్పటికీ ఇక్కడే ఉంటాడు. నాతోనే నాలోనే నిత్యమూ నివసిస్తాడు.యోగేశ్వరుడూ సర్వేశ్వరుడూ అయిన కృష్ణునికి అది అసాధ్యం కాదు. ఎందుకంటే నిజానికి కృష్ణుడు నన్ను వదలి ఉండలేడు. నేనూ అతన్ని వదలి ఉండలేను. అతనూ నేనూ వేర్వేరు కాదు. మేమిద్దరమూ ఒక్కరమే. కాని లోకలీల కోసం మీతో వస్తాడు. ఇది మీకు అర్ధంకాని దివ్యలీల. మహామహులైన యోగులకు కూడా ప్రేమయొక్క రుచి తెలియనిదే ఈ లీల అర్ధం కాదు.' అని కృష్ణుని వైపు చూచి మనోహరమైన చిరునవ్వు నవ్వింది. అప్పుడు కృష్ణుడు మారు మాట్లాడకుండా వారితో కలిసి ద్వారకకు పయనమయ్యాడు.
వారందరూ కలిసి కనుచూపు మేరకు వెళ్లి వెనుకకు తిరిగి చూడగా, అంతకు ముందు వారు చూచిన రీతిలోనే, మళ్ళీ గోపికలు రాధతో కృష్ణుడు వారికి యమునాతీరంలో యధావిధిగా రాసలీలలో దర్శనం ఇచ్చాడు.పక్కకు తిరిగిచూడగా కృష్ణుడు నవ్వుతూ మళ్ళీ వారితోనే ఉన్నాడు. అప్పుడు వారికి సత్యమేమిటో అర్ధమౌతుంది.
బృందావన రాసలీల నిత్యమూ సాగుతూనే ఉంటుంది. అక్కడ మహత్తరమైన ప్రేమప్రవాహం నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. లోకవాసనలు అందుకోలేని స్వచ్చమైన ప్రేమమూర్తులుగా రాదాకృష్ణులు అక్కడ ఎప్పుడూ విరాజిల్లుతూనే ఉంటారు. రాసలీల ఆ దివ్యభూమిలో నిత్యమూ జరుగుతూనే ఉంటుంది.ఇది ఇప్పటికీ ఉంది.చూడగలిగిన వారికి కనిపిస్తుంది.ఆస్వాదించే శక్తి ఉంటే అందుబాటులోకి వస్తుంది.
నిజానికి కృష్ణుడు బృందావనాన్ని వదిలి ఎక్కడికీ పోలేదు. అతని ఛాయ మాత్రమే గోపికలను వదిలి వెళ్లి లోకలీలను నడిపింది. ప్రేమమూర్తి అయిన కృష్ణుడు వారిని వదిలి ఎక్కడికి పోగలడు? అతను వారి ప్రేమకు కట్టుబడ్డాడు. నిత్యమూ రాసలీలలో అతను అక్కడే ఉంటాడు. వారి ప్రేమ కాలానికి అతీతంగా అలా వెలుగుతూనే ఉంటుంది.
అట్టి ప్రేమను పొందగలిగిన జీవితాలే నిజమైన జీవితాలు. ఆ ప్రేమ లేశమాత్రం తాకిన హృదయాలే ధన్యములు. రాధానుగ్రహం అనే ప్రేమసముద్రంలో ఒక బిందువు తాగితే చాలు మనిషి దేవతగా మారుతాడు. అతని వంశం మొత్తం ధన్యం అవుతుంది. అతని పూర్వీకులు అందరూ ఉత్తమగతిని పొందుతారు. మహోన్నతమైన ప్రేమతత్వంలో తనను తానే మరచి దివ్యప్రేమలో ఓలలాడుతూ అతడు ఉండిపోతాడు.యోగులకూ తపస్వులకూ అందని మహత్తర దివ్యభూమిక అతనికి అందుతుంది. అతను పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. ఎదురుగా కనిపిస్తాడు. మాట్లాడతాడు.
