flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Tuesday, January 7, 2014

ప్రాప్తం

                                                                                 

                                                                             

  మనకు ఎంత ప్రాప్తం ఉందో అంతేలభిస్తంది.చిన్న చెంబు తీసుకొని నదికి వెళ్ళి బిందె నీళ్ళు తెచ్చుకోలేముకదా!నా చిన్నప్పుడు మా తాతయ్యగారు(కామేశ్వరశాస్త్రిగారు)చెప్పిన కధగుర్తు వచ్చింది అది మీకు చెప్పే ప్రయత్నమే ఈ చిన్నికధ.

పార్వతీపరమేశ్వరులు మంచుకొండల్లో ఉంటారుకదా!ఓ సుప్రభాతవేళ పార్వతి అడుగుతుంది శివుని నాధా!మనం ఈ మంచుకొండల్లో ఎన్నినాళ్ళు జీవనం చేస్తాం.మంచి గృహం నిర్మించుకుందాం ఇది నా చిన్ని కోరిక మీరు ఒప్పుకొని తీరాల్సిందే.అందుకు శివుడు మనం ఉండాల్సింది ఈ మంచు శిఖరాల్లోనే మనకు ఇదే ప్రాప్తమని చెపుతాడు.ప్రయత్నంతో కానిది ఏమియు లేదుకదా!గృహం కట్టాలని మీరు సంకల్పించండి అని చెపుతుంది పార్వతీదేవి. ఆమె మాట కాదనలేక శివుడు వాస్తుశిల్పి విశ్వకర్మను పిలిచి లంకానగరం నిర్మింపజేశారు.ఇక గృహప్రవేశం చేయడానికి పురోహితునిగా రావణాసురుని పిలిచి అంగరంగవైభవంగా గృహప్రవేశం చేస్తారు.శివుడు పురోహితునితో(రావణునితో) మీ పౌరోహిత్యం మాకు సంతోషం కలిగించింది ఏంకావాలో కోరుకోండి రావణా అనగా! అందుకు రావణుడు ఈ లంకాపట్టణం బహు సుందరంగా ఉంది దీనినే నేను కానుకగా కోరుతున్నను అని చెప్పగా....వెంటనే శివపార్వతులు లంకానగరం రావణునికి కానుకగా ఇచ్చి మళ్ళీ మంచుకొండలకు వెళ్ళిపోయారు.


   
   

No comments:

Post a Comment