flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Sunday, January 19, 2014

చిన్ని ఆశ



ఒక నావికుడు తుఫానులో తన పడవను కోల్పోయి ఏదో దైవవశాత్తు ప్రాణాలతో ఒక దీవిలోకి వెళ్ల గలుగుతాడు ... కట్టు బట్టలతో బయట పడినా... ప్రాణాలు దక్కాయని సంతోష పడతాడు... ఇక ఆరోజు నుండి ఆ దీవి నుండి బయట పడటానికి శత విధాలా ప్రయత్నిస్తాడు.. కానీ అతని ప్రయత్నాలేవీ ఫలించవు... చివరికి విసిగి విసిగి వేసారీ.. అక్కడే నివసించేందుకు మానసికంగా సిద్ధపడతాడు... అతను రోజు... ఏదో ఒక వస్తువు సేకరించటం చేస్తూ...... చివరికి స్వంతంగా ఒక గుడిసెను ఏర్పరచుకుని... కావలసిన వస్తువులన్నిటినీ సమ కూర్చుకో సాగాడు... జీవితం హాయిగా గడచి పోతుందనుకున్న సమయంలో ... ఒకసారి ఆహారానికి బయటకు వెళ్ళిన సమయం లో  నిప్పు వలన అతని గుడిసె మరియు అతను సమకూర్చుకొన్న అన్ని వస్తువులు తగుల పడి పోతాయి... మళ్ళీ అతను నిలువ నీడ లేక ఒంటరిగా మిగిలి పోయే పరిస్థితి ... ఈ సారి అతను హృదయ విదారకంగా రోదిస్తూ... హే భగవంతుడా... నన్ను ఎందుకు ఇలా పరీక్ష పెడతావు... నాతో  ఇంకా ఎందుకు ఆడుకుంటావు...... నా ద్వారా  ఇంకా ఏమి చేయాలనుకుంటూ న్నావు ..... నీ ప్రయత్నం నాకు అర్ధం కావటం లేదు... దయ చేసి నాకు తెలియచేయి... అని హృదయ పూర్వకంగా రోదిస్తూ అడుగుతాడు.... అపుడు ఆ ధ్యానంలో ఉండగానే.. ఒక ఓడ వచ్చి అతని దగ్గర ఆగి... ఓ బాబు... నీవు ఇక్కడ చిక్కు పడినట్లు ఉన్నావు ... మేము వెళ్ళబోతూ పైన ఏర్పడిన పొగను చూసి... ఎవరో ఆపదలో ఉన్నారని గ్రహించి ఇక్కడకు వచ్చాము... వచ్చి ఈ ఓడ ఎక్కు మిమ్మలిని మీ గమ్యం చేరుస్తాం... అని అడుగుతాడు... అపుడు అర్ధమవుతుంది... ఆ నావికుడికి  దేవుడు ఏమిచేశాడో... మనకు ఒక్కొక్కసారి సమస్యలు వచ్చినపుడు ... దేవుడిని ఆ సమస్య తీర్చమని అడుగుతూ ఉంటాం .. అది సరికాదు... దేవుడు మనతో ఏమి చేయించాలని అనుకుంటు న్నాడో మనకు తెలియదు... అందుకే అపుడు మనం చేసే ప్రార్ధన... పై విధంగా ఉండాలి... అపుడు ఖచ్చితంగా దేవుడు బదులిస్తాడు... మనం నడి సముద్రంలో చిక్కుకు పోయామని కట్టు బట్టలతో మిగిలామని బాధ పడనవసరం లేదు... ఇవన్నీ లేకపోయినా ఎలా జీవించవచ్చో... మనకు నేర్పాలని అనుకుంటూ న్నడేమో దేవుడు... అందుకే సమస్య వచ్చినపుడు... ఆ సమస్యను తీర్చమనే దానికన్నా... ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని అడగటం మంచిది...


No comments:

Post a Comment