flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Sunday, December 29, 2013

 సంక్రాంతి భోగిపళ్ళు,అతిగాతింటే పులియును పళ్ళు
           బడికి వెళ్ళేటప్పుడు,నిక్కరు జేబునిండా నింపుకేళ్ళు
              పంతులుగారి పాఠాలు వింటూచప్పరిస్తూ మూయి కళ్ళు.


Wednesday, December 25, 2013

లాలి పాట

రామా లాలీ మేఘశ్యామా లాలీ

తామరసనయన దశరథతనయా లాలీ ||రా||

అబ్జవదన ఆటలాడి అలసినావురా నీ

బొజ్జలో పాలరుగగానే నిదురబోవరా ||రా||

అద్దాల తొట్టెలో నేమో అనుమానించేవూ

ముద్దులపాపలున్నారని మురిసి చూచేవూ ||రా||

ఎంతో యెత్తు మరిగినావు యేమి సేతురా

ఇంతుల చేతుల కాకకు మేనెంతో కందునురా ||రా||

జోలపాడి జోకొట్టితే ఆలకించేవు

చాలించి మరియూరకుంటే సైగలు చేసేవు ||రా||

వెన్న పాలు ఉగ్గు నెయ్యి బాలుడ నీవు

తిన్నగా సేవించివయ్య తియ్యగ నుండు ||రా||


తారాశశాంకము

                                                 తారాశశాంక కధకు సంబంధించిన చాటుపద్యం

నక్షత్రపు పేరిటి చెలి
నక్షత్ర సుఖంబుగోరి నక్షత్రములోన్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రముబట్టి యీడ్చె నక్షత్రేశున్.

ఇది తారాశశాంక కధకు సంబంధించినది .నక్షత్రపు పేరిటిచెలి అనగా తార, నక్షత్ర సుఖంబుగోరి అనగా  "ఆశ్లేష" ఆలింగనసుఖము కోరి  నక్షత్రములోన్ అనగా "చిత్త" మనసులో ,నక్షత్రమునకురమ్మని  "మూల"   మూలకురమ్మని , నక్షత్రముబట్టి  అనగా "హస్త" చేయిపట్టి ,నక్షత్రేసున్ యీడ్చెన్  అనగా చంద్రుని లాగింది. 

Tuesday, December 24, 2013

కావ్యశాస్త్రవినోదేన,కాలో గచ్ఛతి ధీమతాం,
వ్యసనేన తు మూర్ఖాణాం,నిద్రయా కలహేన వా//

ధీమంతులైనవారికి కావ్యశాస్త్రవినోదంతో కాలం గడుస్తుంది.మూర్ఖులకు వ్యసనంతో గాని,నిద్రతోకాని, కలహంతోకాని కాలం గడుస్తుంది. 

Saturday, December 21, 2013



ఈమధ్యే ఒక అందమైన ప్రపంచాన్ని మా ఇంటి వరండాలో చూశాను.శ్రమైక జీవన సౌందర్యాన్ని,కుటుంబ విలువల్ని  చూశాను ఎలాగో చెప్పా లా?
    చిన్ని చిన్ని ఆకులను,పుల్లలను చిట్టి ముక్కుతో తెచ్చి మా వరండాలొని గుమ్మడికాయను తొలిచి అందులో గూడు కట్టుకున్న పిచ్చుకలజంటను,ఉదయమేలేచే వాటి క్రమశిక్షణను, కష్టపడి ఆహారం తెచ్చి పిల్లలకుపెట్టే ఆ చిన్ని ప్రాణులని చూశాను.కానీ ఏమి అయిందో ఏమో కొన్ని రోజులనుండి ఆ గూడు మూగబోయింది....మళ్ళీ ఈరోజు మరొక పిచ్చుకల జంట పాత గూటిని తీసివేసి కొత్త గూటిని కట్టుకుంటున్నాయి.హమ్మయ్య .. మనసు కుదుటపడింది.      
          

వివాహ వ్యవస్థ

                                                    భారతీయ వివాహ వ్యవస్థలోని గొప్పదనం
        

Wednesday, December 18, 2013

అష్ట కష్టాలు

                                                                 

                             1.దాస్యం
                             2.దారిద్ర్యం
                             3.భార్య లేకుండుట
                             4.స్వయంకృషి
                             5.యాచనము
                             6.యాచకులకు లేదనుట
                             7.అప్పు పడుట
                             8.ప్రయాణం చేయుట 
                                                                       వంశ(వెదురు)వనిత              

                                                                        చతుష్షష్టి కళలు


Sunday, December 15, 2013

అష్టాదశ పురాణాల పేర్లు

 అష్టాదశ పురాణముల పేర్లు సులువుగా గుర్తుపెట్టుకోవడానికి

మద్వయం భద్వయం చైవ బ్రత్రయంచ వచతుష్టయం
అ నా ప లింగ కూ స్కాని పురాణాని పృధక్పృధక్.

మద్వయం=మత్స్యపురాణం,మార్కండేయపురాణం
భద్వయం = భాగవతపురాణం,భవిష్యపురాణం
బ్రత్రయం=బ్రహ్మాండపురాణం,బ్రాహ్మపురాణం,బ్రహ్మవైవర్తపురాణం,
వచతుష్టయం= వామనపురాణం,వాయవ్యపురాణం,వైష్ణవపురాణం,వరాహపురాణం
అ= అగ్నిపురాణం
నా=నారదపురాణం
ప=పద్మపురాణం
లిం= లింగపురాణం
గ= గరుడపురాణం
కూ= కూర్మపురాణం
స్కా= స్కాందపురాణం   

Friday, December 13, 2013

కర్తా కారయితాచైవ ప్రేరకశ్చానుమోదక:
సుకృతే దుష్కృతేచైవ చత్వారిస్సమభాగిన:

ఏదైనా ఒక మంచి పనిగాని,చెడుపనిగాని చేసినపుడు దానిఫలితం నలుగురికి సమానంగా లభిస్తుంది.పని చేసినవాడు,ఆపనికి కారకుడైనవాడు,ఆపనిని ప్రేరేపించినవాడు,ఆపనికి అంగీకారం తెలిపినవాడు సమానఫలితాన్ని పొండుతారు.చెడు విషయాలలో ఆపనులు మనం చేయకపోయినా,చూస్తూ వూరుకున్నా దానివల్ల లభించే శిక్షలు మనం కూడా అనుభవించవలసి వస్తుంది.కాబట్టి చెడ్డపనులు చేయకపోవటమేకాదు వాటికి కారకులు,ప్రేరకులు,అనుమోదకులు కాకూడదు.

Tuesday, December 10, 2013

మహనీయుల మహితోక్తులు


                                               

1.చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళలోనే వుంటాయి.ఐనా వాటి వాసన అలాగేవుంటుంది. అదేవిధంగా మనిషి శరీరాన్ని ఎంత కడుక్కున్నా యేమిలాభం?మనస్సులోని మాలిన్యాలను కడుగలేకపోయాక? - కబీరుదాసు  

2.ఈప్రపంచంలో సముద్రంకంటే సారాయి ఎక్కువమంది మనుషులను ముంచేసింది. -పబ్లియస్ సైరస్

3.విషంకలిసిన భోజనాన్ని,కదలిపోయే దంతాలని,చెడు సలహాలనిచ్చేవారిని పూర్తిగావదిలివేయడమే శ్రేయస్కరం -హితోపదేశం

4.ఒక పుస్తకం నుండి మనం కాపీ కొడితే అది తప్పు.అయితే  అనేక పుస్తకాలనుండి ఏకబిగీన  కాపీ కొడితే మాత్రం అది పరిశోధన. -వి.మిజినెర్

5.ఎవరితో మంచి స్నేహం కోరతామో వారితో డబ్బుకు  సంబంధించిన వ్యవహారాలు పెట్టుకోవద్దు.
                                              -శుక్రనీతిసారం          
         

Friday, December 6, 2013

గంగావతరణం

                                                                         

                                             
                                      ఆకాశంబుననుండి శంభుని శిరంబందుండి శీతాద్రి సు
                                      శ్లోకంభైన హిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య
                                      స్తోకాంభోధి పయోధినుండి పవనాంధోలోకంకముంజేరె గం
                                     గా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్టసంపాతముల్

