ప్రకృతితో మనిషి సహజీవనం చేసే అసలైన పండుగ సంక్రాంతి
రంగవల్లులు,భోగిపండ్లు,బొమ్మలకొలువులు,పల్లెసీమలు,గంగిరెద్దులు,హరిదాసులు,కోడిపందాలు,పతంగులు,ఎడ్లపందాలు,ధాన్యపురాసులు,గోమాతలపూజలు,అంతకుమించి అమ్మ చెసే పిండివంటలు....ఇవన్నీ కలగలిపి చేసుకునే అపురూపమైన అతి పెద్దపండుగే సంక్రాంతి.. కస్టాలు భోగిమంటల్లో ఆహుతై ఈ సంక్రాంతి నుండి కొత్త ఆశల కిరణాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రసరించాలని కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు.
సంక్రాంతి పండుగలో ముఖ్యంగా సూర్య భగవానుడుకి నివేదించే నివేదన 'పొంగలి '' ఈ పొంగలిని కొత్త కుండలో ఆవుపాలను పొంగించి ,మిగిలిన పాలతో పొంగలిని తయారుచేస్తారు .దానివలన ఆ ఇంటి సిరిసంపదలు పొంగి ప్రవహించాలని కోరుకుంటారు .ధాన్య లక్ష్మి ఇంటికిచేరిన ఈ సమయంలో కొత్తబియ్యము ,పాలు ,చెరకురసం ,ఆవు నెయ్యి కలిపి పొంగలి చేస్తారు .దీనిని సూర్య భగవానుడుకి నివేదన చేస్తారు .ఈ పండుగ రోజున సూర్యుడినిపూజించటం వలన ఇల్లంతా సిరి సంపదలతో వృద్ది చెందుతుందని భావిస్తారు .
చిన్నప్పుడు చూసిన గంగిరెద్దుల ఆట ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. సన్నాయి, డప్పువాయిద్యం లయబద్దంగా వాయిస్తుంటే కాళ్ళకి గజ్జెలు కట్టిన బసవన్న నాట్యం చేసేది. `అయ్యవారికీ దణ్ణం పెట్టు, అమ్మగారికీ దణ్ణం పెట్టు,` అంటే ముందరి కాళ్ళు రెండూ పైకెత్తేది. ఎర్రని గుడ్డ చుట్టబెట్టిన మూపురం బసవన్న అడుగులు వేస్తుంటే చక్కగా ఊగేది. మూపురం వెనుకనుంచి తోకవరకూ కప్పిన రంగురంగుల మువ్వల బొంత, దానిమీద పరిచిన కండువాలు, పట్టుచీరలు; వీటన్నింటికీ మించి వొంపుతిరిగిన కొమ్ములకి చివరిలో తళతళా మెరిసే ఇత్తడి తొడుగులు. సూత్రదారుడు చెపితే పీటమీద నిలబడేది, అతను వెల్లకిలా నేలమీద పడుకొంటే గుండెలమీద కాళ్ళు ఆనించి నిలబడేది.
ఒకరకమైన యాసతో కర్ణపేయంగా గంగిరెద్దులవాడు ఓ నాలుగు ముక్కలు చెపుతుంటే పండుగ కళ వస్తుంది. ఎర్రటి తలపాగాలు ధరించి, తెల్ల పంచ, చొక్కా, దానిమీద నల్ల కోటూ వేసుకొని పాతబడ్డలు కావాలని, బసవన్నకి బియ్యం ఇవ్వమని, డబ్బులు కావాలని అడుగుతారు.
సంక్రాంతి ముగ్గు
భోగి మంటలు

సంక్రాంతి గొబ్బిళ్ళు
పొంగళ్ళు
పల్లె ముంగిళ్ళలో ధాన్యలక్ష్మి
హరిదాసు
గాలిపటాల సరదాలు
గంగిరెద్దుల మేళాలు
గోమాతల పూజ
బొమ్మల కొలువు
భోగిపండ్లు పేరంటం
నవ్వులు ప్రతి ఇంట పూయాలని నువ్వు, బెల్లాలు
బూరెలు
సంక్రాంతి అరిసెలు
పూతరేకులు
మైసూర్ పాకం
ఈ సంక్రాంతి శోభ ప్రతి ఇంటా పూయాలని ఆకాంక్ష.......
No comments:
Post a Comment