ఆ మహత్తరమైన ప్రేమముందు లోకం తుచ్చంగా కనిపించదూ? ఈ ప్రేమ ముందు స్వార్ధపూరిత జీవితాలు అల్పాతి అల్పములుగా అనిపించవూ? అటువంటి ప్రేమను పొందని ఈ జన్మలెందుకు?క్రిమికీటకాలుగా బతికి చివరికి మట్టిలో కలిసే ఈ జీవితాలేందుకు?ప్రేమను ఆస్వాదించని మనిషి జన్మ ఎందుకు?
నిత్యానందసీమలో ప్రియతముని మోమును వీక్షిస్తూ కాలాన్ని మరచి కరిగిపోని ఈ భ్రాంతిమయ బానిస బ్రతుకులెందుకు?
తనను మరచి తన ప్రియతముని ధ్యానంలో కరిగి పోవడమే రాధాతత్త్వం. తన వ్యక్తిత్వాన్ని కరిగించి తాను తన ప్రియునిగా మారడమే రాధాతత్త్వం. తన ఆనందాన్ని కాక ప్రియుని ఆనందాన్ని ఆశించడమే రాదాతత్వం. సంపూర్ణ ఆత్మార్పణే ఈ సాధనారహస్యం.ఆ మహోన్నత అర్పణలోనే దైవాన్ని కదిలించగల కరిగించగల మహత్తరమైన శక్తి ఉన్నది.ఆ ప్రేమకే దైవం కట్టుబడుతుంది. దీనికి తక్కువైన ఇతరములైన ఏ సాధనలకూ దేవదేవుడు లొంగడు.
అందుకే రాధాతత్వం సర్వోత్తమం. రసరమ్యం. మహత్తర ప్రేమనిలయ రాధ. దేవదేవుడైన కృష్ణుడు ఆమె హృదయంలో నిత్యమూ వెలుగుతూ ఉంటాడు. అందుకే సమస్త దేవతలూ రాధానుగ్రహం కోసం తపిస్తూ ఆమెను ప్రార్ధిస్తూ ఉంటారు.ఆమె అనుగ్రహం లేనిదే ఎంతటి వారైనా ప్రేమమూర్తి అయిన కృష్ణదర్శనం పొందలేరు.ప్రేమను అందుకోలేని వారు జీవన సాఫల్యతను పొందలేరు.దానికి రాధానుగ్రహం తప్పనిసరి. ఎందుకంటే ఒక్క రాధ మాత్రమె తన సంపూర్ణ ఆత్మార్పణతో కృష్ణుని చేరుకోగలదు. దైవాన్ని చేరడానికి ఇది తప్ప వేరే దారి లేదు.
శ్రీరామకృష్ణులకు కూడా,మొదటగా రాధాదేవి దర్శనం అయిన తర్వాతనే కృష్ణదర్శనం కలిగింది.రాధాదేవి ఆయన ఎదుట ప్రత్యక్షమై ఆయన శరీరంలో లీనమైంది.తత్ఫలితంగా రాధాదేవి పొందిన ప్రేమసమాధిని ఆయన రుచి చూడగలిగారు.ఆ తర్వాతనే ఆయనకు కృష్ణ సాక్షాత్కారం కలిగింది.ఆ కృష్ణుడు కూడా ఆయనలోనే లీనమయ్యాడు.ఆవిధంగా రాధాకృష్ణులు ఆయనలోనే ఉన్నారు.అందుకే ఆయన ముఖం ఎప్పుడూ అంత ఆనందంతో వెలుగుతూ ఉండేది.
రాధానుగ్రహమే కృష్ణదర్శనానికి దారి.రాధాదేవి పొందిన స్థితిని పొందనిదే కృష్ణుడు కనికరించడు.కనిపించడు.రాధాదేవి కరుణించి అనుజ్ఞ ఇస్తేనే ఆయన మనకు కనిపిస్తాడు.రాధాదేవిని దాటుకునే మనం కృష్ణుని చేరుకోవలసి ఉంటుంది.అంటే,ప్రేమోన్మత్త పూరితమైన ఆత్మార్పణమే కృష్ణ దర్శనానికి దారి.ఆ స్థితే రాధ.
ఇదే రాధా ప్రేమ తత్త్వం _

