ప్రవహించే నదిలోని సహస్ర శివలింగాలు
సిర్సి సందర్శించేవారు సహస్ర లింగ ప్రదేశాన్ని చూడవలసిందే. దీని అర్ధం వేయి లింగాలని చెపుతారు. ఈ ప్రదేశం సిర్సి పట్టణానికి 10 కి.మీ. దూరంలో శాలమాల నది ఒడ్డున ఉంది. దట్టమైన అడవులు గుండా ఈ నది ప్రవహిస్తుంది. ఈప్రదేశానికి వేడుకలు లేదా మహా శివరాత్రి పండుగలు తప్పితే, సాధారణంగా యాత్రికులు ఇచ్చటకు రారు. పండుగలలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ దేవాలయానికి శివ భక్తులు అధికంగా వస్తారు. పూజలు చేయటమే కాక పర్యాటకులు ఈ దేవాలయంలోని ప్రవహించే నదిలోని సహస్ర శివలింగాలను దర్శించేందుకు కూడా వస్తారు. ప్రతి లింగానికి ఎదురుగా ఒక నంది కూడా ఉండడం గమనార్హం.
ఓం నమశివాయ —
(గుంటూరు నారయణ గారు మూల రచన)
No comments:
Post a Comment