flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Tuesday, January 14, 2014

మదాలస చరిత్ర

                 "విశ్వావసుడు"అను గంధర్వరాజు కూతురు"మదాలస".ఆమె మిక్కిలి సౌందర్యవతి."పాతాళకేతుడు"అనే రాక్షసుడు ఆమెను ఎత్తుకుపోయి ఒక గుహలో దాస్తాడు.మదాలస అది భరించలేక ప్రాణత్యాగానికి ప్రయత్నిస్తుంది.అంతలో సురభి దేవత చెపుతుంది...రాక్షసుడు నీకు భర్త కాడు,ఆ రాక్షసుని చంపటానికి వచ్చిన రాకుమారుడు నీకు భర్త అవుతాడని. ఆమాటలకు సంతోషించి ధైర్యం తెచ్చుకొని గుహలో కాలం
గడుపుతూవుంది.కొంత కాలానికి"పాతాళకేతుని" చంపటానికి "కువలయాశ్వుడు" అను రాజు రాక్షసుని వెంటాడుతూ వస్తాడు.రాక్షసుడు వరాహ రూపంలో గుహలోకి ప్రవేసిస్తాడు.రాజుకూడా తరుముతూ ఆ గుహలోకి వస్తాడు.అక్కడ "మదాలస"ను,ఆమె చెలికత్తె "కుండల"ను చూసి విస్మయం చెందుతాడు."మదాలస""కువలయాశ్వుడు"  ప్రేమించుకుంటారు.రాక్షసుని చంపి "మదాలస"ను వివాహం చెసుకొని విజయనగర రాజ్యం తీసుకొని వెళ్ళి సుఖ జీవనం చేస్తారు.
 కొంతకాలానికి "కువలయాశ్వుడు" మారువేషంలో దేశసంచారం చేస్తున్న సమయంలో రాక్షసుని ఆత్మ మునిరూపంలో వచ్చి రాజు చనిపోయాడని,రాజు కంఠమాలను "మదాలస"కు ఇస్తాడు.కంఠమాలను గుర్తించి ముని మాటలు నమ్మి "మదాలస"ప్రాణం విడుస్తుంది.కొన్ని రోజులకు రాజు మందిరానికి వచ్చి "మదాలస"మరణించిందని తెలిసి విరాగిలా మారిపోతాడు.రాజు దుఃఖం పోగొట్టుటకై "యశ్వతరుడు"అనే పేరుగల నాగేంద్రుడు తపస్సు చేసి "మదాలస"ను పొంది ""కువలయాశ్వ"రాజుకు ఆమెను అప్పగిస్తాడు.రాజు "మదాలసతో సహా చక్కని రాజ్యపాలన చేస్తాడు. వీరికి "విక్రాంతుడు","సుబాహువు","శతుమర్ధనుడు","అలర్కుడు"అనే నలుగురు కుమారులు జన్మించారు."మదాలస"కుమారులకు ధర్మములను,బ్రహ్మజ్ఞానమును బోధించి మంచి మార్గములో వారిని పెంచింది.            
 
     

No comments:

Post a Comment