Monday, August 17, 2015

ప్రార్ధన

స్వామిని ఎటులర్చించినదో
భామిని ఏమని ప్రార్ధించినదో
గుడిలో గంటలు ఖంగున మ్రోగగ..
గుండెలో కోర్కెలు చెలరేగగా
విచ్చీ విచ్చని విరిమొగ్గలతో
సిగ్గులు చిందే చిరు బుగ్గలతో..

Friday, August 14, 2015

నీకోసం •*¨*`•.¸.•*¨¨*`•

రమ్మంటె చాలుగాని 
రాజ్యాలు విడిచి రానా..
నీ చిన్నినవ్వు కోసం
 స్వర్గాలు వదిలి రానా !!!   

Wednesday, August 12, 2015

గాయం - గేయం

వింతగా నను కలిశావు
నా మనసుకు ఆశలు పెంచావు
నా కలలో నువ్వే నిలిచావు
నా ఊహకు వూపిరివయ్యావు
ఒంటరిగా నను విడిచావు
కన్నీళ్ళకు నను చేరువ చేశావు ప్రియా!!

Sunday, July 5, 2015

✿✿గోదావరి పుష్కరాలు ✿✿

. భారతదేశంలో గంగానది తర్వాత అంత పేరుగాంచిన జీవనది గోదావరినది. గోదావరిని దక్షిణ గంగానదిగా అభివర్ణిస్తారు.అంతటి ప్రాముఖ్యం గల ఈ పుణ్యనదియొక్క రాశి సింహ రాశి.
 ఈ సంవత్సరం గోదావరి పుష్కరాలు{మన్మధనామసంవత్సర అధిక ఆషాఢ బహుళ త్రయోదశి మంగళవారం }అనగా జులై 14-2015 ఉదయం గం.6.30ని.బృహస్పతి సింహరాశి  లోకి ప్రవేశిస్తుంది కావున గోదావరినదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి.
   పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు.
భారత కాలమానం ప్రకారం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని ముఖ్యమైన నదులన్నిటికి 'పుష్కరాలు ' వస్తాయి.పుష్కర సమయంలో ఆయానదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం లభిస్తుందని హిందువుల నమ్మకం.బృహస్పతి ఆయారాశులలో ప్రవేశించినపుడు ఆయా నదులకు పుష్కరాలు  వస్తాయి.బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలం  ఆ నది పుష్కరంలో ఉన్నట్టే.పుష్కరకాలం సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది.పుష్కర కాలంలోని మొదటి పన్నెండురోజులు ఆది పుష్కరాలని,చివరి పన్నెండు రోజులని అంత్య పుష్కరాలని వ్యవహరిస్తారు.ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
                                            పుష్కర జననం
పవిత్రమైన నదులలో మానవులు స్నానంచేసి వారి పాపాలను పోగొట్టుకుంటారు.నదులు ఆ పాపాలు స్వీకరించి అపవిత్రం అవుతున్నాయి.మానవులవల్ల అపవిత్రం అయిన ఆ నదులు పాపాలు భరించలేక బాధ పడుతుంటే పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా  మార్చమని కోరతాడు  ఈ విధంగా పుష్కరుడు పుష్కరతీర్ధంగా మారి స్వర్గలోకమున మందాకిని నదియందు అంతర్భూతమై ఉన్నాడు.
                                             పుష్కరుని చరిత్ర
పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నడు.ఈశ్వరుడు తుందిలుని ఏ వరం కావాలో కోరుకోమన్నడు  తుందిలుడు తనకు శాశ్వితంగా ఈశ్వరునిలో స్థానం కావలన్నాడు.ఈశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో శాశ్వత స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నరకోట్ల పుణ్యతీర్ధాలకు అధిపతి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది.పొషించేశక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడయ్యడు.బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం  ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపస్సు చేశి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకొని జలసామ్రజ్యానికి చక్రవర్తి ఐన పుష్కరుని తనకివ్వమని కోరుకున్నడు ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలోనికి ప్రవేశించాడు.బ్రహ్మకార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మం  నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలం కావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు.ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మను వదిలి వెళ్ళలేనని చెప్పాడు.అప్పుడు బృహస్పతి,బ్రహ్మ,పుష్కరుడు కలసి  ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషాది ద్వాదశ రాశులలొ ప్రవేశించినప్పుడు,ప్రవేశించిన రోజునుండి పన్నెండు రోజులు  మిగిలినకాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు ముహుర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు.ఆ సమయంలో సమస్తదేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్ననదికి పుష్కరునితో వస్తారుకనుక పుష్కరకాలంలో నదీస్నానం పుణ్యప్రదమని పురాణాలు చెప్తున్నాయి.

Thursday, April 9, 2015

అన్నదానం

         అన్నం పరబ్రహ్మ స్వరూపం.ఏదిలోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం.దానాలన్నిటిలోకీ అన్నదానం మిన్న అని,అన్నదానాన్ని మించిన దానం ఇంకొకటి లేదని చెప్తారు.ఎందుకంటే ఏది దానంగాఇచ్చినా...ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలనిపిస్తుంది.
       కానీ అన్నదానంలో మాత్రం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు.ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు.కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా చేయాలి.అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్పారు.దీనికి సంబంధించి ఒక కధ కూడా చెప్తారు.
        మహాభారత యుధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు.అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి.స్వాగతసత్కారాలు లభించాయి.ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది.అన్నీ అందుబాటులో ఉన్నాయి.ఏంలాభం....!కర్ణుడికి ఏదో అసంతృప్తి,ఏదో వెలితి ఎంత తిన్నా కడుపు నిండినట్టు వుండటంలేదు. సంతృప్తి అనేది లేదు.ఎందుకు ఈవిధంగా ఉంటోందో అతనికి అర్ధం కావటంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు.అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో,నీవు అనేక దానాలు చేశావని,అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు.మరి... ఎప్పుడైనా అన్నదానం చేశావా?అని అడిగాడు.నేనెన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు."పోనీ అన్నం పెట్టే ఇల్లయిన చూపించావా"?అని అడిగాడు దేవేంద్రుడు.కాస్త ఆలోచించి అన్నాడు కర్ణుడు."ఓ బీద బ్రాహ్మణుడు నాదగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు.అపుడు నేనేదో ధ్యాసలో ఉండి నాకవకాశం లేదు కానీ...అక్కడ ఆ ఇంటికి వెళ్ళు " అని ఒక ఇల్లు చూపించాను.ఐతే అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలుని నువ్ నొట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు.వెంటనే ఆ వేలు నోటిలో పెట్టుకున్నాడు  కర్ణుడు.ఒక్క గుటక వేశాడు,ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకు ఉన్న అసంతృప్తి మటుమాయమైపొయింది.ఈ కధ ద్వారా అన్నదానం యొక్క మహత్య్మం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది.నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి,ఇక్కట్లనుండి బయట పడటానికి చక్కని రెమెడిగా పనిచేస్తుంది అన్నదానం అని పండితులు చెప్తారు.అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమౌతాయని చెప్తారు.భోజనం చేసేముందు మొదటిముద్ద పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో,ఇతర పక్షులకో పెడితే పక్షులను కుడా రక్షించిన ఫలితం వస్తుంది .అన్నాన్ని  కాకులకు వేయటం వలన శని దోషాలు పోతాయని చెపుతారు.

Friday, March 13, 2015

అష్టవిధ నాయికలు

 1. స్వాధీనపతిక- చెప్పినట్లు విని కోరినట్లు జరుపు మగడు కలది.
2.వాసవ కజ్జిక-     ప్రియుడు రాగలడని అలంకరించుకొనునది.
3.విరహొత్కంఠిత- సంకేత స్థలమునకు ప్రియుడు రాడాయెనని విరహముచే                                                 చింతించునది.
4.విప్రలబ్ధ-         సంకేత స్థలమున ప్రియుడు కానక రాయబారమంపునది.
5.ఖండిత-          ప్రియునియందు పర స్త్రీ చిహ్నములు చూచి అనుమానపడునది.
6.కలహాంతరిత- భర్తనవమానించిన పిదప పరితపించునది
7.ప్రోషిత భర్తృక- పతి దేశాంతరగతుడు కాగా వ్యాకులపడునది.
8.అభిసారిక-     తనను అలంకరించుకొని నాయకునికొరకు సంకేత స్థలమునకు పోవునది.

స్వాధీనపతిక-చెప్పినట్లు విని కోరినట్లు జరుపు మగడు కలది.

                   విరహొత్కంఠిత-సంకేత స్థలమునకు ప్రియుడు రాడాయెనని విరహముచే చింతించునది   
                         
విప్రలబ్ధ- సంకేత స్థలమున ప్రియుడు కానక రాయబారమంపునది

ఖండిత-   ప్రియునియందు పర స్త్రీ చిహ్నములు చూచి అనుమానపడునది.
ప్రోషిత భర్తృక-పతి దేశాంతరగతుడు కాగా వ్యాకులపడునది.
కలహాంతరిత-   భర్తనవమానించిన పిదప పరితపించునది
అభిసారిక-  తనను అలంకరించుకొని నాయకునికొరకు సంకేత స్థలమునకు పోవునది

వాసవ కజ్జిక-   ప్రియుడు రాగలడని అలంకరించుకొనునది.

Monday, March 2, 2015

                                 సముద్రపు నీరు ఉప్పు ఉప్పుమయం...
                                 ఆ నీటితో పెరిగిన కొబ్బరినీరు మధురం.. మధురం.

Monday, February 9, 2015

ఏక శ్లోక రామాయణమ్

ఆదౌ దశరధరాజగర్భ జననం,మౌంజీబంధన,వేదశాస్త్ర పఠనమ్
విద్యా సంగ్రహణం,సుబాహు మరణం,స్త్రీ శాప  నిర్మోచనమ్
శంభోః కార్ముకభంజనం,జనకజా కల్యాణ సంధాయనమ్
మాతాపితృ శ్శోభణం,మార్గే భార్గవరామ గర్వ హరణమ్
కైకేయీ కృత దండకాది గమనం, హత్వా మృగం కాంచనమ్
వైదేహీ హరణం,జటాయు మరణం,సుగ్రీవ సంభాషణమ్
వాలేర్నిగ్రహణం,సముద్ర తరణం, లంకాపురీ దాహనమ్
పశ్చాద్రావణ కుంభకర్ణయోర్నిధనం  ఏతద్థి రామాయణమ్!!

దశరధరాజగర్భ జననం

వేదశాస్త్ర పఠనమ్

విద్యా సంగ్రహణం

సుబాహు మరణం

స్త్రీ శాప  నిర్మోచనమ్

శంభోః కార్ముకభంజనం

జనకజా కల్యాణ సంధాయనమ్

మాతాపితృ శ్శోభణం

భార్గవరామ గర్వ హరణమ్

కైకేయీ కృత దండకాది గమనం

హత్వా మృగం కాంచనమ్

వైదేహీ హరణం

జటాయు మరణం

సుగ్రీవ సంభాషణమ్

వాలేర్నిగ్రహణం

సముద్ర తరణం

లంకాపురీ దాహనమ్

రావణ  కుంభకర్ణయోర్నిధనం 

రావణ  కుంభకర్ణయోర్నిధనం 

ఏతద్థి రామాయణమ్

Friday, February 6, 2015

ప్రేమ సందేశం

ఒక్క క్షణం నీ గుండె చప్పుడు వింటే చాలు
ఎడారిలో పువ్వుల వనం చిగురిస్తంది
అలా నువ్వు నవ్వితే చాలు
ముళ్ళ బాటలో మందారాలు వికసిస్తాయి
చిరకాలం ఉండాలి నాతో నీవు
కలనైనా మరువలేను నిన్నే నేను.
 అందుకో ప్రియా !!
 నా ప్రేమసందేశం ♥ ♥

Tuesday, January 20, 2015

ప్రియా !!

                                             నీవు నా చెంత లేవని
                                             నా మనసు రాయిచేసుకుంటే
                                             ఆ రాయి పైన అందమైన శిల్పంగా మారావు
                                             నేనేమి చేసేది ప్రియా!!