నండూరి సుబ్బారావుగారు ఎంకి,నాయుడుబావ అనే రెండు పాత్రలు సృస్టించారు.పల్లె ముంగిట విరిశిన రెండు పువ్వులు వారు.ఎంకి పాటలు పండిత,పామరుల మనసు గెలుచుకున్నాయి.ఏ పాటకు ఆపాటే ఒక రమ్య కావ్యంగా ఉండి ఆణిముత్యాలవంటివై రసజ్ఞ లోకాన్ని ఆకర్షించాయి. ముద్దుల నాఎంకి గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ కూకుండనీదురా కూసింతసేపు ! నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది, యెల్లి మాటాడిస్తె యిసిరి కొడతాదీ ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది, దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
యీడుండమంటాది యిలు దూరి పోతాది, యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ మందొ మాకో యెట్టి మరిగించినాదీ, పల్లకుందామంటె పాణమాగదురా ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
ఎంకి ముచ్చట్లు
ఎన్నాని సెప్పేది ఎంకి ముచ్చట్లు
ఏటి సెప్పేది నా ఎంకి ముచ్చట్లు ? దొడ్డి తోవ కళ్ళె తొంగి సూడంగానె 'తోటకాడే వుండు తొరగొస్త' నంటాది ! ఎన్నాని సెప్పేది......... ఎంకి రాలేదాని యేటొ సూత్తావుంటె
ఎనకాలగా వచ్చి 'ఎవురు వో'రంటాది ! ఎన్నాని సెప్పేది....... 'సిట్టీ సేబా'సాని నిట్టూరమేత్తుంటె మాటా యినబడనట్టు మరిఏటొ సెపుతాది ! యెన్నాని సెప్పేది....... 'కోడి గూసేసరికి కొంపకెల్లాలి, నీ కోసరమె సెపుతాను కోపమొ'ద్దంటాది ! ఎన్నాని సెప్పేది..... ఎంత సేపున్నాను యిడిసి పెట్టాలేవు తగువోళ్ళలో మనకి తలవొంపు'లంటాది ! ఎన్నాని సెప్పేది..... ఎనకెనక సూత్తానె ఎల్లుతావుంటాది, ఎన్నాని సెప్పేది ఎంకి ముచ్చట్లు ఏటి సెప్పేది నా ఎంకి ముచ్చట్లు ?
అణకువ ఎంతెంత దూరాన ఎందరిలొ నే నున్న- సూటిగా నావెనుక చూసె నా ఎంకి చురికి నేతనవైపు తిరుగవలసినదే ! ఏటవల నేబోయి యిల్లుచేరని రేయి- ఏటదీపము పళ్ళ నిడినదా ఎంకి వెలుగులో నేనచట మొలవవలసినదే ! కథ నడుమ మాజోడు నిదుర దోగిన నాడు- కథ కొస తళుకుగోరి కల గనెన ఎంకి కలను నే జొరి కథలు తెలుపవలసినదే !
ముసుముసులు
ఎంకి జలకపు పలుకు లెచట నిడుకొందు ? ఎంతదాచిన చెణుకు లెగురు నిందందు ! మడుగున జలకమాడ మానీడ లలలపై గోరంత మా నటన కొండంత జేసెనట ! ఎంకి జలకపు.... నీలపై మా రహ స్యాలగొని తీరతీ రాల పరుగిడి, మమ్ము, గాలె యెగతాళియట ! ఎంకి జలకపు.... మెరుపు మేఘుల మించు సరసులను మముగాంచి ఆకసమెవులికి మడు గడుగున పడినదంట ! ఎంకి జలకపు.... రతనాల వేదికను రవల చాందిని కింద ముత్తెపు తలంబ్రాలు ముసిముసుల పెళ్ళంట ! ఎంకి జలకపు...
No comments:
Post a Comment