కపిల మహాముని కోపాగ్నికి భస్మమైన తన పితరులకు పుణ్యలోక ప్రాప్తికై భగీరధుడు గంగనుగూర్చి తపస్సుచేయగా గంగ ఆకాశమునుండి శివునితలమీదకు,అక్కడనుండి హిమాలయపర్వతము మీదకు,అక్కడనుండి భువికి,భూలోకమునుండి సముద్రములోనికి,అటనుండి పాతాళలోకానికి చేరి సగరుల భస్మరాసులపై ప్రవహించి వారికి పుణ్యలోక ప్రాప్తి  కలిగించింది. 



  నుడిగొని రామపాదములు సోకి ధూళివహించి ఱా యెయ
  యేర్పడనొక కాంతనయ్యట పన్నుగ నీతని పాదరేనువి
  య్వడవడి నోడ సోకనిది యేమగునోయని సంశయాత
  కడిగె గుహుండు రామ పదకంజయగంబు భయంబు పెంపునన్

కాంతివంతమైన రామ పాదము తగిలి ఓ రాయి కాంతగా మారింది. అటువంటి పాద రేణువుసోకి ఓడ ఏమవుతుందోనని, రామున్ని నది దాటించేటపుడు సంశయిస్తూనే గుహుడు సానుకూలంగా స్పందిస్తూ ఆహ్వానించాడు. నీలమేఘచ్ఛాయ బోలుదేహము వాడు ధవళాబ్ద పత్ర నేత్రములవాడు, త్రిలోకనాథుడు, జగదేకవీరుడు, దశరథ తనయుడు అయిన శ్రీరాముడు తన ఓడను ఎక్కడమే జన్మధన్యత గాంచడంగా తలచడం ఓవైపు అయితే, తన జీవన భృతిహి దోహదపడుతున్న ఓడ ఏమైపోతుందోనన్న భీతితో సందిగ్ధతతో సతమతమయ్యే గుహుని స్థితిని మనకు చమకృతి శ్లేషలు కలగలిపి వివరించడం మొల్లకే చెల్లుబాటయింది.
(అంతర్జాల సేకరణ)

Thursday, December 5, 2013

భరతమాత విశిష్టత

                                                     
                                              సీ //          సగర మాంధాత్రాది షట్చక్రవర్తుల
                                                                  నంకసీమల నిల్పినట్టి సాధ్వి
                                              కమలనాభుని వేణుగాన సుధాంబుధి
                                                                      వోలలాడిన పరిపూతదేహ
                                               కాళిదాసాది సత్కవికుమారులగాంచి
                                                                     కీర్తినందిన పెద్దగేస్తురాలు
                                              బుద్ధాది మునిజనంబుల తపంబున
                                                                    మోదబాష్పముల్  విడిచిన భక్తురాలు

                                    గీ //     సింధు గంగా నదీ జలక్షీరమెపుడు
                                              గురిని బిడ్దల పోషించుకొనుచునున్న
                                              పచ్చిబాలింతరాలు మాభరతమాత
                                              మాతలకు మాత సకలసంపత్సమేత
                                                                                                     గుఱ్ఱంజాషువాగారు





                   

Sunday, December 1, 2013

                                                         మామిడిపండ్లు మీకోసమే             
దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు.... ?
సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ, హోమాదుల్లోనూ,  శుభకార్యాల్లోనూ, కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయపైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడయితే కొబ్బరికాయను స్వామిముందు కొడతామో మన అహంకారాన్ని విడనాడుతున్నామనీ, లోపలున్నతెల్లని కొబ్బిరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలని ఉంచమని అర్ధం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మానవశరీరం. బొండం పైనున్న చర్మం, మన చర్మం, పీచు మనలోని మాంసం, పెంకు  ఎముక, కొబ్బరి  ధాతువు, అందులోని కొబ్బరినీరు మన ప్రాణధారం..... కాయపైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులు....
ఇది "డైమండ్ క్రాస్"అని పిలువబడుతున్న నాగపూర్ లోని రైల్వేట్రాక్. మన భారతదేశంలో మరెక్కడా ఇలాంటి రైల్వేట్రాక్లెదు. ఇది ఉత్తర,దక్షణ,తూర్పు,పడమరలను కలుపుతున్న పెద్ద రైల్వేట్రాక్.  

Friday, November 29, 2013

  • బిల్హణీయ పద్య చమత్కృతి

    రవిజుడు భా గుణింప విధురంబుగ భట్టి నశించె,భారవి
    ప్రవరుడడంగె దీర్ఘమున బ్రాణము బాసె గుడియ్య భిక్షు, డీ
    యవనికి దప్పె భీముడు,దదంత గతి న్మఱి కొమ్మువెట్ట ని 
    క్కువముగ నే భుకుండుడను,గొమ్మున దీర్ఘము వెట్టకుండ డీ
    భువినత డెన్న నిర్దయుడు,భూపతి వీపు దలంప భూవరా!

    లక్ష్మీమందిరమనే పురాన్ని మదనాభిరామభూపతి పాలిస్తుండేవాడు.ఆ రాజుకు "యామినీపూర్ణతిలక" అనే కుమార్తె వుండేది.రాజు తన కుమార్తెకు విద్య నేర్పించడానికి"బిల్హణుడు"అనే కవిసత్తముని పిలిపిస్తాడు.ఆ కవి సౌందర్యం చూసి రాజుకు మనసులో ఒక సందేహం కలిగింది.ఇంత అందమైన వానిని చూస్తే నా కుమార్తె ఈతని ప్రేమలో పడిపోతుంది ఎలా అని మంత్రిని సలహా అడిగాడు.పండితునికి కుష్టు వ్యాధి వున్నవారిని చూడకూడదనే నియమం వుంది.రాకుమారికి గ్రుడ్డివారిని చూడననే నియమంవుంది.దీనిని సాకుగా చేసుకొని కవి గ్రుడ్డివాడని రాకుమర్తెకు,రాకుమారి కుష్ట వ్యాధిగ్రస్తురాలని కవికి చెప్పి ఒకరినొకరు చూడకుండా మధ్యలో ఒక కాండపటం(పరదావంటిది)పెట్టించి విద్య మొదలు పెట్టించాడు.ఒకనాటి సాయంత్రం చంద్రోదయం కాగానే ఆకాశాన్ని చూస్తూ అందమైన పద్యాలు చెప్పడం మొదలుపెట్టాడు కవి అది విన్న రాకుమార్తె గ్రుడ్డివాడు చంద్రుని మీద ఇంత అందంగా పద్యాలు ఎలా చెపుతున్నాడు అని కాండపటం తొలగించి పండితుని చూచింది.ఒకరినొకరు చూచుకొని ఇది తండ్రి ఆడిన నాటకమని గమనించారు.ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు.ఈ సంగతి తెలిసిన రాజు" బిల్హణుని"శిరశ్చేదనం చేయమని ఆదేశించాడు.అప్పుడు కవి ఒక పద్యం వ్రాసి తలారులకుఇచ్చి రాజుగారికి చూపమని పంపుతాడు.అది చదివిన రాజు శిక్షను రద్దుచేసి కవికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు.ఇంతకీ అందులో ఏముందంటే ఓ రాజా!యమధర్మరాజు "భ"గుణింతం వ్రాయటం మొదలుపెట్టాడు."భ"వ్రాయగానే భట్టి మరణించాడు "భా" వ్రాయగానే భారవి చనిపోయాడు "భి"వ్రాయగానే భిక్షుకుడు మరణించాడు."భీ" వ్రాయగానే భీమసేనుడు మరణించాడు తరువాత "భు"వ్రాస్తే నేనుభుకుండుడను(బిల్హణుని నామాంతరం)మరణిస్తాను.తరువాత"భూ"వ్రాస్తే భూపతివి నీనే మరణిస్తావు అని వ్రాసి పంపాడు.

