ఉద్దాలకుడు ఒక ముని.అతడు చాలకాలం తపస్సు చేశాడు. . ఆ తర్వాత కొంతకాలానికి చెండిక అనే కన్యను వివాహం చేసుకొన్నాడు..ఆమె ప్రవర్తన ఉద్దాలకునికి నచ్చేదికాదు.అతడు ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా చేసేది చెండిక.ఉద్దాలకుడు విసిగిపోయి తన అవస్థను కౌండిన్యమునికి చెప్పుకొని బాధపడ్డాడు.అప్పుడు ఆయన నీకు ఏది కావాలో దానికి వ్యతిరేకంగా మార్చి చెప్పు అని సలహా ఇచ్చాడు.ఉద్దాలకుడు ఆప్రకారం నడుచుకొంటూ తన కార్యసాఫల్యం చేసుకొంటున్నాడు.ఒకనాడు అతని ఇంట పితృకార్యం వచ్చింది.నేడు మన ఇంట పితృకార్యం కనుక బ్రాహ్మణులను భోజనానికి పిలువను.నీవు వంటచేసినా స్నానము చెయ్యకుండా అశుచివై వంటచెయ్యమన్నాడు.ఆమె ఉదయాన్నే లేచి బ్రాహ్మణులను పిలిచి స్నానంచేసి మడికట్టుకొని వంటచేసింది.బ్రాహ్మణులు భోజనానికి కూర్చున్నారు.నీవు వడ్డించవద్దు అని భర్త అన్నాడు. ఆమె వారికి చక్కగా భోజనం వడ్డించింది.ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం చక్కగా జరిగిపోవటం ఉద్దాలకుడికి ఆనందంకలిగించింది.చివరలో పారణ జాగ్రత్తగా పెట్టమని చెప్పాడు.ఆమె దానిని చెత్తకుప్పలో పారవేసింది.ఉద్దాలకుడు మహా కోపముతో నీవు శిలవై వింధ్యపర్వతము మీద ఉండు అని శపించాడు.ఆమె శాపవిమోచనము చేయమని వేడుకొనగా ధర్మరాజు యాగాశ్వము నిన్ను త్రొక్కినపుడు నీకు శాపవిమోచనం కలుగుతుందని ఉద్దాలకుడు చెప్పాడు.
Wednesday, January 8, 2014
ఎడ్డెం అంటే తెడ్డెం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment