flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Monday, December 26, 2016

అన్నం పరబ్రహ్మ స్వరూపం

అన్నం పరబ్రహ్మ స్వరూపం...
"*"*"*"*
 ఎవరన్నా అన్నం పెట్టమని అడిగినారంటే మీ అదృష్టం. అంటే పుణ్య కాలం ప్రవేశిస్తున్నది అర్ధం, భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి. ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీవిద్యోపాసకుడు, సన్న్యాసి, వారి కంటే గోమాత ఇలా ఒక దాని కంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము.
నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చేయి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది నీవు పిలవ కుండానే, వెంటనే దానికి గ్రాసం గాని, అన్నం కాని పెట్ట వలయును. పిలవక పోయినా కాకతాళీయంగా ఒక సన్న్యాసి, ఒక శ్రీవిద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి, నీ ఇంటికి వస్తే కొన్ని కోట్ల జన్మల పాపం తరిగి పోతుంది, నీవు గాని అతనికి ఆతిధ్యం ఇచ్చినా కనీసంలో కనీసం కాస్త మంచి తీర్ధం ఇచ్చినా యెంతో పుణ్యదాయకం.
 ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తారో..!! యోగులు, జ్ఞానులు, బాబాలు అన్నం తిని, ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారు. డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు. మన పాప కర్మ తొలిగిపోతుంది. మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు. భగవంతుడు నీ కర్మ తొలిగించడానికి నీ పాప కర్మ తొలిగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కొంటూ వస్తారు.
 నీవు పెట్టే పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తొలగిస్తారు. నీవు పెట్టే పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయములోనే అంతే. ఒకసారి కాదనుకోన్నావా మరలా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, నీ పాపాలు అన్నీ తీసుకొని వెళుతుంది నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో..!!
అమ్మా అన్నం పెట్టు తల్లీ అని అడిగినవానికి లేదనకుండా వున్నది పెట్టు, నీ తరతరాలను ఆశ్వీరదించి వెళతాడు. తిండి దొరకక రారు ఎవ్వరూ నీ ఇంటికి. కావున , “అమ్మా అన్నం పెట్టు”... అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది. నల్లని ఆవుకు, నల్లని కుక్క కు అన్నం పెట్టడం వలన అపమృత్యు దోషం తొలిగిపోతుంది. అన్నంలో బెల్లం కలిపి పెడితే ఇంకా మంచిది.




                      
                                                                                                            సేకరణ: 

Saturday, October 8, 2016

సత్యమేవ జయతే ❅

కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.
అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.
ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు.
"రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.
మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.
ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను.
"రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు.
"సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.
అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు.
"రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి.
"సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.
ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని.
"రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.
'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు.
"రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.
రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.
సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.
రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.
"అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.
అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.
మళ్లీ రాజ్యం కళకళలాడింది.
ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు. సత్యాన్ని జీవితంలోకి ఆహ్వానించి, అడుగడుగునా నిజం చెబుదాం; వాస్తవంగా బ్రతుకుదాం. -ఏమంటారు.
                                                                                                                                                హిమజ ✿✿

Tuesday, October 4, 2016

ఇది నేను క్రియేట్ చేసిన చిన్న వీడియోక్లిప్పింగ్....




                                                                                                       ♥ హిమజ ♥ 

Saturday, September 17, 2016

కుసుమసముదాయం

తులసి 
పారిజాతం 
సన్నజాజి 
పున్నాగ
తెల్లకలువ
తెల్ల జిల్లేడు 
మంకెన 
వటవృక్షం 
జపాకుసుమం(మందార) 
కేతకి 
కనకచెంప 
కదంబం 
గురివిందపూలు 
గురివింద 
దేవకాంచన
జిల్లేడు
అతసి
అంబువాసిని 
ఇక్కడ మీకు అరుదుగా కనిపించే పువ్వులను పరిచయం చేస్తున్నాను.
కుందమల్లె 
తమాల
వీటిలో కొన్ని పూల గురించి లలిత సహస్ర నామాల్లో కూడా చెప్పబడింది.
నీలికలువ
పాలమల్లె 
వకుళపూలు 
పున్నాగ.1
       చంపక
         


Tuesday, September 13, 2016

వామనమూర్తి విశ్వరూప ప్రదర్శనం

ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపై
నంతై తోయదమండలాగ్రమునకల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత  సంవర్ధియై.

బలి మూడడుగుల భూమి దానమివ్వగానే  వామన రూపములోనున్న విష్ణువు  తన శరీరాన్ని క్రమంగా పెంచి ఆకాశాన్ని ,మేఘమండలాన్ని,సూర్యుని,చంద్రుని,ధ్రువమండలాన్ని,మహర్లోకమును దాటి బ్రహ్మాండమంతటిని  ఆక్రమించాడు. 








Thursday, July 28, 2016

బాల్యం

హృదయంలోమాలిన్యం లేకుండా
హాయిగా ఉండే జీవితం ఒక్క బాల్యం మాత్రమే
తిరిగిరాని మరువలేని జ్ఞాపకాల దొంతర బాల్యం
నిర్మలమైన మనసు ఆడుకునే మధురక్రీడ బాల్యం....




















                                                                                                                                                   

Tuesday, July 12, 2016

అపరంజి

 బంగారమునకు పర్యాయ పదాలు:
1.పసిడి
2.బంగరు
3.బంగారు
4.పైడి
5.పొన్ను
6.జాళువా
7.పుత్తడి
8.కుందనము
9.స్వర్ణము
10.కడాని
11.అపరంజి

Friday, January 8, 2016

యుగములు

చతుర్యుగములు
1.కృతయుగము.....17,28,000 సంవత్సరములు
2.త్రేతాయుగము.....12,96,000 సంవత్సరములు
3.ద్వాపరయుగము...8,64,000 సంవత్సరములు
4.కలియుగము.....4,32,000 సంవత్సరములు



Tuesday, January 5, 2016

నమో సూర్యదేవ

సూర్యునకుగల ఇతర నామాలు.
సూర్యునకు ఆదిత్యుడు, సవితహిరుడు, సూర్యడు , మిహిరుడు, అర్కుడు , ప్రభాకరుడు ,  మార్తాండుడు, భాస్కరుడు, చిత్రభానుడు , దివాకరుడు, రవి అనే 12 సామాన్య నామాలు...
విష్ణు, ధాత్,భగ,పూష, మిత్ర,ఇంద్ర,వరుణ,అర్యమ,వివస్వత్, అంశుమత్, త్వష్ట, పర్జన్య అనేవి విశేష నామాలు.. ఒక్కొనెలలొ.. ఒక్కొ పేరుతో ఈ విశేష నామాల రీత్యా సూర్యుని ప్రస్తావిస్తారు.. ద్వాదశాదిత్యులు అనగా వీరే .




సూర్య ప్రార్థన.
1. జయః సూర్యాయ దేవాయ తమోహంత్రె వివస్వతె
జయప్రాదయ సూర్యాయ భాస్కారాయ నమోస్తుతే

2. గ్రహొత్తమాయ దేవాయ జయః కల్యాణ కారిణే
జయః పద్మ వికాసాయ బుధరూపాయ తేనమః

3. జయదీప్తి నిధానాయ జయః శాంతి విధాయెనే
తమోఘ్నాయ జయాయైవ అజితాయ నమోనమః

4. జయార్క జయదీప్తిశ సహస్ర కిరణొజ్వల
జయనిర్మిత లోకస్త్వమ జితాయ నమో నమః

5. గాయిత్రీ దేహరూపాయ, సావిత్రీ దైవతాయచ
ధరాధరాయ సూర్యాయ మార్తండాయ నమోనమః
(దోష పరిహారార్ధం ఈ పంచశ్లొక స్తొత్రం ఆరు పర్యాయాలు నిత్యం పఠిస్తే ఆయురారోగ్య భోగభాగ్యాది  శుభములు ప్రాప్తించును)  

Monday, January 4, 2016

తులసి - నారాయణుడు

ఎక్కడెక్కడ తులసి ఉంటే అక్కడక్కడ నారాయణుడు ఉంటాడని ఆండాళ్ ఎంత దృఢంగా చెపుతుందో చూడండి.మనం అశ్రధతో ఇళ్ళలో తులశమ్మను పెట్టుకోకుంటే చేతులారా శ్రీకృష్ణుని రూపంలో ఉన్న నారాయణుని దూరం చేసుకున్నట్లే కదా!!