Thursday, November 28, 2013



మనం చిన్నతనంలో ఎంత మారం చేసిన వాళ్ళు ప్రేమతో మనల్ని, మన అల్లర్ని భరిస్తారు అలాగే వాళ్ళు ముసలివాళ్ళు అయిన తరువాత వాళ్ళు చేసిన పనులు, మాటలు మనకు చాదస్తం అనిపించినా మనం కూడా అంతే ప్రేమతో వాళ్ళని ప్రేమించాలి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చేకొద్దీ మన పిల్లలగానే భావిస్తే ప్రతీ ఇల్లు స్వర్గాధామమే....
                                                             నీటికోసం పాట్లు
                                              కొమ్ములున్నగురువు

 ఒక గొప్ప పండితునివద్ద పలువురుశిష్యులుండేవారు.వారిలో ఒక శిష్యునికి గురువుగారంటేఅమితమైన ప్రేమ ప్రతివారివద్ద గురువునుగూర్చి గొప్పగా చెపుతుండేవాడు. ఒకసారి వేరొక పండితునివద్ద తన గురువుగారిని గూర్చి పొగడగా ఆ పండితుడు మీ గురువుగారి గొప్పేమిటి?ఆయనకేమైనా కొమ్ములున్నాయా అన్నాడు. అవునండీ  మా గురువుగారికి మూడు కొమ్ములున్నాయి."గు"లో ఒక కొమ్ము ,"రు"లో ఒక కొమ్ము,"వు"లో ఒక కొమ్ము వున్నాయని గడుసుగా సమాధానం చెప్పాడు.
         

Thursday, September 19, 2013

బాలతూలిక

బాలతూలిక లింకులు

పిల్లలే కాదు కొందరు యువకులు కూడా కొత్తగా తెలుగు నేర్చుకోడానికి ఉత్సాహం చూపుతున్నట్టు కొన్ని బ్లాగులు చూస్తే కనిపిస్తోంది. ఒక వేపు, తెలుగు మర్చిపోతున్నాం, స్కూళ్లలోనూ ఇళ్లలోనూ కూడా తెలుగుమీద ఆసక్తి ఉండడంలేదు అని బాధ పడేవారు చాలామంది కనిపిస్తూనే వున్నా, మరొక వేపు, పిల్లలకి తెలుగు నేర్పుదాం అని ఆసక్తి చూపించే పెద్దలూ, నేర్చుకోడానికి ఆసక్తి చూపే పిన్నలూ కూడా కనిపిస్తున్నారు. నాకు  ముఖ్యంగా ఈ అభిప్రాయం కలిగించింది తెలుగు4కిడ్స్ సైటు నిర్వాహకురాలు లలిత. ఆమెకి ధన్యవాదాలతో, నేను కూడా చేయగలిగింది చేద్దాం అన్న కోరికతో ఈ పేజీ తెరిచాను.
నాకు తెలిసినవి ఇవి.
ఇంకా ఎవరైనా ఇలాటి కృషి చేస్తుంటే, వారి లింకులు ఇస్తే, అవి కూడా ఇక్కడ పెడతాను.
గుర్రం ఎగరావచ్చు కథకి విడియోలింకు కింద ఇస్తున్నాను.

అక్షరమే అమ్మ

July 07, 2013 By: జాబిల్లి Category: పాటలు

‘అ’ అని నోరు తెరవమని అమ్మ
గోరు ముద్దలు తినిపించింది
‘ఆ’ అని నవ్విస్తూ
‘ఇ, ఈ’ ల ఇకఇకలతో
‘ఉ, ఊ’ అని నేనంటున్నా
‘ఎ, ఏ’ , ‘ఐ’ అంటూ
‘ఒ, ఓ ‘ , ‘ఔ’నని నాతో అనిపిస్తూ
‘అం’ అన్న నా ముద్దు పలుకులకి
‘అః’ అని అమ్మ మురిసిపోయింది
                                                               —
                                                                      డా.నీరజ అమరవాది

కాదేది కళలకు అనర్హం


Colours of Kerala

No need for captions or comments here. Just some lovely, colourful and captivating photos taken at the Omkaram flower shop in Chalai Market, Trivandrum, the other day. Enjoy.











Monday, April 15, 2013


మరుమల్లెల గుబాళింపు

హాయ్ ..
        బ్లాగ్  ప్రపంచం లోకి  తొలి  అడుగు  వేసాను . మరి
నాకూ  స్వాగతం చెప్పరూ.... 

Grate women