అనగనగా ఒకరోజు కుందేలు,తాబేలు ఎగ్జిబిషన్ చూడటానికి బయలుదేరాయి.అవి వెళ్ళే దారిలో పెద్ద మైదానం,పొడవైన వాగు అడ్డంగా ఉన్నాయి. కుందేలు నీటిలో ఈదలేక, తాబేలు మైదానంలో నడవలేక రెందురోజులు ప్రయత్నించి విఫలమయ్యాయి. మూడవరోజు ఎలాగైనా వెళ్ళితీరాల్సిందేనని అనుకొని మైదానంలో వెళ్ళేటప్పుడు కుందేలు తాబేలును,నీటిలో వెళ్ళేటప్పుడు తాబేలు కుందేలును తమ వీపుపై ఎక్కించుకున్నాయి.ఇలా కలిసి పనిచేసి అనుకున్న గమ్యానికి చేరుకున్నాయి.ఈవిధంగా టీంవర్క్ గా కలసిపనిచేసి ఎదురయ్యే ప్రతి సమస్యను సులభంగా అధిగమించవచ్చు.
Monday, December 22, 2014
Sunday, December 21, 2014
యక్ష ప్రశ్నలు
72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)
5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)
6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)
7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
(పెద్దలను సేవించుటవలన)
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
(అధ్యయనము వలన)
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన
సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల
అసాధుభావము సంభవించును.)
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
( మౄత్యు భయమువలన)
12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ,
అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
13. భూమికంటె భారమైనది ఏది? (జనని)
14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)
15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల
ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో
తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో
అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)
17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)
20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
( యజ్ణ్జం చేయుటవలన)
21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)
22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని
రక్షించక పోవడంవలన)
24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)
26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి
బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి
అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)
28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)
29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)
30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)
31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)
32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)
33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)
34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)
35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)
36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)
39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)
40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)
41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి,
ఆకాశములందు)
43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)
44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)
45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,
ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం,
క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)
46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)
47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)
48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)
49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ
దు:ఖాలను సమంగా ఎంచువాడు)
50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)
51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)
56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా
చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)
60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)
62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన
భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు;
వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,
దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది
గొప్పవాడవుతాడు)
68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
(సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో
తిని తౄప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం?
(ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే
శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
(ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని
సమంగా చూసేవాడు)
72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ,
శీతోష్ణాదులందు, కలిమి లేములందూ,
సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై
అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై
ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)

Thursday, December 18, 2014
సందేశం
మనం ఎంతకాలమైతే ఇతరులపై నిందలను మోపుతామో..అంతవరకు మన బలహీనతలను,తప్పులను మనం గుర్తించలేం!సాధారణంగా జనులు తమ దుస్థితికి కారణం ఇతరులే అంటూ నిందారోపణ చేస్తారు.లేదంటే భగవంతుణ్ణి నిందిస్తారు.లేకపోతే 'నా తలరాతా అని ఒక భూతాన్ని ఊహిస్తారు.విధి ఎక్కడ,విధి ఏమిటి? మనం ఏది నాటితే అదే పండుతుంది.మన విధికి మనమే కారకులం.ఎవరినీ నిందించటానికి లేదు,స్తుతించడానికి లేదు.
సేకరణ
స్వామివివేకానంద జీవిత సందేశం నుండి __
సేకరణ
స్వామివివేకానంద జీవిత సందేశం నుండి __
Tuesday, December 16, 2014
ధనుర్మాసం
సూర్యదేవుడు ధనుస్సు రాశిలో ప్రవేశించటంతో మొదలై భోగిపండుగ రోజువరకు,సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు ఉండేమాసం - "ధనుర్మాసం".
ధనుర్మాసం మొత్తం ఇంటిముందు ఆవుపేడను కలిపిన నీటినిచల్లి,బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి,ముగ్గుల మధ్యలో ఆవుపేడతోచేసి పసుపు,కుంకుమలు,వివిధపువ్వులను అలంకరించినగొబ్బిళ్ళను ఉంచాలి.ఈ విధంగా చెయటంవల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు,సౌభాగ్యం కలకాలం వర్దిల్లుతుంది అని నమ్మకం.
ఇక ప్రతి ముంగిటా సంక్రాంతి రంగవల్లులే.
వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. ఈ మాసమంతా వైష్ణవ ఆలయాలలో ప్రత్యక పూజలు చేస్తారు.గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ నెలరోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైనతిరుమలశ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెలరోజులు సుప్రభాతానికి బదులుగా "తిరుప్పావై"పఠిస్తారు.అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిస్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలి.ప్రతిదినం పూజించి,మొదటి పదిహేనురోజులు నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని,తరువాతి
పదిహేనురోజులు దద్ధోజనం నివేదనగాపెట్టలి.
ధనుర్మాసం మొత్తం ఇంటిముందు ఆవుపేడను కలిపిన నీటినిచల్లి,బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి,ముగ్గుల మధ్యలో ఆవుపేడతోచేసి పసుపు,కుంకుమలు,వివిధపువ్వులను అలంకరించినగొబ్బిళ్ళను ఉంచాలి.ఈ విధంగా చెయటంవల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు,సౌభాగ్యం కలకాలం వర్దిల్లుతుంది అని నమ్మకం.
ఇక ప్రతి ముంగిటా సంక్రాంతి రంగవల్లులే.
Monday, November 17, 2014
Sunday, November 9, 2014
Wednesday, October 22, 2014
Friday, September 5, 2014
Saturday, May 3, 2014
ఎదురుచూపులు
బృందావనం ఎదురుచూస్తోంది ..
నీకోసమే--
యమునాతటి ఎదురుచూపులు..
నీకోసమే-
వెదురు వేణువై ఎదురుచూస్తోంది..
నీకోసమే--
ఆబాలగోపాలం ఎదురుచూపులు
నీకోసమే--
ఆలమందలు ఎదురుచూసేది
నీకొసమే--
గోపికల నయనాలు వెతికేది..
నీకోసమే--
మహర్షుల మహత్వ తపోదీక్షలు
నీకోసమే--
అష్ట మహుషుల నిరంతరాలోకనాలు..
నీకోసమే--
భక్తజనుల నిత్య ధ్యానాలు నీ దర్శనభాగ్యం కోసమే --
ఎక్కడున్నావయ్యా ..నల్లనయ్యా..
నీకోసమే ఈ ఎదురుచూపులు కృష్ణయ్యా..
రావయ్యా..రావయ్యా..రావయ్యా...
మమ్మందరినీ కరుణించవయా ..
°ღ•ℋℐℳÁĴÁ●•٠·˙

Friday, May 2, 2014
అక్షయ తృతీయ
అక్షయ తృతీయ
అక్షయం అంటే నాశం లేకపోవడం
దిన దినాభివృధి చెందడం కూడా
అక్షయ తదియ చాల పవిత్ర మయినది ..
ఈ రోజే శ్రీ కృష్ణ పరమాత్ముడు ద్రౌపది కి అక్షయ పాత్రా ఇచ్చిన రోజు.
మహా లక్ష్మి పుట్టిన రోజు కూడా ఈ నాడే ..
సత్య యుగం అంతరించి త్రేతాయుగం మొదలు ఈ రోజే....
దివి నుండి గంగ భూమికి వచ్చినది కూడా ఈ దినమే....
భగవను వేదవ్యాసుడు శ్రీ గణేష్ తో మహాభరతం రాయుట మొదలు పెట్టింది ఈ సుదినమే ,,,,
ఈ రోజు బంగారాన్ని కొంటే అక్షయమౌతుందని నమ్మకం. అందుకే అక్షయ తృతీయనాడు నగల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. అక్షయమైన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి వైశాఖ శుద్ధ తదియను ' అక్షయ ' తృతీయగా వ్యవహరిస్తారు.
అక్షయ తృతీయరోజే కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతాయి. నాలుగు యగాల్లో మొదటిది కృత యగం.
ధర్మం నాలుగు పాదాలమీద నడిచిన కాలమది. పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట! నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదట!
నిరు పేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే.
క్షీరసాగరమధనం తర్వాత లక్ష్మిదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే! కాబట్టే అక్షయ తృతీయ నాడు...రాహుకాలాలూ వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే!
అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా,ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది.
స్థోమత ఉంటే నగనట్రా కొనచ్చు. కానీ అప్పుచేసి కొంటే మాత్రం తిప్పలే! సకాలంలో తీర్చకపోతే ...రుణాలూ అక్షయమవుతాయి! ఈ విషయంలో పెద్దలు కొన్ని మినహాయింపులిచ్చారు. బంగారం కొనగలిగే శక్తి లేకపోతే ... వెండి కొన్నా మంచిదేనట. అదీ కొనలేమనుకుంటే ఉప్పు కొన్నా ఫర్వాలేదంట! లవణంలోనూ లక్ష్మిదేవి ఉంటుంది.
అక్షయ తృతీయ రోజు సత్కార్యాలు చేయడం ద్వారా మంచిని అక్షయం చేసుకోవచ్చు.
అసలే వేసవి కాలం. ఎండలు మండుతున్నాయి. నలుగురు యాచకులకు చెప్పులో, గొడుగులో, దానం చేయవచ్చు. చల్లని మజ్జిగతోనో, పానకంతోనో పది మంది గొంతు తడపొచ్చు.
- అక్షయ తృతీయ ---

Monday, April 28, 2014
తెలుసుకొనగవలయు తెలుగుబిడ్డ
యతిసంగంబున,బాలుడాదరముచే,జ్యాభర్తదుర్మంత్రిచే
శ్రుతిహానిన్ ద్విజు డన్వయంబుఖలుచే,క్రూరాప్తిచేశీల,ము
ḧḭṁḀjḀ
శ్రుతిహానిన్ ద్విజు డన్వయంబుఖలుచే,క్రూరాప్తిచేశీల,ము
ద్ధతిచేమిత్రత,చూపులేమికృషి,మద్యప్రాప్తిచేసిగ్గు,దు
ర్మతిచేసంపదలున్ నశించు,చెడునర్ధంబుల్ ప్రమాదంబునన్.
1.సంగమము వల్ల యతీశ్వరులు చెడిపోతారట.
2.గారాబం చేస్తే కొడుకు పాడైపోతాడట.
3.పనికిమాలినవారి సలహాల వల్ల పరిపాలకులు పాడైపోతారట.
4.వేదహాని వల్ల బ్రాహ్మణులు పాడైపోతారట.
5.కొరగాని కొడుకు వల్ల కులం కూలిపోతుందట.
6.ఖలుని సేవిస్తే శీలం పోతుందట.
7.విర్రవీగితే స్నేహం చెడిపోతుందట.
8.పైపరామరిక లేకపోతే వ్యవసాయం పాడైపోతుందట.
9.మద్యపానం వల్ల సిగ్గుపోతుందట.
10.అవినీతి వల్ల ఐశ్వర్యం పోతుందట.
11.అడ్డమైనవాళ్ళకీ పంచిపెట్టినందువల్లా,అజాగ్రత్తవల్లా ధనము పోతుందట.
ḧḭṁḀjḀ
Sunday, April 27, 2014
తరగని ప్రేమ
గుండె.........నిండుకుందా..??
నిండుతుందా..!!
అనగనగా ఒక రాజు.. వేటకని అడవికి వెళ్ళి దారి తప్పాడు.
ఆకలవుతోంది.ఒక దిశ అని లేకుండా కాళ్ళు ఎటు తీసికెల్తే అటు వెళ్తున్నాడు.
పొద్దుగుంకి చీకటి ఆవరిస్తోంది. రాజు వెడుతున్నాడు కొంత దూరంలో
గుడ్డి దీపపు వెలుగు కనిపించింది.రాజుకు ప్రాణం లేచొచ్చింది.
వుత్సాహంగా అక్కడికి వెళ్ళాడు. చూస్తే..అది గుడిసె.
అందులో ఓ పండు ముసలమ్మ. "అవ్వా ఆకలేస్తోందీ"..అన్నాడు రాజు.
ఆ క్షణంలో అన్నం పెట్టిన వారికి అర్ధ రాజ్యం రాసిచ్చెయ్యగలడు.
ముసలవ్వకు వచ్చింది ఎవ్వరో తెలియదు.ఎవరో అతిధి.
విరోధికి కూడా అరిటాకు వేసే సంస్కారం మనది.కానీ
ఆమె నిరుపేద.ఇంట్లో ఒక్క గింజైనా లేదు.బియ్యం నిండుకున్నాయి.ఏంచేయాలీ..?
పిచ్చుకల కోసం వేలాడదీసిన వరికంకులను చేత్తో
నలిచింది.బియ్యపు గింజలు రాలిపడ్డాయి.వాటిని ఎసట్లో వేసింది.
ఊతకర్ర సాయంతో పెరట్లోకి వెళ్ళి చింత చిగురు..
అదే చేత్తో నాలుగు పచ్చిమిరపకాయలు తెచ్చింది.
వాటిని రోట్లో నూరింది.క్షణాల్లో పచ్చిపులుసు సిద్దం.
కాళ్ళూ చేతులూ కడుక్కుని కూర్చున్న రాజు ముందు విస్తరాకు వేసింది.
వేడి వేడిగా భోజనం వడ్డించింది.రాజు తన జీవితంలో ఎప్పుడూ అంత రుచికరమైన విందును ఆరగించలేదు.
రాజు తన కృతజ్ఞతలు చాటుకున్నాడు.
ఈ ముసలమ్మే కాదు తరచి చూస్తే మన పెద్దవాళ్ళందరూ మనకు
గొప్ప పాఠం చెబుతారు.దేనికీ లేవు..లేదు..కాదు..
అని ప్రతికూలంగా మాట్లాడే అలవాటు మనవాళ్ళకు లేదు.
బియ్యం అయిపోతే..బియ్యం నిండుకున్నాయంటారు..
నల్లపూసలు పెరిగిపోయాయంటారు..కానీ తెగిపోయాయనరు..
దీపం ఆరిపోయిందీ అనకుండా..కొండెక్కింది అంటారు..
డబ్బులు లేకపోతే..ఇంకా చేతికందలేదు..వచ్చాక ఇస్తామంటారు.
మనం వాళ్ళనుంచి నేర్చుకోవాల్సిన "పాజిటివ్ ఆటిట్యూడ్".. ఇంతకంటే వేరే ఏముంటుంది..?
మనమూ అలాగే వుందాం.మన దగ్గర ఏదైనా నిండుకోవచ్చు.కానీ
ప్రేమ ఎప్పుడూ ఎంత కావాలంటే అంత మన దగ్గర వుంచుకోవాలి.ఎందుకంటే అది తీసిన కొద్దీ రెట్టింపు అవుతంది .

Thursday, April 17, 2014
Wednesday, March 26, 2014
చిత్రగ్రీవం
నా పెంపుడు పావురం పేరు చిత్రగ్రీవం."చిత్ర"అంటే ఉల్లాసభరితమైన రంగులతో నిండిన,"గ్రీవం"అంటే కంఠం.నా పావురం మెడ చిత్ర విచిత్ర భరితం అన్నమాట.అందుకే నా పావురాన్ని హరివిల్లు మెడగాడు అని ముద్దుగా పిలుస్తంటాను. అందంలో దానికి సాటి రాగల పావురం మా వూళ్ళోనే లేదని స్పస్టమయింది.
చిత్రగ్రీవం తల్లిదండ్రులు గురించి చెప్పుకుందాం. దాని తండ్రి పక్షి ఓ గిరికీల మొనగాడు.తల్లి పక్షి ఓ వార్తల పావురం.ఆ రోజుల్లో అది అతి సుందరమైన కులీన వంశానికి చెందిన పావురం.ఆ రెండు పావురాలు జతకట్టాయి.గుడ్లు పెట్టాయి. వాటికి పుట్టిన చిత్రగ్రీవం అందువల్లనే తరవాతి రోజుల్లో యుద్ధరంగాల్లోను,శాంతిదూతగాను పనిచెయ్యగల పావురంగా రూపొందింది.తల్లిపక్షి నుండి తెలివితేటలు సంపాయించుకుంది.తండ్రిపక్షి నుండి వేగం,చురుకుదనం,సాహసం సంతరించుకుంది.అలా సమకూర్చుకున్న శక్తియుక్తుల పుణ్యమా అని అది యెన్నోసార్లు శత్రువుల దాడి నుంచి అఖరిక్షణంలో దాడి చేస్తున్న డేగల తలలమీద నుండే గిరికీలు కొట్టి తప్పించుకునేది.
ఇంకా గుడ్డులో వున్నప్పుడే చిత్రగ్రీవం ఓ ప్రమాదం లోంచి ఎలా తప్పించుకుందో ముందు చెపుతాను.ఆరోజు నేను ఎప్పటికి మరచిపోలేను. తల్లిపావురం పెట్టిన రెండు గుడ్లలో ఒకదానిని పొరపాటున జారవిడిచి పగులగొట్టిన రోజది.ఆ తెలివిమాలినపనికి నేను ఈనాటికీ సిగ్గుపడుతూ వుంటాను. బాధపడుతూవుంటాను. నేను పగులగొట్టిన ఆరెండోగుడ్డులో ప్రపంచంలోకెల్లా అతి విశిస్టమైన పావురం వుండేదేమో.ఎవరికి తెలుసు!ఆ దుర్ఘటన ఇలా జరిగింది.
మా మేడమీద పావురాల గూళ్ళు వుండేవి. తల్లిపావురం గుడ్లు పొదుగుతున్న గూటిని నేను ఓ రోజు శుభ్రం చేద్దామని వెళ్ళాను.ఆ సమయంలో తండ్రిపక్షి వచ్చి గుడ్లని నేనేదో చేస్తున్నానని నా మొహం రక్కింది.ఆ హడావుడిలో గుడ్డు జారవిడిచాను.అలా ఆగుడ్డు పగిలిపోయింది.
పుట్టిన రెండోనాటినుంచే చిత్రగ్రీవం తన తల్లో తండ్రో గూటికి వచ్చిన ప్రతిసారీ తన ముక్కు తెరచి గులాబీరంగు ఒంటిని బంతిల వుబ్బించటం నాకు బాగాగుర్తంది.మా చిత్రగ్రీవానికి ఆకలెక్కువ.తల్లిపక్షి తనదగ్గరేవుండి బాగోగులు చూస్తుండగా తండ్రిపక్షి ఆహారసేకరణలో నిమగ్నమై వుండేలా చేసేది చిత్రగ్రీవం. తల్లిదండ్రుల శ్రమ,పాలనలో ఏపుగా పెరిగింది చిత్రగ్రీవం.గులాబీరంగు మారి పసుపు కలిసిన తెలుపురంగు రంగురంగుల ఈకలతో అందంగాను,ముక్కు బాగా గట్టిపడి చక్కగా తయారైంది.ఐదో వారానికల్లా చిత్రగ్రీవం గూటినుంచి బయటకు గెంతి పావురాల గూళ్ళ దగ్గర వుంచిన మట్టి మూకుళ్ళలో నీళ్ళు తాగే స్థాయికి చేరింది. సొంతంగా ఆహారం సంపాదిచుకునే ప్రయత్నం చేస్తూ స్థూలంగా తన ఆహారంకోసం తల్లిదండ్రుల మీదే ఆధారపడి వుంది.
మరో రెండు వారాలు గడిచేసరికల్లా చిత్రగ్రీవం ఎగరడం నేర్చుకుంది.పుట్టింది పక్షి పుట్టుకే ఐనా ఎగరడం అన్నది అంత సులభంగా జరగలేదు.చిత్రగ్రీవాన్ని రోజూ తీసుకెళ్ళి పిట్టగోడమీద వదిలితే అది గంటల తరబడి కూర్చొని వుండేది తప్ప ఎగరటం అనే పని పెట్టుకోలేదు.కింద కొన్ని శనగ గింజలు పోసి తినమనిపిలిచాను. అది గోడమీద పచార్లు చెయ్యడం మొదలుపెట్టంది.అలా నిరాశాభరితమైన నాటకం ఓ పావుగంట కొనసాగింది.చివరకు అది సంకోచాన్ని అధిగమించి కిందకు దూకనే దూకింది.ఎగరడం అన్న మహత్తరఘట్టాన్ని చేరుకుంది చిత్రగ్రీవం. తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పేపని చేపట్టింది. సాయంత్రం వేళ తండ్రిపక్షి గాలిలో గిరికీలు కొడుతూ చిత్రగ్రీవం పక్కన వచ్చి వాలింది.ఏమోయి !బడుధాయ్ మూడునెలలు వచ్చాయ్ ఇంకా ఎగిరే ప్రయత్నాలేం లేవా? భయమా?అసలు నువ్ పావురానివా,వానపామువా?అన్నట్టు చూసింది. చిత్రగ్రీవం వులుకు,పలుకు లేకుండా గంభీరంగా ఉండిపోయింది. తండ్రిపక్షికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే చిత్రగీవం పక్కన చేరి కువకువ అని గద్దించసాగింది.చిత్రగ్రీవం పక్కకు జరుగుతోంది.తండ్రిపక్షి పట్టు విడువకుండా కూతలు పెడుతూ పక్కకు జరగసాగింది. చిత్రగ్రీవం ఇంకా ఇంకా జరిగింది. తండ్రిపక్షి జరగటం ఇంకాకొనసాగించింది. చిత్రగ్రీవం పిట్టగోడ చివరకుజరిగి కిందపడే స్తితికి చేరింది. అలా జారబోయి స్వీయ రక్షణ కోసం అసంకల్పితంగా రెక్కలు విప్పార్చి గాలిలో తేలింది. నా సంతోషానికి అవధులు లేవు. అది చూసిన తల్లిపక్షికుడా బిడ్డకు సాయంగా గాలిలోకి ఎగిరింది. అలా పదినిముషాలు గాలిలో గిరికీలు కొడుతూ ఎగురసాగాయి. చిత్రగ్రీవం మాత్రం నానా పాట్లు పడుతూ రెక్కలు ముడిచి క్షేమంగా వాలి ఉత్తేజంగా రొప్పసాగింది. ఎలాగైతేనేం చిత్రగ్రీవం విజయం సాధించింది. నాకిప్పడు చాలా సంతోషంగా ఉంది. చిత్రగ్రీవాన్ని చూస్తుంటే.
ఈ కధ రచయిత ధనగోపాల్ ముఖర్జీ. ఈకధ 10వ తరగతి తెలుగు వాచకంలో(కొత్తపుస్తకంలో}పాఠ్యాంశంగా చేర్చ బడింది.
°ღ•ℋℐℳÁĴÁ●•٠·˙
Friday, March 14, 2014
తెలుగమ్మాయి
తెలుగమ్మాయి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు..
మన కట్టూ బొట్టూ సాంప్రదాయం వీటికి తిరుగులేదనిపిస్తుంది. వీటి అందచందాలు చిత్రీకరణ విదేశీ అమ్మాయిల చిత్రీకరణ కంటే కొంచెం కష్టమే మరి! అయినా మన సాంప్రదాయ దుస్తులే ఎక్కువ అందంగా వుంటాయనిపిస్తుంది నాకు. మరి మీకో?
ஃᅔнιмαjαᅕஃ

తెలుగు భాష ఎంత మధురమో తెలుగమ్మాయి అంత అందం.పోల్చటంలో కూడా "పదహారణాల తెలుగమ్మాయి" అని మన పెద్దలు చెపుతూ వుంటారు.కట్టు,బొట్టు,వాలుజడ,పట్టు పావడాలు,జడలో పూలతో బాపు బొమ్మలాటి తెలుగమ్మాయి మన కళ్ళముందు నడయాడుతున్నట్లు వుంటంది.
కాలి అందెల సవ్వడులతో గాజుల గలగలలతో చిరునవ్వులు చిందిస్తూ నట్టింట తిరుగాడుతున్న తెలుగమ్మాయి అపర లక్ష్మీదేవి వలె ఇంటికి అందాన్ని తెస్తుంది.
తెలుగు వెలుగు ,తెలుగమ్మాయి జిలుగు,
చెరిత్రకే మెరుగు,మన దేశానికే వెలుగు.
Tuesday, March 4, 2014
ఉమ్మడి కుటుంబం
ఎప్పుడైతే “కుటుంబ సభ్యులూ, బంధువులూ మన మనస్థత్వానికి సరిపడరు..” అన్న తలంపు వచ్చేస్తుందో ఆటోమేటిక్‌గా చాలామందికి అనుబంధాల మీద నమ్మకం పోతుంది…
“వీళ్లంతా లేకపోతే నాకేంటంట.. నా బ్రతుకేదో నేను బ్రతకలేనా…. ” అన్న పంతమూ మొదలవుతుంది.
ఒకప్పుడు 10 మంది కుటుంబ సభ్యలు రకరకాల అభిరుచులు . భరించలేమనుకున్నాం.. సరే… ఇప్పుడు అమ్మా, నాన్నా, పిల్లలున్న నలుగురు కూడా కలిసి ఉండలేని స్థితికి వచ్చేశాం… చివరకు అస్సలు పిల్లలే వద్దు ఇద్దరం బ్రతికేస్తే చాలు అనుకుంటున్నాం…. ఆ ఇద్దరూ ఒకరికొకరు పడక విడిపోతున్న దౌర్భాగ్యమూ పడుతోంది… అంటే తప్పెవరిది? మనం దూరం పెట్టేస్తున్న కుటుంబ సభ్యులదా? మనదా?
✿✿Himaja✿✿

Saturday, March 1, 2014
Friday, February 28, 2014
Subscribe to:
Posts (Atom)